ప్రేమకథలో వర్షం ఏం చేసింది?
ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘వానవిల్లు’. శ్రావ్య, శ్రీ సయ్యిని హీరోయిన్లు. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై లంకా కరుణాకర్ దాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘టైటిల్‌కి తగ్గట్టు ఓ అందమైన వెరైటీ ప్రేమకథ ఇది.
అందులో వర్షం ఏం చేసింది? అనేది ఆసక్తికరం. కేరళ, మలేసియాలలో కొంత టాకీ, సాంగ్స్ షూట్ చేశాం. సెప్టెంబర్ మొదటివారంలో లాస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ నెలాఖరున టీజర్ విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రభాస్ శీను, సత్య, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్: పవన్, మ్యూజిక్: ప్రభు ప్రవీణ్.