లంకా ప్రతీక్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘వానవిల్లు’. శ్రావ్య, విశాఖ హీరోయిన్లు. లంకా కరుణాకర్ దాస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ప్రతీక్ మాట్లాడుతూ– ‘‘ఇందులో జాలీగా ఉండే ఇంజనీరింగ్ కుర్రాడిగా కనిపిస్తా. ఇద్దరు హీరోయిన్లున్నారని రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఒక సస్పెన్స్ ఉంటుంది. నవ్వుకుంటూ సినిమా చూడొచ్చు. స్క్రీన్‌ప్లే ట్రిక్కీగా ఉంటుంది.
నాకు చిన్నప్పటి నుంచి టెక్నికల్ విషయాల మీద ఆసక్తి ఎక్కువ. అందుకే డైరెక్షన్ చేశా. ఈ చిత్రంలో నేను హీరోగా నటించాలనుకోలేదు. నా షార్ట్ ఫిల్మ్స్‌లో నేనే నటించేవాణ్ణి. అందుకేనేమో హీరోగా నన్నే చేయమని ఐడియా ఇచ్చారు నాన్నగారు. ఇష్టంతో చేసే పని కష్టంగా అనిపించదు. కాబట్టే డైరెక్షన్, యాక్షన్ కష్టం అనిపించలేదు. కానీ, ప్రొడక్షన్ కష్టంగా అనిపించింది. 100 నుంచి 120 థియేటర్స్‌లో సినిమా రిలీజవుతోంది. అవి కూడా దొరకవేమో అనుకున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment