cini industry
-
‘శ్రీదేవి సోడా సెంటర్’ రిలీజ్: కేక్ కట్ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం (కాశీబుగ్గ): సినీ చరిత్రలో పలాసకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఏ సినిమా విడుదలైనా ఇక్కడ ప్రజలు ఆదరించి భారీ కలెక్షన్లు పంపేవారన్నారు. ఇప్పుడు పలాస ప్రాంతానికి చెందినవారే సినిమాలు తీయడం సంతోషకరమన్నారు. శుక్రవారం ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా విడుదల సందర్భంగా పలాసలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పలాస మండలంలో మారుముల కంట్రగడ గ్రామంలో పుట్టిపెరిగిన కరుణ కుమార్ ‘పలాస–1978’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై రికార్డు సృష్టించారన్నారు. ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’ బడ్జెట్ సినిమా తీసి దేశవ్యాప్తంగా విడుదల చేయడం ఆనందదాయకమన్నారు. పలాస అన్ని రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటూ వస్తోందన్నారు. ఈ సినిమాలో పదుల సంఖ్యలో నటీనటులు ఈ ప్రాంతానికి చెందినవారు ఉండడంతో పలాసకు కళ వచ్చిందన్నారు. డైరెక్టర్ కరుణ కుమార్ తల్లి సరోజినమ్మకు అభినందనలు తెలియజేశారు. చిత్రంలో నటించిన నటులు మంత్రి అప్పలరాజును సత్కరించారు. కార్యక్రమంలో నటుడు గార రాజారావు, మల్లా భాస్కరరావు, పెంట రాజు, దువ్వాడ హేమబాబు చౌదిరి, కోత పూర్ణచంద్రరావు, పైల చిట్టి, జోగి సతీష్, దువ్వాడ మధుబాబు, ఉంగ సాయి ఉన్నారు. చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా -
ఆ లిస్ట్ చాలానే ఉంది : హీరోయిన్
మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్యమీనన్ కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ఇటీవల కాస్టింగ్ కౌచ్ సినీ పరిశ్రమలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే అలాంటివేమి తనకు ఎదురుకాలేదని ఈ బామ చెప్పుకొచ్చింది. టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నట్లు ఐశ్వర్యమీనన్ తెలిపింది. ఆ చిత్ర వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. అంతేకాక ఈత దుస్తులు ధరించడానికైనా సరే.. అయితే లిప్‌లాక్ సన్నివేశాల్లో మాత్రం నటించను అని ఐశ్వర్యమీనన్ స్పష్టం చేసింది. అంతేకాక ఏ హీరోలతో నటించాలని ఆశ పడుతున్నారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. చెప్పాలంటే ఆ లిస్ట్ చాలానే ఉందన్నారు. విజయ్, అజిత్, శివకార్తికేయన్ ఇలా చాలా మందితో నటించే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అదే విధంగా తెలుగులో మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇలా చాలా మంది నాకిష్టమైన హీరోలు అని హీరోయిన్ చెప్పింది. అయితే ఈ అమ్మడు పుట్టి పెరిగింది, చదివింది తమిళనాడులోనే. కన్నడం, మలయాళం, తమిళ్, తెలుగు అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీతో సాక్షి చిన్న భేటీ.. మీ సినీ రంగప్రవేశం ఎలా జరిగింది? నేను పుట్టింది తమిళనాడులోని ఈరోడ్డులో. ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశాను. బీటెక్‌ను చెన్నైలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో చేశాను. అమ్మనాన్న, సోదరుడు అందరూ విద్యావేత్తలే. నేను ఇంజినీరింగ్ చదివినా నటన అంటే చిన్నతనం నుంచి ఆసక్తి. అందుకే చాలా ఆడిషన్స్‌కు వెళ్లాను. అలా తొలుత కన్నడంలో హీరోయిన్ అవకాశం వచ్చింది. ఆ తరువాత మలయాళంలో ఎంట్రీ అయ్యాను. ఆ చిత్రాల్లో నా నటనను చూసే తమిళంలో వీర చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. అందులో నటించిన కృష్ట నా తొలి హీరో. గత శుక్రవారం తెరపైకి వచ్చిన తమిళ్ పడం–2 కు ఇక్కడ హీరోయిన్గా రెండవ చిత్రం. తమిళ్ పడం–2లో నటించిన అనుభవం గురించి? సీఎస్.అముదన్ దర్శకత్వం వహించిన తమిళ్ పడం నా ఫేవరేట్ చిత్రం. అది నేను చదువుకుంటున్న రోజుల్లో విడుదలైంది. దానికి రెండవ భాగం తమిళ్ పడం–2లో కథానాయకిగా నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. నన్ను నమ్మి ఇందులో అవకాశం ఇచ్చిన దర్శకుడు సీఎస్.