బికిని వంటి బిగుతైన దుస్తులు, అరకొర డ్రస్‌తోనే శృంగారం ఆవిష్కృతమవుతుందనుకోవడం పొరపాటని నటి రమ్యానంబీశన్ పేర్కొన్నారు. ఈ మాలీవుడ్ బ్యూటీ తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఆమె మంచి గాయని కూడా. పాండియనాడు చిత్రంలో ఈ అమ్మడు పాడిన ఫై ఫై ఫై కలాచీ ఫై పాట వాడవాడలా మారుమోగుతోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం డమాల్ డుమీల్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో చిన్న భేటి.
ప్ర : మునుపటికంటే చాలా స్లిమ్‌గా తయారైనట్టున్నారు?
జ: అందుకు చాలా కసరత్తులు చేస్తున్నాను. హీరోయిన్లకు అందం ప్రధానాకర్షణ కదా..!
ప్ర : హీరోయిన్‌గా అవకాశం వస్తే పాడే ఛాన్స్ కోరుతూ షరతులు విధిస్తున్నారట?
జ : అదంతా మీడియా ప్రచారం. ఇప్పటి వరకు ఏ దర్శక నిర్మాతలకు అలాంటి షరతులు విధించలేదు. నేను మలయాళ నటి అయినా తమిళ భాష స్పష్టంగా మాట్లాడగలను. పాడడమంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు మలయాళంలో 20 పాటలకు పైగా పాడాను. తమిళంలో పాండియనాడు చిత్రంలో ఫై ఫై ఫై కలాచీ ఫై పాటకు నా తమిళ ఉచ్ఛరణ చాలా హస్కిగా ఉందంటూ ప్రశంసలు అందుకున్నాను. డమాల్ డుమీల్ చిత్రంలో ముంబాయి ప్రముఖ గాయని ఉషా ఉతప్ ఒక పాట పాడారు. ఆమె నా అభిమాన గాయని. దర్శక నిర్మాతల కోరిక మేరకే నేను ఒక పాట పాడాను.
ప్ర: నటిగా, గాయనిగా వేర్వేరు పారితోషికాలు పొందుతున్నారా?
జ: నేను హీరోయిన్‌గా నటించే చిత్రానికి పాడితే గాయనిగా పారితోషికం తీసుకోను. ఇతర చిత్రాల్లో తగినంత వసూలు చేస్తాను. ప్రస్తుతం అరుళ్‌నిధి సరసన నటిస్తున్న నాలు పోలీసుం నల్లా ఇరుంద ఊరు చిత్రంలో కూడా ఒక పాట పాడాను. అదే విధంగా బర్మా అనే చిత్రంలో కూడా నా పాటవినవచ్చు. నా తొలి ప్రాధాన్యత మాత్రం నటనకే.
ప్ర : తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయడం లేదే?
జ : పిజ్జా చిత్రం తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి. మల యాళం, కన్నడ భాషల్లో కూడా నటిస్తుండడంతో కాల్ షీట్స్ సమస్య ఏర్పడుతోంది. అందువల్ల తమిళంలో కొన్ని అవకాశాలను అం గీకరించలేకపోతున్నాను. ఆ మధ్య తెలుగులో నటిం చాను. హిందీలోనూ అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ రంగ ప్రవేశం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ప్ర: బికిని దుస్తులకు దూరం అంటున్నారటగా?
జ : స్కిన్ షో ప్రదర్శించాల్సిన అవసరం మాత్రం లేదు. మోడ్రన్ దుస్తుల్లో గ్లామర్‌గా నటించడానికి అభ్యంతరం లేదు. కథ విన్నప్పుడు ఏ సన్నివేశంలో ఎలా నటిస్తానన్న విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పేస్తాను. అందువల్ల ఇప్పటి వరకు ఏ షూటింగ్‌లోను ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు. అయినా బికిని లాంటి కురుచ దుస్తుల్లోనే కాదు సాధారణ దుస్తుల్లోను శృంగారాన్ని ఆవిష్కరించవచ్చు.
ప్ర: నాన్ శిగప్పు మనిధన్ చిత్రంలో నటి లక్ష్మీమీనన్ ముద్దు సన్నివేశాల గురించి?
జ: ఇది నాకు అవసరం లేని అంశం. ఇతర నటీమణులు ఏం చేస్తున్నారన్న విషయాల గురించి నన్ను అడగకండి. నా వరకు ముద్దు సన్నివేశాల్లో నటించడం నచ్చదు.
ప్ర : మీప్రేమ, పెళ్లి విషయాల గురించి?
జ : ఆ విషయాల గురించిన ప్రస్తావన ఇప్పుడొద్దు. ప్రేమ, పెళ్లి అంటూ అనవసర ప్రశ్నలతో నా సమయాన్ని వృథా చేయవద్దు.
స్కిన్ షోకు దూరం
Published Sat, Apr 19 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement
Advertisement