‘‘ప్రతీక్ హీరోగా నటించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ చూసుకుంటూ డైరెక్ట్ చేశాడు. ఇవన్నీ చేయాలంటే కసి ఉండాలి. కసి ఉండబట్టే నేను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్‌ప్లే రైటర్, హీరో అయ్యా. ‘వానవిల్లు’ టీమ్‌లో మంచి కసి కనపడుతోంది. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ప్రతీక్ ప్రేమ్‌కరణ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘వానవిల్లు’. శ్రావ్య, విశాఖ హీరోయిన్లు. లంకా కరుణాకర్ దాస్ నిర్మాత. ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.
ప్రతీక్ ప్రేమ్‌కరణ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పట్నుంచి డైరెక్టర్ కావాలనే కోరిక ఈ రోజు నిజమైంది. నాన్న దగ్గరకు వెళ్లి నేను డైరెక్టర్ అవుతాననగానే, ఆయన ఎంకరేజ్ చేసి ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. రెండున్నరేళ్లుగా ఈ సినిమాతో జర్నీ చేస్తున్నా. ఈ సినిమా సక్సెస్ అయినా కాకపోయినా మళ్లీ సినిమా చేస్తా. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆ కష్టం తెరపై కనపడతుంది’’ అన్నారు. లంకా కరుణాకర్, ప్రభు ప్రవీణ్, నిర్మాత బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకుడు కోటి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్: ఎస్.డి. జాన్.
Comments
Please login to add a commentAdd a comment