అముదన్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తమిళ్ పడం–2లో నటించడం మంచి అనుభవం. కథానాయకిగా నాకిది ఐదవ చిత్రం. తమిళంతో పాటు, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటిస్తున్నారు. వీటిలో ఏ భాషా చిత్రానికి ప్రాముఖ్యతనిస్తారు? తమిళ చిత్రాలకే ప్రాధాన్యతనిస్తా. అందుకు కారణం కూడా ఉంది. తమిళం మినహా ఇతర భాషలు సరళంగా మాట్లాడలేను. కొత్త చిత్రాల అవకాశాల గురించి? తమిళపడం–2 చిత్రం ఇటీవలనే తెరపైకి వచ్చింది. కొత్త చిత్రాల అవకాశాలు వస్తున్నాయి. అయితే అవన్నీ చర్చల్లోనే ఉన్నాయి. త్వరలోనే ఆ వివరాలు వెలువడతాయి. తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారట? అవును. తెలుగులో ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ చిత్ర వివరాలను త్వరలోనే వెల్లడిస్తా. టాలీవుడ్లో అందాలారబోయాల్సి ఉంటుందంటారే? నాకు సౌకర్యంగా ఉన్నంత వరకూ అందాలారబోతకు అభ్యంతరం లేదు. అది ఈత దుస్తులు ధరించడానికైనా సరే. అయితే లిప్‌లాక్ సన్నివేశాల్లో మాత్రం నటించను. ఏ హీరోలతో నటించాలని ఆశ పడుతున్నారు? ఆ లిస్ట్ చెప్పాలంటే చాలానే ఉంది. విజయ్, అజిత్, శివకార్తికేయన్ ఇలా చాలా మందితో నటించే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అదే విధంగా తెలుగులో మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇలా చాలా మంది నాకిష్టమైన హీరోలు. నచ్చిన హీరోయిన్లు? త్రిష, కాజల్ అగర్వాల్. నాకు స్ఫూర్తి వాళ్లే. వారిని చూసే నేను ఈ రంగంలోకి వచ్చానని కూడా చెప్పవచ్చు. డ్రీమ్ పాత్రలంటూ ఏమైనా ఉన్నాయా? నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. ఎలాంటి పాత్రకైనా పూర్తి న్యాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. కీర్తీసురేశ్ లాంటి వారు బయోపిక్ చిత్రాల్లో నటించి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. మీకు అలాంటి చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి ఉందా? అలాంటి అవకాశం రావాలే గానీ, కచ్చితంగా నటిస్తాను. అయితే నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలన్నది దర్శకులే నిర్ణయిస్తారు. హీరోయిన్లకు ఇప్పుడు గట్టి పోటీ నెలకొందే? నేనెవరినీ పోటీగా భావించను. నాకు లభించిన పాత్రలను సమర్థవంతంగా పోషించడంపైనే పూర్తిగా దృష్టి సారిస్తాను. ప్రస్తుతం సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ కలకలం రేపుతోంది. దీనిపై మీ స్పందన? నేను వింటున్నాను. అయితే నాకలాంటి సంఘటనలు ఎదురవ్వలేదు. -
క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన రెజీనా
సాక్షి, సినిమా : ప్రస్తుతం సినీ పరిశ్రమని క్యాస్టింగ్ కౌచ్, అమెరికాలో అమ్మాయిల వ్యభిచారం సంఘటన(చికాగో సెక్స్ రాకెట్)లు కుదిపేస్తున్నాయి. దీనిపై వర్ధమాన నటీమణులకు నటి రెజీనా ఓ సలహా ఇచ్చారు. చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ బాధితులేనని ఒక్కొక్కరూ ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. దీని గురించి నటి రెజీనా ఏమన్నారో చూద్దాం.. ‘క్యాస్టింగ్ కౌచ్, అమెరికాలో అమ్మాయిల వ్యభిచారం సంఘటనలపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటమే మంచిదని నేను భావిస్తున్నాను. నిజంగా అలాంటి ప్రచారంలో వాస్తవాలు ఉంటే ఏదో ఒక రోజున చర్యలు తీసుకోవలసిందే. దీని గురించి నేనేమైనా స్పందిస్తే దాన్ని వేరేగా చిత్రీకరిస్తారు. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. తమకు ఇష్టం వచ్చిన విధంగా కొందరు మాట్లాడుతుంటారు. అలాంటి వాటిలో ఏది నిజం అన్నది మీడియా నిర్ధారించుకుని ప్రసారం చేయాలి. ఎందుకంటే మీడియా ప్రసారాలను నమ్మేవారు చాలా మంది ఉంటారు. అందుకే ఇలాంటి వ్యవహారాల గురించి ప్రసారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి. ఇలాంటి సంఘటనల నుంచి వర్ధమాన తారలు పాఠం నేర్చుకుని వాటికి దూరంగా ఉండాలన్నదే నా సలహా’ అని రెజీనా చెప్పారు. -
సినీరంగంలో వంచకులు ఉన్నమాట నిజమే !
