నటి రమ్యానంబీశన్(ఫైల్ ఫోటో)
సాక్షి, సినిమా: క్యాస్టింగ్ కౌచ్‌పై ఇంతకు ముందు కోలీవుడ్‌లో సుచీ లీక్స్ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. పలువురి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇప్పుడు శ్రీరెడ్డి లీక్స్‌గా టాలీవుడ్‌ను ఊపేస్తోంది. అంతే కాదు దానికి రాజకీయ రంగు పులుముకుంది. గాయని సుచిత్ర, నటి శ్రీరెడ్డినే కాదు అంతకుముందు, ఆ తరువాత పలువురు నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగానే వెల్లడించారు. తాజాగా నటి రమ్యానంబీశన్ క్యాస్టింగ్ కౌచ్ విధానం ఉన్నమాట నిజమేనని వంత పాడారు. పిజ్జా, సేతుపతి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా ప్రభుదేవాతో మెర్క్యురీ చిత్రంలో మెరిసింది.
సినీ వర్గాలో దుమారం రేపుతున్న క్యాస్టింగ్‌కౌచ్ గురించి నటి రమ్యానంబీశన్ మాట్లాడుతూ.. నటీమణులకు లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, పడకగదికి రమ్మనే ఆనవాయితీ నడుస్తోందని చెప్పింది. ఇది సినీ రంగంలోనే కాకుండా అంతటా ఉందని అంది. అవకాశాల కోసం అమ్మాయిలను పడకగదికి పిలిచే వ్యవహారం సినీరంగంలో జరుగుతోందని చెప్పింది. అయితే అలాంటి సంఘటన తనకు ఎదురవ్వలేదుగానీ, సహ నటీమణులు కొందరు క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పడం విన్నానని తెలిపింది. ఇలాంటి నీచ సంఘటనలను సినీరంగంలో అడ్డుకోవాలని పేర్కొంది. అందుకు బాధింపునకు గురైన నటీమణులు ధైర్యంగా పోరాటం చేయాలని, క్యాస్టింగ్ కౌచ్ అనే మాట వినిపించకుండా చేయాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment