ramya nambeesan
-
రమ్య సైలెంట్‌గా ఏం చేసిందో తెలుసా?
సినిమా: మాలీవుడ్, కోలీవుడ్ అంటూ దక్షిణాది సినిమాలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న మలమాళీ చిన్నది రమ్య నంబీశన్. కొన్ని చిత్రాల్లో అందాలారబోసినా, ఎందుకనో ఈ అమ్మడికి పక్కింటి అమ్మాయి ఇమేజ్‌నే ఉండడం లక్కీనే. తమిళంలో నటించిన పిజ్జా చిత్రం తెలుగు అనువాదంతో అక్కడ పరిచయం అయిన ఈ అమ్మడిలో మల్టీటాలెంట్ ఉందన్నది తెలిసిందే. నటి, గాయనిగా రాణిస్తున్న రమ్య తాజాగా మరో ప్రయత్నం చేసింది. అదేంటో చూద్దాం. ఈ అమ్మడు మెగాఫోన్ పట్టింది. దీని గురించి అడిగితే అయ్యయ్యో అది పెద్ద చిత్రం కాదండీ. చాలా చిన్న చిత్రం. దాన్ని లఘు చిత్రం అని కూడా అనవచ్చో లేదో. మూడు నిమిషాలు నిడివితో కూడుకుంది. దానికి అన్హైట్ అనే టైటిల్‌ను పెట్టాను. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న విడుదల చేయనున్నాను. తన మనసులో ఉన్న చిన్న కాన్సెప్ట్‌నకు దృశ్య రూపం ఇచ్చే ప్రయత్నం చేశాను అంతే అని చెప్పింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెబుతూ విజయ్ ఆంటోనికి జంటగా తమిళరసన్ అనే చిత్రంలో నటించాను. ఈ చిత్రంలో కథనం వైవిద్యంగా ఉంటుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం సిబిరాజ్‌కు జంటగా రేంజర్స్ చిత్రంలోనూ ప్లాన్ పన్ని పన్ననుమ్ అనే మరో కామెడీ కథా చిత్రం, ప్రభుదేవాకు జంటగా ఒక చిత్రం చేస్తున్నాను. అదేవిధంగా మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నాను అని తెలిపింది. మాతృభాషలో కంటే తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేస్తున్నట్లున్నారే అన్న ప్రశకు అవును తమిళంలో సేతుపతి చిత్రం తరువాత మంచి అవకాశాలు వస్తున్నాయి. నాకు భాషా సమస్య లేదు. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. అందులోనూ మంచి కథా పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నాను. అయితే మలయాళం మాతృభాష కావడంతో ఆ చిత్రాల్లో నటించేటప్పుడు కలిగే అనుభూతే వేరు. అందుకే మలయాళ చిత్రాల్లోనూ నటిస్తున్నాను అని చెప్పింది. గాయనిగా కెరీర్ ఎలా సాగుతోందన్న ప్రశ్నకు నా జీవితంలో నటనకు, సంగీతానికి సమ ప్రాధాన్యతనిస్తాను. ఇటీవల సల్మాన్‌ఖాన్ నటించిన దబాంగ్ 3 చిత్ర తమిళ వెర్షన్లో ఒక పాట పాడాను. తరువాత యువన్‌శంకర్‌రాజా సంగీతదర్శకత్వంలో ఒక పాట పాడాను. ఇక బుల్లితెర సంగీత కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ జీవితం ఆనందంగా సాగిపోతోంది అని రమ్యానంబీశన్ చెప్పుకొచ్చింది. -
రేంజర్‌గా సిబిరాజ్
యువ నటుడు సిబిరాజ్ ఇప్పుడు రేంజర్‌గా మారనున్నారు. అవును ఈయన నటించనున్న నూతన చిత్రానికి రేంజర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన ఆరా సినిమాస్ సంస్థ అధినేత మహేశ్.జీ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంతకుముందు బర్మా, రాజారంగూష్కీ, జాక్సన్‌దురై చిత్రాలను తెరకెక్కించిన ధరణీధరణ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను మంగళవారం చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్.జీ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది మహారాష్ట్రలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించనున్న చిత్రం అని చెప్పారు. ఈ మధ్య మహారాష్ట్రలోని యావత్మాల్ అనే జిల్లాలో ఆవ్నీ అనే పులి మనుషులను ఎలా బలి తీసుకున్నదన్న విషయం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందేనన్నారు. ఆ సంఘటను ఆధారంగా చేసుకుని రేంజర్ పేరుతో చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో సిబిరాజ్ కథానాయకుడిగా నటించనున్నారని, ఆయనకు జంటగా నటి రమ్యానంబీశన్, మధుశాలిని నటించనున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు మనుషులపై దాడి చేసిన మృగాల ఇతివృత్తంతో పలు చిత్రాలు వచ్చాయని, అయితే అవన్నీ కల్పిత కథా చిత్రాలని అన్నారు. తమ చిత్రం మన దేశంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందనున్న చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్ అధికంగా ఉంటుందని చెప్పారు. అందుకు హాలీవుడ్ సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు ధరణీధరణ్ కథ, కథనాన్ని వైవిధ్యంగా తీర్చిదిద్దారని చెప్పారు. థ్రిల్లర్‌తో కూడిన కమర్శియల్ కథా చిత్రంగా రేంజర్ ఉంటుందన్నారు. ఈ చిత్రానికి నటుడు సిబిరాజ్ పక్కాబలంగా ఉంటారని అన్నారు. ఆయన ఇమేజ్ను మరింత పెంచేదిగా రేంజర్ చిత్రం ఉంటుందని అన్నారు. రేంజర్ ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తుందన్నారు. చిత్ర షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో నటించే ఇతర నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని, అదే విధంగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. అరోల్ కరోలి సంగీతాన్ని, కల్యాణ వెంకట్రామన్ ఛాయాగ్రహణం అందించనున్నారని నిర్మాత తెలిపారు. -
చిన్నా, పెద్ద చూడను!
కోలీవుడ్‌లో అరుదుగా మెరిసే ఈ మలయాళీ బ్యూటీ రమ్యా నంబీశన్.. మంచి గాయని కూడా అన్న విషయం తెలిసిందే. అయితే తన తీయని గొంతునూ చాలా పరిమితంగానే ఉపయోగిస్తోంది. అడిగితే గాయనిగా అవకాశాలు రావాలిగా అంటూ ఎదురు ప్రశ్నస్తిస్తున్నారు. అయితే కోలీవుడ్‌లో ఈ అమ్మడికి విజయాల శాతం మాత్రం చెప్పుకోతగ్గట్టుగానే ఉంది. ఆ మధ్య పిజ్జా, సేతుపతి వంటి చిత్రాలతో సక్సెస్‌ను అందుకున్న రమ్యానంబీశన్ తాజాగా నట్పు ఎన్నను తెరియుమా చిత్రంతో సక్సెస్‌ను అందుకున్నారు. ఈ చిత్ర సక్సెస్ మీట్లో ఈ అమ్మడిని పలకరించగా చాలా విషయాలను చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దాం. పెద్ద హీరోలు, చిన్న హీరోలన్న తారతమ్యం లేకుండా నటించేస్తున్నారే? చిన్నా, పెద్ద అన్న తేడాలను చూడను. నటిగా పాత్ర బాగుంటే నటించడానికి సై అంటాను. సేతుపతి చిత్రం తరువాత ఎక్కువగా అమ్మ పాత్రలే వస్తుండడంతో వాటిని అంగీకరించలేదు. ఈ నట్పు ఎన్నను తెరియుమా చిత్రంలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో అందరూ కొత్తవారైనా నటించడానికి ఓకే చెప్పాను. అమ్మ పాత్రల్లో నటించడం కంటే ఇలాంటి నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించడానికి ఇష్టపడుతున్నాను. సరే. ఎక్కువగా అతిథి పాత్రల్లో కనిపించడానికి కారణం? కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. స్నేహం కోసమే. అయినా ఇప్పుడు తనను అతిథి నటిగా మార్చేస్తారేమోనన్న భయం కలుగుతోంది. ఇకపై అతిథి పాత్రల్లో నటించడాన్ని తగ్గించుకుంటాను. నచ్చిన కథా పాత్రల్లోనే నటించాలని నిర్ణయం తీసుకున్నాను. తదుపరి చిత్రం? ప్రస్తుతం విజయ్‌ఆంటోనికి జంటగా తమిళరసన్ చిత్రంలో నటిస్తున్నాను. దీనికి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం ఇళయరాజా సంగీతంలో పాడనున్నారా? నిజం చెప్పాలంటే ఆయన సంగీతదర్శకత్వంలో పాడాలంటే నాకు భయం. ఇళయరాజా 75 అభినందన వేదికపై ఆయన సమక్షంలో పాడే అవకాశం రావడమే భాగ్యంగా భావిస్తున్నాను. ఇటీవల పాడడం తగ్గించినట్లున్నారే? పాడడం అంటే నాకిష్టం. అయితే అవకాశాలు రావడం లేదన్నదే నిజం. -
ప్రశ్నిస్తే పక్కన పెట్టేస్తున్నారు: నటి
తమిళసినిమా: ప్రశ్నిస్తే పక్కన పెట్టేస్తున్నారంటూ నటి రమ్యానంబీశన్ ఆవేదన వ్యక్తం చేసింది. కోలీవుడ్‌లో పిజా, సేతుపతి, మెర్కూరీ వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ కేరళా బ్యూటీ తాజాగా నటించిన నట్పున్నా ఎన్నాన్ను తెరియుమా విడుదలకు సిద్ధం అవుతోంది. మాతృభాషతో పాటు కన్నడంలోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడికిప్పుడు మలయాళంలో అవకాశాలు రావడం లేదట. దీని గురించి రమ్యానంబీశన్ ఒక భేటీలో తెలుపుతూ ఇప్పుడు మహిళలకు మీటూ అనేది ఒక పెద్ద అలలా వెలుగులోకి వచ్చిందని అంది. అయితే