సినీరంగంలో వంచకులు ఉన్నమాట నిజమేనని.. అయితే అలాంటి వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారని హీరోయిన్ సమంత పేర్కొన్నారు. ఇటీవల కలకలం సృష్టిస్తున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సమంత మాట్లాడుతూ.. ఈ సంస్కృతి ఒక సినిమా రంగంలోనే కాక అన్ని రంగాల్లోనూ ఉందని సమంత అన్నారు. దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ఈ రంగంలో ఉన్నాను. ఇక్కడ మంచి వాళ్లు ఉన్నారు.. అయితే కొందరు నయవంచకులు కూడా ఉన్నారు. అలాంటి వారిని తరిమేస్తే చిత్ర పరిశ్రమ అంత మంచిది మరొకటి ఉండదన్నారు. అయితే అలాంటి దుర్మార్గులను శిక్షించడానికి కొన్ని చట్టాలు రూపొందించారు.. ఇకపై అత్యాచారాలు జరగవని భావిస్తున్నాని సమంత పేర్కొన్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ బిజీగా ఉందని చెప్పవచ్చు. సమంత నటించిన రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రానున్నాయి. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన నడిగైయార్ తిలగం ఈ నెల 9న విడుదలకు సిద్ధం అవుతుంది. మరొకటి విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబుతిరై ఈ నెల 11న తెరపైకి వస్తోంది. ఈ సందర్భంగా సమంత శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త డైరెక్టర్ల చిత్రాల్లో పనిచేయడానికి కాస్త సంకోచిస్తానన్నారు. ‘కానీ దర్శకుడు మిత్రన్‌తో ఇరుంబుతిరై చిత్రం చేస్తున్నప్పుడు ఆ విధమైన భావన కలగలేదు. కథ విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. మన జీవితాల్లో మనకు తెలియకుండానే ఇన్ని సమస్యలు ఇంటర్నెట్ మీడియా ద్వారా జరుగుతున్నాయా అని కంగు తిన్నాను. కథ విన్న తర్వాత సెల్‌ఫోన్ టచ్ చేయడానికే భయమేసింది. ఈ చిత్రంలోని సంఘటనలు నీ జీవితంలో జరగకపోయినా, నా స్నేహితురాళ్లకు ఎదురయ్యాయి. ఇరుంబుతిరై చిత్రానికి డబ్బంగ్ చేప్పడానికి నిరాకరించినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదు. చిత్ర పరిశ్రమ సమ్మె ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.. ఆ సమయంలో నడిగైయార్ తిలగం చిత్ర షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల డబ్బింగ్ చెప్పలేకపోయాను’ అని సమంత తెలిపారు. ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం సమంతకు మంచి పేరు తెచ్చిన పెట్టిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో సమంత తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. కానీ, ఆ చిత్రంలో ముద్దు సన్నివేశంలో నటించడం చర్చనీయాంశంగా మారిందని ఆమె అన్నారు. అయితే తన కుటుంబ సభ్యులు ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని అండగా నిలిచారని ఈ బ్యూటీ పేర్కొన్నారు. నటులు రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.. వారిలో మీరు ఎవరికి ఓటు వేస్తారు? అని అడుగుతున్నారు. అయితే తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని సమంత చెప్పారు. -
క్యాస్టింగ్ కౌచ్ నిజమే..!
సాక్షి, సినిమా: క్యాస్టింగ్ కౌచ్‌పై ఇంతకు ముందు కోలీవుడ్‌లో సుచీ లీక్స్ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. పలువురి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇప్పుడు శ్రీరెడ్డి లీక్స్గా టాలీవుడ్‌ను ఊపేస్తోంది. అంతే కాదు దానికి రాజకీయ రంగు పులుముకుంది. గాయని సుచిత్ర, నటి శ్రీరెడ్డినే కాదు అంతకుముందు, ఆ తరువాత పలువురు నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగానే వెల్లడించారు. తాజాగా నటి రమ్యానంబీశన్ క్యాస్టింగ్ కౌచ్ విధానం ఉన్నమాట నిజమేనని వంత పాడారు. పిజ్జా, సేతుపతి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా ప్రభుదేవాతో మెర్క్యురీ చిత్రంలో మెరిసింది. సినీ వర్గాలో దుమారం రేపుతున్న క్యాస్టింగ్‌కౌచ్ గురించి నటి రమ్యానంబీశన్ మాట్లాడుతూ.. నటీమణులకు లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, పడకగదికి రమ్మనే ఆనవాయితీ నడుస్తోందని చెప్పింది. ఇది సినీ రంగంలోనే కాకుండా అంతటా ఉందని అంది. అవకాశాల కోసం అమ్మాయిలను పడకగదికి పిలిచే వ్యవహారం సినీరంగంలో జరుగుతోందని చెప్పింది. అయితే అలాంటి సంఘటన తనకు ఎదురవ్వలేదుగానీ, సహ నటీమణులు కొందరు క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పడం విన్నానని తెలిపింది. ఇలాంటి నీచ సంఘటనలను సినీరంగంలో అడ్డుకోవాలని పేర్కొంది. అందుకు బాధింపునకు గురైన నటీమణులు ధైర్యంగా పోరాటం చేయాలని, క్యాస్టింగ్ కౌచ్ అనే మాట వినిపించకుండా చేయాలని పేర్కొంది. -
అవసరమైతే గుండుతోనైనా నటిస్తా
గుంటూరు: ప్రముఖ నటుడు జగపతిబాబు తన రాజకీయ ప్రవేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధనపై స్పందించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి చిత్ర పరిశ్రమ మద్దతు ఉంటుంది.. సరైన సమయంలో పోరాటం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని జగపతి బాబు వెల్లడించారు. అంతేకాదు అవసరమైతే సినిమాలో గుండుతోనైనా నటిస్తానని ఆయన అన్నారు. గతంలో కొందరు రాజకీయాల్లోకి రావాలని పిలిచారు.. అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని వారికి చెప్పినట్లు జగపతి బాబు తెలిపారు. జగపతిబాబును చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. -
అనుష్క చిత్రం అంటే కాసుల వర్షమే..
సాక్షి, చెన్నై: ఇంతకంటే మంచిది మరొకటి ఉంటుందా అంటోంది నటి అనుష్క. నటనపై ఆధారపడి, సినిమాల్లో సంపాదించుకుంటూ సినిమా శాశ్వతం కాదు, వేరే వ్యాపారం చేసుకోవాలి అంటూ ఈ రంగాన్నే విమర్శించేవారు కొందరు. సినిమానే ఆస్తులు, అంతస్తులు, ఆనందం అన్నీ ఇచ్చింది అని మర్యాదనిచ్చే వారు మరి కొందరు. ఇక నటి అనుష్క ఈ రెండవ కోవకు చెందినదిన వారని చెప్పక తప్పదు. నటిగా 13 ఏళ్ల అనుభవం. అంచెలంచెలుగా ఎదిగి అగ్ర హీరోయిన్గా రాణిస్తున్న అనుష్క చిత్రం అంటే కాసుల వర్షమే అనే పేరును సంపాందించుకున్నారు. అందం, అభినయం కలబోసిన అద్భుత నటి అనుష్క. తాజాగా భాగమతి చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపారు. అందరూ స్వీటీ అని ప్రేమగా పిలుచుకునే ఈ బ్యూటీ తన సినీ అనుభవాన్ని ఒక భేటీలో పంచుకున్నారు. అవేమిటో చూద్దాం. సినిమాల్లో నటించడం కూడా ఉద్యోగం లాంటిదే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మాదిరిగానే సినిమాల్లో మేము పనిచేస్తున్నాం. అయితే ఇతరుల కంటే మాదే అత్యుత్తమ పని. ఎందుకంటే సినిమాలను ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమించే సినిమారంగంలో ఒక నటిగా నేనుండడం ఘనతగా భావిస్తున్నాను. ఒక్క పారితోషికం మాత్రమే కాకుండా ఇక్కడ చాలా సౌకర్యాలను అనుభవిస్తున్నాను. ఇక కష్టనష్టాలనేవి అన్ని రంగాల్లోనూ ఉంటాయి. అయితే సినిమారంగంలో శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకుంటే హీరోయిన్లను రాణులుగా చూస్తారు. మా మాటలను ఎంతగానో విశ్వసిస్తారు. మేము ఎం చెబుతామోనన్న ఆసక్తి చూపుతారు. సాధారణ అమ్మాయిల కంటే మేము చెప్పేవి ఆదర్శంగా తీసుకుని, వాటిని అనుసరిస్తారు. ఇతర రంగాల్లో ఉద్యోగం చేసేవారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పని చేసి అలసిపోతారు. మేము మాత్రం 24 గంటలు స్టూడియోల్లో మగ్గి పని చేసినా అలుపు ఉండదు. అలాంటి ఇష్టమైన వృత్తి సినిమా రంగం. ఇంతకంటే ఉత్తమమైన పని వేరేమీ ఉండదు. -
సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మెగా ఫ్యామిలీ
తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మెగా స్టార్ కేవలం తన సినీ జీవితాన్ని మాత్రమే కాదు మొత్తం ఫ్యామిలీ జీవితాన్ని కూడా సెట్ చేశాడనే చెప్పాలి. బాలీవుడ్లో కపూర్ ఖాన్దన్ ఫ్యామిలీ లాగానే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరంజీవి కుటుంబం అతి పెద్దది. మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పటికే పలువురు హీరోలు టాలీవుడ్లో జోరు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి తమ అభిమాన హీరో కొడుకో.. కూతురో.. అల్లుడో... వస్తున్నారంటే అభిమానులు చాలా హ్యాపీ. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది చిరంజీవి కుటుంబం నుంచి సినీ పరిశ్రమలో ఉన్నారు. మెగాస్టార్ ప్యామిలీ నుంచి ఆయనతోపాటు, ఆయన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు, కుమారులు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లుళ్లు అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరణ్ తేజ్, కళ్యాణ్ దేవ్, కూతురు నిహారికలు ప్రస్తుతం పరిశ్రమలో ఉన్నారు. అయితే వీరిలో పవణ్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని టాప్ 10 లో నిలిచారు. వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించి అందరిని ఆకట్టుకుంటున్నారు. అయితే గీతా ఆర్ట్స్ బానర్ మీద సినిమాలు నిర్మిస్తున్న పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ కూడా మెగా ఫ్యామిలీలో సభ్యుడే. అల్లు అరవింద్ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా, డిస్ట్ర్రిబ్యూటర్గా ఉన్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి ఆయన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరో ఎంట్రీ ఖరారైంది. అల్లుడు కూడా అభిమానులకు వారుసుడే కదా. ప్రస్తుతం కల్యాణ్ నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో మెలకువలు నేర్చుకుంటున్నారు. ‘జత కలిసె’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో రజని కొర్రపాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవికా నాయర్ కథానాయిక. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా త్వరలోనే హీరో అవతారం ఎత్తుతారని, ప్రస్తుతానికి యాక్టింగ్ క్లాస్‌లకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. -
వీరి డేట్స్ చాలా కాస్ట్లీ గురూ..!
సాక్షి, చెన్నై: మొదట్లో ఒక్క అవకాశం అన్న వాళ్లే ఆ తర్వాత ఒక్క విజయం కోసం ఎదురుచూస్తారు. సినిమా మంచిగా విజయం సాదిస్తే చాలు పారితోషికాలను భారీగా పెంచేస్తారు. ఈ విషయంలో ఏ హీరో, హీరోయిన అతీతం కాదు. అలా అగ్రహీరోయిన్లుగా రాణిస్తున్న నయనతార, అనుష్కల నుంచి ఇటీవలే రేసులో నిలబడిన రకుల్‌ప్రీత్ సింగ్‌ల వరకూ తమ పారితోషికాలను పెంచేశారు. నయనతార మొదట్లో లక్షల్లో పారితోషికం తీసుకున్న నటి నయనతార. రజనీకాంత్‌తో నటించిన చంద్రముఖి చిత్రం విజయంతో తన పారితోషికాన్ని వరుసగా పెంచుకుంటూ పోతోంది. కమర్శియల్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో రూ. కోటి వరకూ పుచ్చుకుంది. ఆ తర్వాత నానూరౌడీదాన్, హీరోయిన్ ఓరియెంటెడ చిత్రం మాయ వంటి చిత్రాల విజయాలతో రూ. 3 కోట్లు డిమాండ్ చేసింది. ఇమైకా నోడిగళ్ చిత్రానికి రూ.3 కోట్లు పుచ్చుకున్నట్లు అధికారిక సమాచారం. ఆ తర్వాత అరమ్ సినిమా నయనతార స్థాయిని మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను చిత్రాలకు పైనే ఉన్నాయి. తాజాగా అజిత్‌కు జంటగా నటించిన విశ్వాసం చిత్రానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అదే వరుసలో అనుష్క అనుష్కకు అరుంధతి చిత్రం ఒక ల్యాండ్ మార్క్‌గా నిలిచింది. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు వచ్చి పడడంతో అనుష్క పారితోషికాన్ని పెంచేసింది. బాహుబలి సిరీస్ చిత్రాల విజయంతో తన పారితోషికాన్ని రూ. 4 కోట్లకు పెంచినట్లు సినీ వర్గాల సమాచారం. తాజాగా భాగమతి విజయబాటలో పయనిస్తుండడంతో ఆమె నయనతారకు దీటుగా రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. అదే బాటలోనే మిగతా హీరోయిన్లు..! అదేబాటలో మరికొంత మంది హీరోయిన్లు పయనిస్తున్నట్లు సమాచారం. ఇటీవల తమిళంలో వివేగం, మెర్శల్, తెలుగులో ఖైదీనంబర్ 150, నేనేరాజు నేనే మంత్రి చిత్రాల విజయంతో హీరోయిన్ కాజల్ అగ్వాల్ తన పారితోసికాన్ని రూ. ఒకటిన్నర నుంచి రూ. 2 కోట్లకు పెంచేసిందట. అదే విధంగా త్రిష కోటిన్నర నుంచి రూ. 2 కోట్లకు, వివాహానంతరం హీరోయిన్గా బిజీగా నటిస్తున్న నటి సమంత రూ. 2 కోట్లు తీసుకుంటున్నారు. కోలీవుడ్‌లో హిట్ కోసం ఎదురుచూసిన నటి రకుల్ ప్రీత్‌సింగ్ కూడా కార్తీతో నటించిన ధీరన్ ఒండ్రు చిత్రం విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడి పారితోషికానికి కాళ్లొచ్చేశాయి. ఆమె రూ. కోటిన్నర డిమాండ్ చేస్తోంది. అదే విధంగా చాలా తక్కువ సమయంలోనే స్టార్ నటిగా ఎదుగుతున్న హీరోయిన్ కీర్తిసురేశ్. బహుబాషా నటిగా రాణిస్తూ రూ. 2 కోట్లు డిమాండ చేస్తోందని సమాచారం. సంచలన నటి అమలాపాల్ తానేమీ తక్కువ కాదని రూ. 2 కోట్లు పారితోషికం కావాలంటోందట. ఇటీవల హీరోయిన్ కథా చిత్రాలు వరసగా సక్సెస్ బాటపట్టడం, అవి హీరో చిత్రాలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సాధించడం గమనార్హం, హీరోల చిత్రాల బడ్జేట్ కంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు తక్కువ అవుతుంది. దీంతో దర్శక నిర్మాతలు ఆ తరహా చిత్రలపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. తమ చిత్రాలు లాభాలను తెచ్చి పెడడంతో హీరోయిన్లు పారితోషికాలను పెంచేస్తున్నారనేది సినీ గణితవేత్తల మాట. అందుకే వీరి డేట్స్ కాస్ట్లీ గురూ అంటున్నారు సినీ వర్గాలు. -
రెజీనా ప్రేమలో పడిందా?
రెజీనా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చెన్నైకి చెందిన రెజీనా కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్లోనే మంచి పేరు తెచ్చుకుంది. మొదట్లో పలు టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆ తరువాత వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. ఆపై రెజీనా కోలీవుడ్ తెరకు పరిచయమైంది. కండనాళ్ మొదల్ చిత్రంతో హీరోయిన్గా 2012 తెరపైకి వచ్చిన రెజీనా ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందినా, ఆ తరువాత నటించిన చిత్రాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టిసారించి వరుసగా అవకాశాలను చేజిక్కించుకుంటోంది. అయితే కోలీవుడ్‌లో ఆ మధ్య నటించిన మానగరం చిత్రం ఈ అమ్మడి ఖాతాలో హిట్‌గా నిలిచింది. దీంతో ఇక్కడ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం రెజీనా చేతిలో తమిళం, తెలుగు కలిపి అరడజను చిత్రాల వరకూ ఉన్నాయి. వీటిలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన నెజైమరప్పదిల్లై, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. రెజీనా మాత్రం టాలీవుడ్‌కే అధిక ప్రాముఖ్యత ఇస్తోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. కారణం తెలుగు చిత్రాల ద్వారా బాలీవుడ్‌కు వెళ్లాలనే ఆశతో ఉన్నట్లు సమాచారం. అయితే మరో వైపు రెజీనా ప్రేమలో మునిగి తేలుతోందని చెబుతున్నారు. ఒక టాలీవుడ్ యువ నటుడితో పరిచయం ప్రేమగా మారిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని రెజీనా ఖండిస్తోంది. తానెవరినీ ప్రేమించడం లేదని, అసలు ప్రస్తుతానికి ప్రేమించే సమయం, పెళ్లి చేసుకునే ఆలోచన లేవని అంటోంది. అయితే ప్రేమలో పడ్డ చాలా మంది చెప్పే కబుర్లనే రెజీనా చెబుతోందని, ఇలాంటి వారు సడన్‌గా పెళ్లికి సిద్ధం అవుతారని సినీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. -
అలాంటి విషయాలు బయటకు చెప్పుకోలేరు!
