
విశాఖ: కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో ఈసారి జీవీఎంసీ ప్రదర్శన ఆశించిన మేర ఉండేలా కనబడటం లేదు. నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. ఈ సర్వే కోసం సచివాలయ సిబ్బందిపై జీవీంఎసీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేయాల్సిన సర్వేను.. సచివాలయ సిబ్బందికి అప్పగించారు.
ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి 300 మంది ప్రజలు ఓటీపీలు సేకరించాలని ఆదేశించారు. అయితే ఓటీపీలు చెప్పడానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. దాంతో జోనల్ కమిషనర్ శివప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనుకున్న టార్గెట్ చేరలేకపోయారంటూ సచివాలయ సిబ్బందికి నోటీసులు పంపారు శివ ప్రసాద్. ఆయన తీరుతో సచివాలయ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేయించాల్సిన సర్వేను తమతో చేయించడంపై మండిపడుతున్నారు.
