vanavillu
-
ఆసక్తికర ప్రయత్నం 'వానవిల్లు'
లఘు చిత్రాల నేపథ్యం నుంచి వచ్చిన దర్శకులు వెండితెర మీద మంచి విజయాలు సాధిస్తున్నారు. అదే బాటలో మరో యువకుడు వెండితెర మీద అరంగేట్రం చేశాడు. లఘు చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా, దర్శకుడిగా స్వీయ నిర్మాణంలో ఓ సినిమాను తెరకెక్కించాడు. ప్రతీక్ కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు నటించిన ఈ సినిమా రొటీన్ ట్రయాంగులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఓ సస్పెన్స్ ఎలిమెంట్ తో రూపొందించారు. కథ విషయానికి వస్తే ప్రతీక్ సరదా ఫ్రెండ్స్ తో కాలం గడిపే కుర్రాడు. ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసే ప్రతీక్ తన ఫ్రెండ్ వాసు కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. వాసు ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారని తెలుసుకున్న ప్రతీక్ ఆ అమ్మాయిని తీసుకొచ్చేందుకు వెళతాడు. ఇంటి ముందు వెయిట్ చేస్తే చాలు ఆ అమ్మాయే వచ్చి బైక్ ఎక్కుతుందని వాసు చెప్పటంతో ముఖం కూడా తెలియని అమ్మాయి తీసుకొచ్చేందుకు ఒప్పుకుంటాడు. కానీ విషయం తెలుసుకున్న అమ్మాయి మనుషులు వెంబడిస్తారు. పారిపోయే ప్రయత్నంలో అమ్మాయితో సహా లోయలో పడిపోతాడు. ప్రతీక్ ను కొంతమంది మెడికోలు కాపాడి ట్రీట్ మెంట్ చేస్తారు. కానీ తనతో పాటు లోయలో పడ్డ అమ్మాయి ఎమయ్యిందో మాత్రం తెలియదు. ఆమె ముఖం కూడా తెలియన ప్రతీక్, లోయలో పడిన సమయంలో ఆమె నడుము మీద ఉన్న టాటూను చూసి దాని ఆధారంగా అమ్మాయిన వెతికే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో తనను కాపాడిన మెడికోల్లో ఒకరైన నిత్యతో ప్రేమలో పడతాడు. చివరకు ప్రతీక్ వెతుకుతున్న టాటూ అమ్మాయి దొరికిందా..? అసలు ఆ అమ్మాయి ఎవరు, ఏమయ్యింది..? అన్నదే మిగతా కథ. వెండితెరకు కొత్తే అయినా హీరో ప్రతీక్, హీరోయిన్ శ్రావ్యరావ్ తమపరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా డ్యాన్స్ ల్లో ప్రతీక్ చూపించిన ఈజ్ ఆకట్టుకుంటుంది. హీరోగానే కాదు దర్శకుడిగానూ ప్రతీక్ మంచి ప్రయత్నమే చేశాడు. ఆసక్తికర సన్నివేశంతో సినిమాను మొదలుపెట్టి, ఆ సస్పెన్స్ ను చివరి వరకు కొనసాగించటంలో సక్సెస్ సాధించాడు. టేకింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. హీరోగానే కాక నిర్మాతగా, ఎడిటర్ గానూ తానే వ్యవహరించిన ప్రతీక్ చాలా సందర్భాల్లో తడబడ్డాడు. ఓవరాల్ గా రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు సస్పెన్స్ ఎలిమెంట్ జోడించి ప్రతీక్ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది. -
ఇష్టం ఉంటే కష్టం అనిపించదు
లంకా ప్రతీక్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘వానవిల్లు’. శ్రావ్య, విశాఖ హీరోయిన్లు. లంకా కరుణాకర్ దాస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ప్రతీక్ మాట్లాడుతూ– ‘‘ఇందులో జాలీగా ఉండే ఇంజనీరింగ్ కుర్రాడిగా కనిపిస్తా. ఇద్దరు హీరోయిన్లున్నారని రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఒక సస్పెన్స్ ఉంటుంది. నవ్వుకుంటూ సినిమా చూడొచ్చు. స్క్రీన్‌ప్లే ట్రిక్కీగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి టెక్నికల్ విషయాల మీద ఆసక్తి ఎక్కువ. అందుకే డైరెక్షన్ చేశా. ఈ చిత్రంలో నేను హీరోగా నటించాలనుకోలేదు. నా షార్ట్ ఫిల్మ్స్‌లో నేనే నటించేవాణ్ణి. అందుకేనేమో హీరోగా నన్నే చేయమని ఐడియా ఇచ్చారు నాన్నగారు. ఇష్టంతో చేసే పని కష్టంగా అనిపించదు. కాబట్టే డైరెక్షన్, యాక్షన్ కష్టం అనిపించలేదు. కానీ, ప్రొడక్షన్ కష్టంగా అనిపించింది. 100 నుంచి 120 థియేటర్స్‌లో సినిమా రిలీజవుతోంది. అవి కూడా దొరకవేమో అనుకున్నా’’ అన్నారు. -