సాక్షి, సినిమా: లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని నటి రాధికాఆప్టే అంటోంది. అర్ధనగ్న దృశ్యాల ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తూ తరచూ వార్తల్లో ఉండే ఈ ఉత్తరాది భామ వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టిస్తుంటుంది. కోలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటించిన రాధికాఆప్టే టాలీవుడ్‌లోనూ ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు లేవు. బాలీవుడ్‌పైనే దృష్టిసారిస్తున్న రాధికాఆప్టే సినీ తారలపై లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమేనని ప్రకటించి వివాదాస్పద నటీమణుల లిస్టులో పడిపోయింది. అయితే తాజాగా తన హిందీ చిత్ర ప్రచారంలో భాగంగా మరోసారి హీరోయిన్ల లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించి మరోసారి వార్తల్లోకెక్కింది. రాధిక మాట్లాడుతూ హీరోయిన్లకు లైంగిక వేధింపులు అన్నవి నిజమేనని చెప్పింది. అయితే అలాంటి సంఘటనలను అందరూ బయటకు చెప్పుకోలేరని అంది. అలా చెబితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని, కలలు కల్లలై పోతాయనే భయం అని అన్నది. అయితే హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలని కోరింది. లేకుంటే అలాంటి సంఘటనలు పెరిగిపోతాయని అన్నది. సమాజంలో మార్పు రావాలని, మహిళలు తమకు జరిగిన అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని చెప్పింది. అప్పుడు దురాగతాలకు అడ్డుకట్ట వేయవచ్చునని చెప్పింది. తనకు అలాంటి సంఘటనలు పెద్దగా ఎదురవ్వలేదని, తాను ఎదుర్కొన్న అనుభవాలను ఇంతకు ముందే వెల్లడించానని చెప్పింది. అయితే ఇతరుల లైంగిక వేధింపుల గురించి తాను మాట్లాడనని చెప్పింది. -
కాజల్ పనైపోయిందా.?
సాక్షి, తమిళ సినిమా: ప్రస్తుతం కాజల్ అగర్వాల్ అగ్రనటీమణుల్లో ఒకరని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. అయితే ఈ స్థాయికి రావడానికి కాజల్ పెద్ద పోరాటమే చేసింది. ఈ ఉత్తరాది బ్యూటీ నట జీవితం అపజయాలతోనే మొదలైంది. వాటిన్నిటిని అధిగమించి కృషి, ప్రతిభను నమ్ముకుని అగ్రనటిగా రాణిస్తోంది. కాయలున్న చెట్లకే దెబ్బలన్న చందాన కాజల్‌పై కొందరు అక్కసు వెళ్లగక్కుతున్నారట. కాజల్ తొలుత బాలీవుడ్ నటిగా 2004లో రంగప్రవేశం చేసింది. దక్షిణాదికి మాత్రం 2007లో పరిచయమైంది. లక్ష్మీకల్యాణం అంటూ టాలీవుడ్‌కు అడుగిడిన కాజల్‌కు ఆ చిత్రం సక్సెస్ అయినా అవకాశాలు పెద్దగా రాలేదనే చెప్పాలి. ఇక కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా చిత్రం బొమ్మలాట్టం చిత్రంలో రంగప్రవేశం చేసినా అదీ అసలు కాజల్ కెరీర్‌కు హెల్ప్ కాలేదు. ఇలా ఆదిలో అవకాశాల కోసం పోరాడి గెలిచిన నటి కాజల్. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న కాజల్ విజయ్ బాటలోనే పయనిస్తోంది. తెలుగులో మూడు చిత్రాలతో బిజీగా ఉన్న కాజల్ మార్కెట్‌ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందట. 32 రెండేళ్ల కాజల్అగర్వాలల్ పనైపోయిందని ఇక ఎక్కువ కాలం హీరోయిన్గా నిలదొక్కుకోవడం కష్టం అని ఆమె పోటీ నటీమణులు తమ అనుచరులతో దుష్ప్రచారం చేయిస్తున్నారని సమాచారం. ఈ విషయం కాజల్ చెవిన పడడంతో తను ఎలా స్పందించిందో తెలుసా? ఎవరు ఎలాంటి ప్రచారం చేసుకుంటారో చేసుకోనివ్వండి. ఐ డోంట్ కేర్ అని చాలా లైట్‌గా తీసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో ప్యారిస్ ప్యారిస్ చిత్రం ఒకటి. ఇది హిందీలో నటి కంగనారావత్ నటించి పలు అవార్డులను గలుచుకున్న క్వీన్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంతో తను పలు అవార్డులను అందుకుంటాననే నమ్మకాన్ని కాజల్ వ్యక్తం చేస్తోంది. ఇక నానీతో నటిస్తున్న ఎంఎల్ఏ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇక తమిళంలో అజిత్‌తో జత కట్టిన వివేగం, విజయ్‌తో రొమాన్స్ చేసిన మెర్శల్, అదే విధంగా తెలుగులో చిరంజీవితో నటించిన ఖైదీ నంబర్ 150, రానాకు జంటగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయన్నది తెలిసిందే. -