దీని ఏడాది ముందే మలయాళ సినిమాకు చెందిన మహిళల భద్రత కోసం డబ్ల్యూసీసీ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారని చెప్పింది. అయితే ఈ సంఘం ద్వారా నటీమణులు తమ సమస్యల గురించి న్యాయమైన రీతిలో ప్రశ్నించగా అలాంటి వారిని మాలీవుడ్ అవకాశాలు కల్పించకుండా పక్కన పెట్టేస్తోందని చెప్పింది. ఈ అమ్మడు కోలీవుడ్‌నే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. రమ్యానంబీశన్ తాజాగా నటుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించిన సీతకాది చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. -
వెండితెరకు వైరస్
ఈ సంవత్సరం స్టార్టింగ్‌లో నిఫా వైరస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని. అందర్నీ గడగడలాడించిన ఈ భయంకరమైన వైరస్‌ని బేస్ చేసుకొని మలయాళ దర్శకుడు ఆషిక్ అబు ఓ చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అయ్యారు. ‘వైరస్’ పేరుతో తెరకెక్కబోయే ఈ రియలిస్టిక్ డ్రామాలో భారీ తారాగణం కనిపించబోతున్నారు. రేవతి, రీమా కళ్లింగల్, పార్వతీ, టావినో థామస్, రమ్యా నంబీసన్, చెంబు వినోద్ వంటి నటీనటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆల్రెడీ మలయాళంలో రియలిస్టిక్ సంఘటనలతో తెరకెక్కించిన ‘టేకాఫ్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. మరి.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది. -
అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా?
ఈ ప్రపంచంలో ఎవరు మన మేలు కోరుకున్నా కోరుకోకపోయినా మనం బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి ‘అమ్మ’. తప్పు చేసినా క్షమించే గుణం అమ్మకి ఉంటుంది. మరి.. అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా? అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఈ ‘అమ్మ’ వేరు. ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ). కేరళ నటీనటుల సంఘం అన్నమాట. కథానాయిక భావనపై జరిగిన లైంగిక దాడిలో జోక్యం ఉందనే కారణంగా నటుడు దిలీప్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనివల్ల ‘అమ్మ’లో దిలీప్ సభ్యత్వం రద్దయింది. బెయిల్ మీద బయటికొచ్చిన దిలీప్ని మళ్లీ అసోసియేషన్‌లో చేర్చుకోవాలని ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్‌లాల్, ఇతర సభ్యులు నిర్ణయం తీసుకోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన నటీమణుల్లో రమ్యా నంబీసన్ ఒకరు. బాధిత నటికి అండగా ఉండటం కోసం ‘అమ్మ’కు ఆమె రాజీనామా చేసిన వెంటనే రమ్యా నంబీసన్, రీమా కల్లింగల్ వంటి తారలు తామూ రాజీనామా చేశారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గుటున్నట్లు అనిపించిందని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రమ్యా నంబీసన్ పేర్కొన్నారు. ‘‘అమ్మ’ నుంచి బయటికొచ్చాక అభద్రతాభావం ఏర్పడింది. అవకాశాలు తగ్గుతున్నాయని గ్రహించాను. అది మాత్రమే కాదు.. నేను షూటింగ్స్‌కి సరిగ్గా రానని, నిర్మాతలను ఇబ్బంది పెడతానని, అందుకని నన్ను తీసుకోకూడదనీ ప్రచారం చేస్తున్నారు. కానీ నేనెప్పుడూ ఎవర్నీ ఇబ్బందిపెట్టలేదు. ‘అమ్మ’ తీసుకున్న నిర్ణయాన్ని తోటి నటీమణులతో కలసి వ్యతిరేకించాను కానీ నేను ఏం మాట్లాడినా అది మొత్తం మగవాళ్లందర్నీ వ్యతిరేకిస్తున్నట్లు కాదు కదా. ఒక సమస్య ఉంది.. పరిష్కరించండి అన్నాం. అది తప్పా’’ అని రమ్యా నంబీసన్ అన్నారు. నిజమే కదా. నిర్భయంగా మాట్లాడితే లేనిపోని నిందలు వేయడం న్యాయమా? -
రమ్యానంభీశన్ చిత్రానికి హైకోర్టు బ్రేక్
