The heroine
-
కదిరిలో ‘కంచె’ హీరోయిన్
బిగ్ సి షో రూం ప్రారంభం కదిరి : బిగ్ సి వారి 132వ నూతన షోరూంను సోమవారం అనంతపురం జిల్లా కదిరిలో సినీ నటి ప్రగ్య జైస్వాల్ (కంచె ఫేం) చేతుల మీదులగా ప్రారంభింపజేశారు. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి ఐదు శాతం డబ్బు వాపసు ఇస్తారని ఆమె తెలిపారు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక బహమతి అందుకోవచ్చన్నారు.సంస్థ డైరెక్టర్లు ఆర్.గౌతంరెడ్డి, వై.స్వప్నకుమార్ మాట్లాడుతూ అన్ని రకాల సెల్ఫోన్లు ఇక్కడ తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయన్నారు. బిగ్ 'సి' 14వ వార్షికోత్సం సందర్భంగా రూ.12,999 విలువ గల క్రోమ్యాక్స్ సెల్ కొంటే ఒక ఎల్ఈడీ టీవీ ఉచితమన్నారు. హెచ్‌టీసీ సెల్ కొనుగోలు చేస్తే రూ.6,990 విలువ గల 5.1 హోం థియేటర్, వైవో, ఒప్పో కంపెనీ ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.1,999 విలువ గల పవర్ బ్యాంక్‌తో పాటు బ్లూటూత్ ఉచితం అన్నారు. స్యాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ సెల్ కొనుగోలు చేసిన వారికి రూ.2,000 వాపసు ఇస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో పట్టణవాసులు పాల్గొన్నారు. -
మొదట్లో నేనూ... ఫీలయ్యేదాన్ని!
తెలుగు, తమిళ భాషల్లో సమంత ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’. చెప్పాలంటే తమిళ పరిశ్రమలోకన్నా తెలుగులోనే సమంత ఎక్కువ విజయాలు చూశారు. మొదటి చిత్రం ‘ఏ మాయ చేశావె’తోనే క్రేజీ హీరోయిన్ అయిపోయారు. ఆ మధ్య వరుసగా తెలుగు చిత్రాలే చేసిన సమంత ఇప్పుడు మాత్రం ఇటు తెలుగు, అటు తమిళంలో చేస్తూ బిజీగా ఉన్నారు. రెండు భాషల్లోనూ స్టార్ హోదా ఉన్నప్పటికీ సాదాసీదా అమ్మాయిలానే భావిస్తానని సమంత అంటున్నారు. ‘‘పరిశ్రమకు రాక ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను. కాకపోతే అంతకు ముందు కన్నా స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. ఇక్కడికొచ్చాక మానసికంగా స్ట్రాంగ్ అయ్యాను. ఒకవేళ ఎవరైనా సినిమా పరిశ్రమకు రావాలనుకున్నారనుకోండి... ఇక్కడకు రాక ముందే జీవితపాఠాలు నేర్చుకోవాలి. అప్పుడే ఇక్కడ నిలదొక్కుకోగలుగుతాం. లేకపోతే అపజయాలకు కుంగిపోతాం. పుకార్లకు దిగులుపడతాం. మొదట్లో నేనూ అలా బాధపడేదాన్ని. ఆ తర్వాత నుంచి తేలికగా తీసుకుంటున్నాను. అదే ఇండస్ట్రీకి రాక ముందే మానసికంగా బలంగా ఉండి ఉంటే, ముందు నుంచే వీటిని పెద్దగా పట్టించుకొనేదాన్ని కాదేమో! ఏమైనా, ఇప్పటికీ నా గురించి నెగటివ్, పాజిటివ్ - ఏ కామెంట్ వచ్చినా ఆలోచిస్తాను. ఆ వ్యాఖ్యల్లో ఏదైనా మంచి ఉంటే దాన్ని స్వీకరిస్తాను’’ అని సమంత చెప్పారు. -
త్రిషయితాన్
సైతాన్... దయ్యం... పిశాచి... అమ్మో అనుకోకండి. ఒక స్టార్ సత్తా చూపడానికి ఈ పాత్రలే గీటురాళ్లు. నమ్మకం లేదా? జ్యోతిక వేసిన ‘చంద్రముఖి’ చూడండి. అద్గదీ సంగతి. త్రిష కూడా ఇప్పుడు ఆ బాటలో తన సత్తా చూపే కొత్త పాత్ర చేస్తోంది... నటిగా పదిహేనేళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న గ్లామర్ హీరో యిన్ త్రిష. అందంగా, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తా రనే పేరున్న త్రిష ‘‘ఇక ఈ దశలో కొత్త తరహా పాత్రలు చేయాల్సిన అవసరముంది’’ అని గ్రహించారు. అందుకు తగ్గట్లే ఒక వినూత్న తరహా పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. హార్రర్ సినిమాలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై ఏకకాలంలో తెలుగు - తమిళ భాషల్లో ఈ చిత్రం తయారవు తోంది. రెండు భాషల్లోనూ ‘నాయకి’ అని టైటిల్ పెట్టారు. ‘షి వాచెస్ అండ్ క్యాచెస్ యు’ అనే వినూత్నమైన స్లోగన్ వాడుతున్నారు. దీర్ఘకాలంగా త్రిషకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఎం. గిరిధర్, శ్రీమతి పద్మజ మామిడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. చెన్నైలోని ఏ.వి.ఎం. స్టూడియోలోని వినాయకుడి గుడి దగ్గర గురువారం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. నిర్మాత గిరిధర్, దర్శకుడు గోవి, పబ్లి సిటీ డిజైనర్ లంకా భాస్కర్ తదితర చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ పూజలో పాల్గొన్నారు. అయిదు నిమిషాలకే ఓ.కె! ‘‘హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్లో ఉండగా, దర్శకుడు గోవి వచ్చి, ఈ ‘నాయకి’ చిత్రం కథ చెప్పారు. చెప్పడం మొదలుపెట్టిన అయిదు నిమిషాలకే నాకు కథ నచ్చేసింది. సినిమా చేయాలని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయా. కానీ, ఎంతో ఆత్రంగా గోవి కథ చెబుతున్న తీరు చూసి, ఆయనకు అడ్డుపడదలుచుకోలేదు. దాదాపు గంటసేపు ఆయన స్క్రిప్ట్ వివరంగా చెబుతుంటే, ఆసక్తిగా విన్నా’’ అని త్రిష పేర్కొన్నారు. ఈ హార్రర్ - కామెడీ జానర్ సినిమా గురించి త్రిష వివరిస్తూ, ఇలాంటి తరహా పాత్ర ఇంతకు ముందెప్పుడూ చేయలేదన్నారు. తనతో పాటు మరికొందరు తారలు కూడా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘‘మల్టీ స్టారర్’’గా త్రిష పేర్కొనడం విశేషం. గణేశ్ వెంకట్రామ్, ‘సత్యం’ రాజేశ్, జయప్రకాశ్, బ్రహ్మానందం, మనోబాల, కోవై సరళ తదితరులు చిత్రంలోని ఇతర పాత్రధారులు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం గోవి నిర్విహ స్తుంటే, రఘు కుంచె సంగీతం, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. భయపెట్టే పాత్రలో... గమ్మత్తేమిటంటే, హార్రర్ తరహా సినిమాలు చేయాలంటే ఇష్టమంటున్న త్రిష ఇప్పుడు సరిగ్గా అలాంటి పాత్రే చేస్తుండడం విశేషం. ‘‘హార్రర్ -కామెడీ జానర్లో గతంలో కూడా సినిమాలు వచ్చాయి. వాటిలో నూటికి 90 సినిమాలు సూపర్‌హిట్స్. ప్రత్యేకించి ఆ జానర్ అందరికీ బాగా నచ్చింది. కాగా, మేమిప్పుడు చేస్తున్న ‘నాయకి’ కథాకాలం కానీ, ఆ నేపథ్యం కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి’’ అని త్రిష వివరించారు. అప్పటి లుక్‌లో... 