ఫోటో చాన్సివ్వకుంటే ఆత్మాహుతి
- సేలం జిల్లా రజనీకాంత్ అభిమానుల సంఘం హెచ్చరిక సేలం: కన్నవారి మీదకంటే హీరోలంటేనే అమితమైన అభిమానం, ప్రేమ ప్రదర్శిస్తారు అభిమానులు. అలాంటి వారికి కొన్ని సమయాల్లో హీరోతో కలిసి పోటో తీసుకునే అవకాశం కూడా దొరకదు. జీవితమంతా అభిమానులుగా కొనసాగిన తమకు ఫొటో తీసుకునే అవకాశం కల్పించకుంటే రజనీకాంత్ ఇంటిముందే ఆత్మాహుతికి పాల్పడతామని సేలం రజనీకాంత్ అభిమానులు హెచ్చరించారు. సేలం జిల్లా రజనీకాంత్ అభిమానుల సంఘం సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘ న్యాయసలహాదారు ఏ.ఎస్.రజని మాట్లాడుతూ.. రజీనీతో కలిసి ఫొటో తీసుకునేందుకు సేలం జిల్లాకు 250 నుంచి 300 టోకన్లు అందజేశారన్నారు. ఈ టోకన్లను జిల్లా రజనీ అభిమానుల సంఘం కార్యదర్శి పళనివేల్ తనకు కావాల్సిన వారికి విక్రయించారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంలో రజనీ జోక్యం చేసుకుని అసలైన అభిమానులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆయన ఇంటి ముందే ఆత్మాహుతికి పాల్పడతామని ఆయన వెల్లడించారు. -
టీఆర్ఎస్లో చేరిన సినీ హీరో
అగ్రగామిగా తెలంగాణ - హోంమంత్రి నాయిని బంజారాహిల్స్: భారతదేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని, చిత్ర పరిశ్రమకు అనుకూలమైన ప్రాంతం ఇదేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఫిలించాంబర్ వద్ద జరిగిన కార్యక్రమంలో సినీ హీరో ఆకాష్ టీఆర్ఎస్లో చేరారు. హోం మంత్రి ఆయనకు కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం నాయిని మాట్లాడుతూ అమెరికా తరహాలో హైదరాబాద్‌లో సినిమా నిర్మాణానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని సూచించారు. సినిమా పరిశ్రమను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. నిర్మాతలందరినీ ఒక్కచోట చేర్చి సినిమా టౌన్షిప్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకునే విధంగా వనరులున్నాయని చెప్పారు. చంద్రబాబు కూడా ఇందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా తమ వాళ్లేనని సీఎం ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సినీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు పి.రామకృష్ణగౌడ్‌కు పార్టీ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజక వర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సినిమాలకు ఇంగ్లిష్ టైటిల్స్ పెడితే సబ్సిడీ కట్!
తిరువనంతపురం: భారతదేశంలో చిత్ర పరిశ్రమలకు ఇంగ్లిష్ టైటిల్స్ తో ఏదో తెలియని సంబంధం. దేశంలో ఉన్న సినీ పరిశ్రమల్లో ఇంగ్లిష్ టైటిల్స్ వాసన లేకుండా సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. ప్రతీ రాష్ట్రంలో మాతృభాషను బ్రతికించుకోవడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నా.. సినిమా టైటిల్స్ విషయంలో మాత్రం నామమాత్రంగానే వ్యవహరిస్తున్నాయి. అయితే ఇక నుంచి మాతృభాషను సాధ్యమైనంతవరకూ బ్రతికించుకోవడానికి కేరళ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మాతృభాషలో సినిమా టైటిల్స్ పెట్టిన చిత్రాలకు మాత్రమే సబ్సిడీ వర్తింప చేయడానికి సన్నద్ధమైంది. దీంతో పాటు ఇంగ్లిష్ టైటిల్స్ కు చెక్ పెట్టేందుకు కూడా నడుంబిగించింది. ఇక నుంచి మలయాళ చిత్ర సీమలో ఏ చిత్రానికైనా ఇంగ్లిష్ టైటిల్స్ పెడితే మాత్రం సబ్సిడీ ఉండదని తెలియజేసింది. ఇందుకోసం దర్శకుడు ఆదూర్ గోపాల్ క్రిష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మాతృభాషలోని తెరకెక్కించే సినిమాలకు సంబంధించి విధివిధానాలను పరిశీలించి.. అందుకు తగిన సహకారం అందిస్తుంది. చిత్ర పరిశ్రమలో సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని పర్యవేక్షించి తగిన సూచనలు చేస్తుంది.