కసి ఉంటేనే అనుకున్నది సాధిస్తాం – ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘ప్రతీక్ హీరోగా నటించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ చూసుకుంటూ డైరెక్ట్ చేశాడు. ఇవన్నీ చేయాలంటే కసి ఉండాలి. కసి ఉండబట్టే నేను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్‌ప్లే రైటర్, హీరో అయ్యా. ‘వానవిల్లు’ టీమ్‌లో మంచి కసి కనపడుతోంది. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ప్రతీక్ ప్రేమ్‌కరణ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘వానవిల్లు’. శ్రావ్య, విశాఖ హీరోయిన్లు. లంకా కరుణాకర్ దాస్ నిర్మాత. ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ప్రతీక్ ప్రేమ్‌కరణ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పట్నుంచి డైరెక్టర్ కావాలనే కోరిక ఈ రోజు నిజమైంది. నాన్న దగ్గరకు వెళ్లి నేను డైరెక్టర్ అవుతాననగానే, ఆయన ఎంకరేజ్ చేసి ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. రెండున్నరేళ్లుగా ఈ సినిమాతో జర్నీ చేస్తున్నా. ఈ సినిమా సక్సెస్ అయినా కాకపోయినా మళ్లీ సినిమా చేస్తా. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆ కష్టం తెరపై కనపడతుంది’’ అన్నారు. లంకా కరుణాకర్, ప్రభు ప్రవీణ్, నిర్మాత బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకుడు కోటి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్: ఎస్.డి. జాన్. -
200మంది.. రెండున్నరేళ్ల కష్టం
‘‘ఒక సినిమా చేయాలంటే 4 స్తంభాల్లాంటి వారి సపోర్ట్ కావాలి. ఆ నాలుగు స్తంభాలు నాకు ఉండటంతో ‘వానవిల్లు’ సినిమా చేయగలిగా. 200 మంది రెండున్నరేళ్ల కష్టమే ఈ సినిమా. ఈ నెలలోనే విడుదల చేయనున్నాం’’ అని లంకా ప్రతీక్‌ప్రేమ్ కరణ్ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘వానవిల్లు’. శ్రావ్యా రావు, విశాఖ హీరోయిన్స్. లంకా కరుణాకర్ దాస్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని నటుడు కాశీ విశ్వనాథ్ రిలీజ్ చేశారు. కరుణాకర్ దాస్ మాట్లాడుతూ– ‘‘ఎన్‌హెచ్ 7’ సినిమా తర్వాత నా తనయుడు ప్రతీక్ చేసిన చిత్రమిది. సమాజానికి ఉపయోగపడేలా ఒక సినిమా చేయాలనుకొని ఈ చిత్రం చేశాం. ఫ్యామిలీ, యూత్, సమాజానికి ఏం కావాలో అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘తమిళ దర్శకుడు సుందర్ రాజేంద్రన్ క్వాలిటీస్ ప్రతీక్‌లో కనిపిస్తున్నాయి. చాలా క్లారిటీగా సీన్స్ తీశాడు. టైటిల్లో క్లాస్, ట్రైలర్లో మాస్ కనిపిస్తోంది’’ అన్నారు కాశీ విశ్వనాథ్. చిత్ర సంగీతదర్శకుడు ప్రభు, డైరెక్టర్ చిన్నికృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, నటి అనితా చౌదరి పాల్గొన్నారు. -
ప్రేమకథలో వర్షం ఏం చేసింది?
ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘వానవిల్లు’. శ్రావ్య, శ్రీ సయ్యిని హీరోయిన్లు. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై లంకా కరుణాకర్ దాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘టైటిల్‌కి తగ్గట్టు ఓ అందమైన వెరైటీ ప్రేమకథ ఇది. అందులో వర్షం ఏం చేసింది? అనేది ఆసక్తికరం. కేరళ, మలేసియాలలో కొంత టాకీ, సాంగ్స్ షూట్ చేశాం. సెప్టెంబర్ మొదటివారంలో లాస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ నెలాఖరున టీజర్ విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రభాస్ శీను, సత్య, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్: పవన్, మ్యూజిక్: ప్రభు ప్రవీణ్.