1980ల నాటికి చెందిన కథతో సాగే ఈ చిత్రంలో త్రిష లుక్స్ అప్పటి తరహా దుస్తుల్లో, ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పటికే, షూటింగ్ షురూ పోస్టర్స్ గురించి చర్చ జరుగుతోంది. సాక్షాత్తూ రాజమౌళి సైతం ‘‘ఈ మధ్య పోస్టర్లతో ఆసక్తి రేకెత్తించిన చిత్రాల్లో ‘నాయకి’ ఒకటి. చేతిలో కత్తితో, పెదవులపై చిరునవ్వుతో, వినూత్నమైన గెటప్‌తో త్రిష లుక్ బాగుంది’’ అని ట్వీట్ చేశారు. ఇవన్నీ విని ఆనందిస్తున్న త్రిష ఈ చిత్రాన్ని ‘రెట్రో హార్రర్ - కామెడీ’ అన్నారు. ‘‘హీరోయిన్లకు అరుదుగా వచ్చే స్క్రిప్ట్ ఇది. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రూపొందించే దర్శక, రచ యితలు ఉండడం అదృష్టం. ఈ స్క్రిప్ట్‌కు నేను న్యాయం చేస్తాననే అనుకుంటున్నా’’ అంటున్నారు త్రిష. మరి, ఇంతకీ ఈ సినిమాలో త్రిష పోషిస్తు న్నది హంతకురాలి పాత్రా, బాధితురాలి పాత్రా, లేక దయ్యం పాత్రా? అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే! -
రెండు పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుందట
కోలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్ క్రేజీ హీరోయిన్ సమంత అనడం అతిశయోక్తి కాదేమో.ప్రస్తుతం ప్రముఖ హీరోలందరితోనూ నటిస్తున్న ఏకైక నటి సమంతనే. విజయ్ తాజా చిత్రంలో హీరోయిన్ ఈ బ్యూటీనే. దనుష్ వీఐపీ2లో నటిస్తున్నారు. ఇక విక్రమ్ సరసన నటిస్తున్న పత్తుండ్రదుకుళ్ చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేశారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో ఈ చెన్నై సుందరి తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పత్తుఎండ్రదుకుళ్ చిత్రం తనకు ప్రత్యేకం అంటూ ఆది నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మరో విషయం ఏమిటంటే సమంత తొలిసారిగా తన రెండు పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారట. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు. పత్తుఎండ్రదుకుళ్ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం కల్పించిన దర్శకుడు విజయ్ మిల్టన్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు అన్నారు. ఇది తనకు సరికొత్త అనుభవం అంటున్న సమంత ఈ చిత్రంపై చాలా అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది. కాగా పత్తుఎండ్రదుకుళ్ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. -
తప్పులను తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటాను!