తమిళసినిమా: నటి రమ్యానంభీశన్ కథానాయకిగా నటించిన చిత్రానికి చెన్నై హైకోర్టు బ్రేక్ వేసింది. వివరాలు చూస్తే లిబ్రా ప్రొడక్షన్ పతాకంపై రవీంద్రన్ నిర్మించిన చిత్రం నట్పున్నా ఎన్నన్ను తెరియుమా. నటి రమ్యానంభీశన్ కథానాయకిగా నటించిన ఇందులో కవిన్ కథానాయకుడిగా నటించారు. శివకుమార్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్ర విడుదలను వ్యతిరేకిస్తూ మలేషియా పాండియన్ అనే డిస్ట్రిబ్యూటర్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నట్పున్నా ఎన్నన్ను తెరియుమా చిత్ర విదేశీ విడుదల హక్కులను చిత్ర నిర్మాత నుంచి తాను పొందానన్నారు. అందుకు అడ్వాన్స్‌గా రూ.8లక్షలు ఇచ్చి ఒప్పందం కూడా చేసుకున్నట్లు చెప్పారు. ఆ తరువాత పలు మార్లు కొంచెం కొంచెంగా రూ.25లక్షల వరకూ నిర్మాతకు చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే నిర్ణయించిన ప్రకారం చిత్రాన్ని విడుదల చేయకపోవడంతో తాను నష్టపోయానన్నారు. దీంతో తన నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వమని కోరగా నిర్మాత చెల్లించలేదన్నారు. దీనిపై తాను నిర్మాతల మండలిలో, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కాబట్టి తన డబ్బు తిరిగి చెల్లించే వరకూ నట్పున్నా ఎన్నన్న తెరియుమా చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం చిత్రాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ విడుదల చేయకూడదంటూ స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌లో లుకలుకలు
తిరువనంతపురం: మళయాళం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘అమ్మ’(Association of Malayalam Movie Actors) లుకలుకలు మొదలయ్యాయి. ప్రస్తుతం అమ్మ అధ్యక్షుడిగా ఉన్న ఇన్నోసెంట్, ప్రధాన కార్యదర్శి మమ్మూటీని ఆయా పదవుల నుంచి దిగిపోవాలంటూ పలువురు సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. అమ్మలో సమూల మార్పులు కొరుకుంటున్న సభ్యులు.. తెరపైకి కొత్త పేర్లను తెస్తున్నారు. అధ్యక్షుడిగా మోహన్‌లాల్? దాదాపు 20 ఏళ్లుగా అధ్యక్షుడి పదవిలో ఇన్నోసెట్ కొనసాగుతూ వస్తున్నారు. త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకాలం సభ్యులుగా ఉన్నవాళ్లు వైదొలిగి.. ఈసారి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తేవటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్నికల ప్రస్తావన లేకుండా ఏకపక్షంగా ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సభ్యులు తీర్మానించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మోహన్‌లాల్.. ఈ విషయంలో సుముఖంగా ఉన్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన విముఖత వ్యక్తం చేస్తే.. మరో ఉపాధ్యక్షుడు గణేషన్‌కు అవకాశం లభించొచ్చని మాలీవుడ్ వర్గాల కథనం. ప్రధాన కార్యదర్శి పోటీకి నామినేషన్ దాఖలు చేసిన ఇదవేలా బాబు ఈ విషయమై స్పందిస్తూ.. కొత్త వారు నామినేషన్లు వేస్తే తామంతా పోటీ నుంచి విరమించుకుంటామని స్పష్టం చేశారు. అలాకానీ పక్షంలో పాత సభ్యులే కొనసాగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. జూన్ 24వ తేదీ జరబోయే జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ అంశం ఓ కొలిక్కి వస్తుందని ఆయన అంటున్నారు. అమ్మ ఏకపక్ష నిర్ణయాలు.. దీనికి తోడు నటి భావన ఉదంతంలో ‘అమ్మ’ వైఖరిపై పెద్ద ఎత్తున్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వారిని వైదొలగాలంటూ సభ్యులు నిర్ణయించినట్లు భోగట్ట. పృథ్వీ, రమ్యలపై చర్యలు... భావన ఉదంతంపై హీరో పృథ్వీరాజ్, నటి రమ్య నంబీషన్లు అమ్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ‘అమ్మ’ ఎలాంటి జోక్యం చేసుకోకపోవటం అప్రజాస్వామికమని, నిందితులు ఎవరో తెలిసీ కూడా కంటితుడుపు చర్యలు తీసుకోవటం దారుణమంటూ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉన్న వీరిద్దరూ వ్యాఖ్యానించారు. దీంతో వీరిద్దరిపై క్రమశిక్షణ నియామవళి ప్రకారం చర్యలు తీసుకోవాలని అసోషియేషన్ నిర్ణయించింది. జూన్ 24న జరగబోయే జనరల్ బాడీ మీటింగ్‌లో వీరిద్దరి భవిష్యత్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. -
క్యాస్టింగ్ కౌచ్ నిజమే..!
సాక్షి, సినిమా: క్యాస్టింగ్ కౌచ్‌పై ఇంతకు ముందు కోలీవుడ్‌లో సుచీ లీక్స్ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. పలువురి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇప్పుడు శ్రీరెడ్డి లీక్స్గా టాలీవుడ్‌ను ఊపేస్తోంది. అంతే కాదు దానికి రాజకీయ రంగు పులుముకుంది. గాయని సుచిత్ర, నటి శ్రీరెడ్డినే కాదు అంతకుముందు, ఆ తరువాత పలువురు నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగానే వెల్లడించారు. తాజాగా నటి రమ్యానంబీశన్ క్యాస్టింగ్ కౌచ్ విధానం ఉన్నమాట నిజమేనని వంత పాడారు. పిజ్జా, సేతుపతి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా ప్రభుదేవాతో మెర్క్యురీ చిత్రంలో మెరిసింది. సినీ వర్గాలో దుమారం రేపుతున్న క్యాస్టింగ్‌కౌచ్ గురించి నటి రమ్యానంబీశన్ మాట్లాడుతూ.. నటీమణులకు లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, పడకగదికి రమ్మనే ఆనవాయితీ నడుస్తోందని చెప్పింది. ఇది సినీ రంగంలోనే కాకుండా అంతటా ఉందని అంది. అవకాశాల కోసం అమ్మాయిలను పడకగదికి పిలిచే వ్యవహారం సినీరంగంలో జరుగుతోందని చెప్పింది. అయితే అలాంటి సంఘటన తనకు ఎదురవ్వలేదుగానీ, సహ నటీమణులు కొందరు క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పడం విన్నానని తెలిపింది. ఇలాంటి నీచ సంఘటనలను సినీరంగంలో అడ్డుకోవాలని పేర్కొంది. అందుకు బాధింపునకు గురైన నటీమణులు ధైర్యంగా పోరాటం చేయాలని, క్యాస్టింగ్ కౌచ్ అనే మాట వినిపించకుండా చేయాలని పేర్కొంది. -
విలన్... ఫన్!
వెండితెరపై విలన్లను చూస్తే ఎవరికైనా నవ్వొస్తుందా? అఫ్కోర్స్... కామెడీ విలన్లు ఉన్నారనుకోండి! కాసేపు వాళ్లను పక్కన పెట్టేసి, సీరియస్ విలన్ల సంగతికి వద్దాం! వాళ్లను చూస్తే నవ్వొస్తుందా? చూస్తున్నది తెరపైనే అయినా ఒక్కోసారి భయం వేస్తుంది. కానీ, ప్రభుదేవా ‘విలన్’ అంటే ‘ఫన్’ అంటున్నారు! ఎందుకిలా? అంటే... ‘మెర్క్యూరీ’ అనే తమిళ సినిమాలో ఈ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సంగతి ప్రేక్షకులకు తెలిసిందే! ‘విలన్‌గా నటించడం ఎలా ఉంది?’ అనే ప్రశ్నను ప్రభుదేవా ముందుంచితే – ‘‘ఇంతకు ముందెప్పుడూ విలన్‌గా చేయలేదు. ఒక్కసారి ప్రపంచమంతా మారినట్టు, వింతగా అన్పిస్తోంది. బట్, ఇట్స్ ఫన్! యాక్టింగ్ అంటే అంతేగా... రియల్ లైఫ్‌లో మనం చేయలేని పనులను రీల్ లైఫ్‌లో చేసే చాన్స్ దొరుకుతుంది’’ అన్నారు. మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్! ‘మెర్క్యూరీ’కి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే... మూకీ చిత్రమిది! నో డైలాగ్స్... ఓన్లీ యాక్షన్! కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ్ డబ్బింగ్ హిట్ ‘పిజ్జా’ దర్శకుడీయనే. ‘పిజ్జా’లో హీరోయిన్గా నటించిన రమ్యా నంబీసన్ ఇందులోనూ నటిస్తున్నారు. మూకీ సినిమా కావడంతో తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. మూకీకి డబ్బింగ్ అవసరం లేదు... దాంతో ఎన్ని లాభాలో చూడండి!! -
మా రొమాన్స్ మెచ్చారు
