రానా హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ | Madhavan and Rana in Krishna Vamshi Multistarrer | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 7 2018 4:06 PM | Last Updated on Wed, Feb 7 2018 4:06 PM

Rana Daggubati - Sakshi

హీరో రానా దగ్గుబాటి

వరుసగా ఆసక్తికర సినిమాలను చేస్తూ ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా. మరోక్రేజీ ప్రాజెక్ట్‌కు సైన్‌ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 1945, హాథీ మేరీ సాథీ, రాజా మార్తండ వర్మ సినిమాలలో నటిస్తున్న రానా ఓ టాలీవుడ్ సీనియర్‌ దర్శకుడితో సినిమా చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న క్రియేటివ్‌ డైరెక్టర్ కృష్ణవంశీ రానా హీరోగా ఓ ఇంట్రస్టింగ్ సినిమాను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

వరుస పరాజయాల తరువాత తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న కృష్ణవంశీ, కొత్త సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రానాతో పాటు తమిళ నటుడు మాధవన్‌ మరో కీలక పాత్రలో నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మరో హీరో పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement