
జగపతిబాబు
గుంటూరు: ప్రముఖ నటుడు జగపతిబాబు తన రాజకీయ ప్రవేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధనపై స్పందించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి చిత్ర పరిశ్రమ మద్దతు ఉంటుంది.. సరైన సమయంలో పోరాటం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని జగపతి బాబు వెల్లడించారు.
అంతేకాదు అవసరమైతే సినిమాలో గుండుతోనైనా నటిస్తానని ఆయన అన్నారు. గతంలో కొందరు రాజకీయాల్లోకి రావాలని పిలిచారు.. అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని వారికి చెప్పినట్లు జగపతి బాబు తెలిపారు. జగపతిబాబును చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.