
సాక్షి,శ్రీకాకుళం (కాశీబుగ్గ): సినీ చరిత్రలో పలాసకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఏ సినిమా విడుదలైనా ఇక్కడ ప్రజలు ఆదరించి భారీ కలెక్షన్లు పంపేవారన్నారు. ఇప్పుడు పలాస ప్రాంతానికి చెందినవారే సినిమాలు తీయడం సంతోషకరమన్నారు. శుక్రవారం ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా విడుదల సందర్భంగా పలాసలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పలాస మండలంలో మారుముల కంట్రగడ గ్రామంలో పుట్టిపెరిగిన కరుణ కుమార్ ‘పలాస–1978’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై రికార్డు సృష్టించారన్నారు.
ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’ బడ్జెట్ సినిమా తీసి దేశవ్యాప్తంగా విడుదల చేయడం ఆనందదాయకమన్నారు. పలాస అన్ని రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటూ వస్తోందన్నారు. ఈ సినిమాలో పదుల సంఖ్యలో నటీనటులు ఈ ప్రాంతానికి చెందినవారు ఉండడంతో పలాసకు కళ వచ్చిందన్నారు. డైరెక్టర్ కరుణ కుమార్ తల్లి సరోజినమ్మకు అభినందనలు తెలియజేశారు. చిత్రంలో నటించిన నటులు మంత్రి అప్పలరాజును సత్కరించారు. కార్యక్రమంలో నటుడు గార రాజారావు, మల్లా భాస్కరరావు, పెంట రాజు, దువ్వాడ హేమబాబు చౌదిరి, కోత పూర్ణచంద్రరావు, పైల చిట్టి, జోగి సతీష్, దువ్వాడ మధుబాబు, ఉంగ సాయి ఉన్నారు.
చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా
Comments
Please login to add a commentAdd a comment