
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) బాధ్యతల్ని అప్పగించారు. ఈ తరుణంలో నాడు విద్యార్థిగా ఉన్న వివేక్ రామస్వామి బ్యూరోక్రసీని వ్యతిరేకిస్తూ ప్రసంగించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2003లో 18 ఏళ్ల రామస్వామి ఒహాయోలోని సెయింట్ జేవియర్ స్కూల్‌లో తన జర్నీని ఉద్దేశించి మాట్లాడారు. ఆ ప్రసంగం ఇప్పుడు వైరల్ కావడంపై వివేక్ స్పందించారు. విద్యార్థిగా ఉన్న తాను బ్యూరోక్రసీని వ్యతిరేకించాను అని నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశారు. ప్రస్తుతం తాను అనుసరిస్తోన్న భావజాలం ఆనాటి నుంచే ఉందనే ఉద్దేశంలో రాసుకొచ్చారు.
కాగా, ఒహియోలోని సిన్సినాటిలో పుట్టి పెరిగిన రామస్వామి జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు. అతని హైస్కూల్ వాలెడిక్టోరియన్. హార్వర్డ్ నుంచి బయోలజీలో గ్రాడ్యుయేషన్ యేల్ లా స్కూల్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు.
Vivek Ramaswamy, 18 years old. his High School Graduation Speech of 2003. pic.twitter.com/sG4kGLbqtL
— Brian Roemmele (@BrianRoemmele) November 13, 2024