తమిళసినిమా: నటుడు విజయ్‌సేతుపతి, తాను కలిసి చేసిన రొమాన్స్‌ను ప్రేక్షకులు మెచ్చారని నటి రమ్యానంబీశన్ అంటోంది. సేతుపతి చిత్రం తరువాత ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నట్పున్నా ఎన్నాన్ను తెరియుమా, సత్య చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా కన్నడంలో దర్శన్ నిర్మిస్తూ, నటిస్తున్న పురాణ ఇతిహాస కథా చిత్రం కురుక్షేత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడు కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాల వేటలో పడిందట. నటుడు విజయ్ సేతుపతికి జంటగా నటించే అవకాశం మళ్లీ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న రమ్యానంబీశన్ మాట్లాడుతూ తాను ఇంతకు ముందు కొన్ని తమిళ చిత్రాల్లో నటించినా విజయ్‌సేతుపతికి జంటగా నటించిన పిజ్జా చిత్రం నటిగా తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని చెప్పింది. ఆ తరువాత మరికొన్ని చిత్రాలు చేసినా మళ్లీ విజయ్‌సేతుపతితో కలిసి నటించిన సేతుపతి చిత్రంతో పేరు వచ్చిందని పేర్కొంది. ఈ చిత్రంలో తమ రొమాన్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయని చెప్పింది. అందువల్ల తమది హిట్ పెయిర్‌గా పేర్కొంది. అందువల్ల మళ్లీ ఆయనతో నటించాలని ఆశపడుతున్నానంది. విజయ్‌సేతుపతితో మళ్లీ జత కట్టే అవకాశం వస్తుందనే నమ్మకం తనకు ఉందని అంది. అయితే అలాంటి మంచి కథ అమరాలని రమ్యానంబీశన్ అంది. -
ఆయనతో నో ప్రాబ్లం
నటుడు విజయ్‌సేతుపతితో నటించడం నాకేప్పుడూ కంఫర్టబులే అంటోంది నటి రమ్యానంబీశన్. బహుభాషా నటి అయిన ఈ కేరళకుట్టి తమిళంతో పాటు మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలోనూ తన ముద్రను వేసుకుంది. అయితే తమిళంలో ప్రముఖ హీరోయిన్ స్థానం కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. అవకాశాలు కూడా అడపాదడపానే అందుతున్నాయి. అవీ వర్ధమాన కథానాయకులతోనే అన్నది గమనార్హం. తాను కంఫర్టబుల్ జోన్లోనే పాత్రలను ఎంపిక చేసుకుంటున్నానంటున్న రమ్యానంబీశన్ తాజాగా విజయ్‌సేతుపతికి జంటగా సేతుపతి అనే చిత్రంలో నటిస్తోంది. విషయం ఏమిటంటే ఇంతకు ముందు ఈ జంట పిజ్జా అనే హిట్ చిత్రంలో నటించారు. ఆ తరువాత మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం సేతుపతినే. రమ్యానంబీశన్ మాట్లాడుతూ సేతుపతి చిత్రంలో తాను చిత్ర కళాకారిణిగా నటిస్తున్నానంది. ఇదే కాదు మలయాళం, కన్నడం భాషల్లోనూ ప్రస్తుతం తాను కంఫర్టబుల్ జోన్లోనే పాత్రలను ఎంపిక చేసుకుంటున్నానని చెప్పింది. విజయ్‌సేతుపతి గురించి చెప్పాలంటే పిజ్జా చిత్రం తరువాత మళ్లీ ఇప్పుడే ఆయన్ని కలిశానని తెలిపింది. ప్రస్తుతం విజయ్‌సేతుపతి ఎదుగుతున్న హీరో అనీ అయినా ఆయనలో ఎలాంటి మార్పు లేదని అంది. విజయ్‌సేతుపతితో నటించడం తనకెప్పుడూ కంఫర్టబులేనని రమ్యానంబీశన్ వ్యాఖ్యానించింది. -
సేతుపతి, రమ్యానంబీశన్ జతగా మరో చిత్రం
కొన్ని జంటలు ఒక్క చిత్రంలో నటించినా హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో విజయ్ సేతుపతి, రమ్యా నంబీశన్ జంట ఒకటి. వీరిని పిజ్జా చిత్రం కలిపింది. అది ఆ ఇద్దరికి లైఫ్‌లో గుర్తుండిపోయే చిత్రంగా మిగిలిపోయింది. ఆ తరువాతే ఎవరి అవకాశాలను వారు సద్వినియోగం చేసుకుంటూ వస్తున్న విజయ్ సేతుపతి, రమ్యా నంబీశన్ తాజాగా మరోసారి కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. తమిళంలో అడపా దడపా అవకాశాల్ని అందుకుంటున్న మలయాళ కుట్టి రమ్యా నంబీశన్ ఇటీవల నాలు పోలీసు నల్లా ఇరుంద ఊరు చిత్రంలో అరుళ్‌నిధితో నటించారు. ఆ తరువాత నటించే తమిళ చిత్రం విజయ్ సేతుపతితోనే అవుతుంది. ఇంతకుముందు విజయ్ సేతుపతి హీరోగా పణై్నయారుమ్ పద్మినియుమ్ వంటి విభిన్న విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విజయ్ సేతుపతి పోలీసు అధికారిగా నటించనున్నారు. ఇది పోలీసులు ఎదుర్కొనే సమస్యల ఇతివృత్తంగా ఉంటుందట. రమ్యానంబీశన్ది హీరోకు దీటుగా ఉండే పాత్ర అని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. మదురై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ పాత్ర నిజాయితీ ధైర్య సాహసాలతో సహజత్వానికి దగ్గరగా ఉంటుందట. వచ్చే నెలలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. దీనికి సేతుపతి అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. రచయిత వేల రామమూర్తి ముఖ్యపాత్రను పోషించనున్న ఈ చిత్రానికి తెగిడి చిత్రం ఫేమ్ నివాస్ కె.ప్రసన్న సంగీత బాణీలు అందిస్తున్నారు. -
ఆల్బమ్‌కు సిద్ధం..
రెంటికీ చెడ్డ రేవడిలా అయిపోయింది రమ్యానంబీశన్ పరిస్థితి. తొలి రోజుల్లో రామన్ తేడియ సీతై లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి ఆ తరువాత మలయాళ చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ అవకాశాలను మిస్ చేసుకుంది. ఆ తరువాత పిజ్జా చిత్రంతో సక్సెస్‌ను అందుకున్న రమ్యానంబీశన్‌కు మళ్లీ అవకాశాలు రావడం మొదలెట్టడంతోపాటు విశాల్ చిత్రం పాండియనాడులో పాడే అవకాశం వచ్చింది. పై పై పై అనే ఆ పాట విశేష ప్రజాదరణ పొందడంతో గాయనిగాను రాణించాలనే కోరికను పెంచుకుంది. దీంతో హీరోయిన్ అవకాశం తలుపు తట్టినప్పుడు పాడే అవకాశం ఇస్తేనే నటిస్తానంటూ షరతులు విధించడం మొదలెట్టింది. దీంతో నటిగా వచ్చే అవకాశాలు వెనక్కి పోయాయి. చక్కని అందం, అభినయం వున్నా ఆమె కోరికే ఇప్పుడామెకు శత్రువుగా మారింది. ఇలాగుంటే ప్రస్తుతం తమ చిత్రంలో ఒక్క పాట పాడు అనే దర్శక నిర్మాతలేగానీ నటిగా మాత్రం అవకాశాలివ్వడం లేదని వాపోతోంది రమ్యానంబీశన్. ఇక చేసేదేమీ లేక ఈ మలయాళీ బ్యూటీ పాటలనే నమ్ముకోవాలని నిర్ణయించుకుందట. ఇప్పుడా అవకాశాలు రాకపోవడంతో తన సొంతంగా ఒక ఆల్బమ్ తయారు చేయడానికి సిద్ధమైందని సమాచారం. ముందుగా ఒక పాట పాడి దాన్ని విడుదల చేసి సంగీత ప్రియుల ఆదరణ చూసి ఆ తరువాత మరిన్ని పాటలు పాడాలనుకుంటున్నారట. పాటల ఆల్బమ్ రూపొందించడం అంత సులభం కాదని అయినా తన స్నేహితులు, సోదరుడి సహకారంతో ఈ ఆల్బమ్‌ను పూర్తి చేయడానికి సిమైనట్లు రమ్యానంభీశన్ పేర్కొంది. -
ధనాధన్ మూవీ స్టిల్స్
-
స్కిన్ షోకు దూరం
బికిని వంటి బిగుతైన దుస్తులు, అరకొర డ్రస్‌తోనే శృంగారం ఆవిష్కృతమవుతుందనుకోవడం పొరపాటని నటి రమ్యానంబీశన్ పేర్కొన్నారు. ఈ మాలీవుడ్ బ్యూటీ తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఆమె మంచి గాయని కూడా. పాండియనాడు చిత్రంలో ఈ అమ్మడు పాడిన ఫై ఫై ఫై కలాచీ ఫై పాట వాడవాడలా మారుమోగుతోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం డమాల్ డుమీల్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో చిన్న భేటి. ప్ర : మునుపటికంటే చాలా స్లిమ్‌గా తయారైనట్టున్నారు? జ: అందుకు చాలా కసరత్తులు చేస్తున్నాను. హీరోయిన్లకు అందం ప్రధానాకర్షణ కదా..! ప్ర : హీరోయిన్గా అవకాశం వస్తే పాడే ఛాన్స్ కోరుతూ షరతులు విధిస్తున్నారట? జ : అదంతా మీడియా ప్రచారం. ఇప్పటి వరకు ఏ దర్శక నిర్మాతలకు అలాంటి షరతులు విధించలేదు. నేను మలయాళ నటి అయినా తమిళ భాష స్పష్టంగా మాట్లాడగలను. పాడడమంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు మలయాళంలో 20 పాటలకు పైగా పాడాను. తమిళంలో పాండియనాడు చిత్రంలో ఫై ఫై ఫై కలాచీ ఫై పాటకు నా తమిళ ఉచ్ఛరణ చాలా హస్కిగా ఉందంటూ ప్రశంసలు అందుకున్నాను. డమాల్ డుమీల్ చిత్రంలో ముంబాయి ప్రముఖ గాయని ఉషా ఉతప్ ఒక పాట పాడారు. ఆమె నా అభిమాన గాయని. దర్శక నిర్మాతల కోరిక మేరకే నేను ఒక పాట పాడాను. ప్ర: నటిగా, గాయనిగా వేర్వేరు పారితోషికాలు పొందుతున్నారా? జ: నేను హీరోయిన్గా నటించే చిత్రానికి పాడితే గాయనిగా పారితోషికం తీసుకోను. ఇతర చిత్రాల్లో తగినంత వసూలు చేస్తాను. ప్రస్తుతం అరుళ్‌నిధి సరసన నటిస్తున్న నాలు పోలీసుం నల్లా ఇరుంద ఊరు చిత్రంలో కూడా ఒక పాట పాడాను. అదే విధంగా బర్మా అనే చిత్రంలో కూడా నా పాటవినవచ్చు. నా తొలి ప్రాధాన్యత మాత్రం నటనకే. ప్ర : తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయడం లేదే? జ : పిజ్జా చిత్రం తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి. మల యాళం, కన్నడ భాషల్లో కూడా నటిస్తుండడంతో కాల్ షీట్స్ సమస్య ఏర్పడుతోంది. అందువల్ల తమిళంలో కొన్ని అవకాశాలను అం గీకరించలేకపోతున్నాను. ఆ మధ్య తెలుగులో నటిం చాను. హిందీలోనూ అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ రంగ ప్రవేశం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్ర: బికిని దుస్తులకు దూరం అంటున్నారటగా? జ : స్కిన్ షో ప్రదర్శించాల్సిన అవసరం మాత్రం లేదు. మోడ్రన్ దుస్తుల్లో గ్లామర్‌గా నటించడానికి అభ్యంతరం లేదు. కథ విన్నప్పుడు ఏ సన్నివేశంలో ఎలా నటిస్తానన్న విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పేస్తాను. అందువల్ల ఇప్పటి వరకు ఏ షూటింగ్లోను ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు. అయినా బికిని లాంటి కురుచ దుస్తుల్లోనే కాదు సాధారణ దుస్తుల్లోను శృంగారాన్ని ఆవిష్కరించవచ్చు. ప్ర: నాన్ శిగప్పు మనిధన్ చిత్రంలో నటి లక్ష్మీమీనన్ ముద్దు సన్నివేశాల గురించి? జ: ఇది నాకు అవసరం లేని అంశం. ఇతర నటీమణులు ఏం చేస్తున్నారన్న విషయాల గురించి నన్ను అడగకండి. నా వరకు ముద్దు సన్నివేశాల్లో నటించడం నచ్చదు. ప్ర : మీప్రేమ, పెళ్లి విషయాల గురించి? జ : ఆ విషయాల గురించిన ప్రస్తావన ఇప్పుడొద్దు. ప్రేమ, పెళ్లి అంటూ అనవసర ప్రశ్నలతో నా సమయాన్ని వృథా చేయవద్దు.