మై ఫిలాసఫీ జీవితం చాలామందికి పూలబాట కాకపోవచ్చు. పూలబాట అయినవాళ్లకు...అది శాశ్వతం కాకపోవచ్చు. ఈ ఎరుక మనలో ఉంటే కష్టాల్లోనైనా, సుఖాల్లోనైనా స్థిరచిత్తంతో ఉండే గుణం అలవడుతుంది. ‘నా శక్తి ఇది’ అని గొప్పగా చెప్పుకునే వాళ్లకు ‘నా బలహీనత ఇది’ అని చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే లెక్క కుదురుతుంది! మిగతా విషయాలను గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా... నా తప్పులను మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. కొన్ని సమయాల్లో ‘అహం’ వాస్తవాలను చూడడానికి నిరాకరిస్తుంది. అహాన్ని పక్కన పెడితే వాస్తవం చేరువవుతుంది. అహాన్ని వదులుకోవడం అంటే ఒక మెట్టు కిందకి దిగడం కాదు... రెండు మెట్లు పైకి ఎక్కడం. ఉత్తినే సలహాల కోసం సలహాలు ఇచ్చే వారి దగ్గర సలహాలు తీసుకోవడం కంటే, తీసుకోకపోవడం వల్లే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాత్రలు నచ్చకపోయినా ‘నటించాలి’ అనే నియమమేదీ పెట్టుకోలేదు. ‘ఇంటర్నేషనల్ రిలేషన్స్’లో డిగ్రీ ఉంది. సిటీబ్యాంకులో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. చెప్పొచ్చేదేమిటంటే సినిమాలు నచ్చనప్పుడు హాయిగా ఉద్యోగం చేసుకోగలను. ఈ చిన్న జీవితంలో మనం చేయడానికి ఎంతో ఉందని నమ్ముతాను. కష్టాలు, నష్టాల గురించి ఆలోచించడం వృథా. ఇంత పెద్ద జీవితంలో ఆలోచించడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆలోచనా శక్తిని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. బాగా సంపాదించాలి, బాగా కీర్తి గడించాలి... ఇలాంటి కోరికలు ఏమీ లేవు. సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతాను. ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటాను. - సోహా అలీ ఖాన్, హీరోయిన్ -
నా ప్రేమ భిన్నంగా ఉంటుంది
తన ప్రేమ చాలా భిన్నంగా ఉంటుందని అంటోంది. ఈ బ్యూటీ కేడీ బిల్లా కిల్లాడి రంగా, అళగియ అసురా, పంచామృతం చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఈ భామ తన గురించి తెలుపుతూ ‘మా అమ్మది కర్ణాటక. నాన్న ఉత్తరాదికి చెందిన వారు. బామ్మ గోవాకు చెందిన ఆంగ్లో ఇండియన్. తాత క్రిస్టియన్‌గా మారిన బ్రాహ్మణుడు. నేను చెన్నైలో పుట్టాను. ఇక నేనే ఊరికో చెందిన అమ్మాయినన్నది తికమక పడే విషయం. బాల నటిగా రంగ ప్రవేశం చేసిన నేను ముందుగా టీవీ సీరియళ్లలో నటించాను. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన ఆయుధ ఎళుత్తు చిత్రంలో సూర్య చిన్న చెల్లెలిగా నటించే అవకాశం వచ్చింది. కొన్ని కారణాలవల్ల ఆ చిత్రంలో నటించలేదు. ఆ తర్వాత తొమ్మిదవ తరగతి చదువుతుండగా కండనాళ్ ముదల్ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాను. నాకు మాంసాహారం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా చికెన్ ప్రియురాల్ని. ఒకసారి జంతు సంక్షేమ సంస్థ గురించి పుస్తకాన్ని చదివాను. అప్పటి నుంచి శాఖాహారిగా మారిపోయాను. ఇక నేను ప్రేమలో పడ్డట్టు ప్రచారం జోరందుకుంది. ఎవరో చెప్పింది వినకండి. కళ్లారా చూస్తేనే నమ్మండి. నా ప్రేమ అందరిలా సాధారణంగా ఉండదు. చాలా భిన్నంగా ప్రేమిస్తా. ప్రస్తుతానికి నా దృష్టంతా నటనపైనే’ అని పేర్కొంది. -
ఆలస్యంగా అర్థం చేసుకున్నాను!
లైఫ్ బుక్ ‘జీవితానికి ఏదో ఒక అర్థం ఉండాలి’ అనే ఆలోచనతో మెడిసిన్‌ను మధ్యలోనే వదిలేశాను. నా జీవితానికి ఒక అర్థం ఉండాలంటే అది కళలతోనే సాధ్యపడుతుంది అనుకున్నప్పుడు... ఇలా సినిమాల్లోకి వచ్చాను. చిత్రసీమకు వచ్చిన కొత్తలో మిగతా వాళ్లతో పోల్చితే... నాకు పెద్దగా ఏమీ తెలిసేది కాదు. అర్థమయ్యేది కాదు. కెమెరా ఒకవైపు ఉంటే మరొక వైపున నిల్చొని నటించేదాన్ని. చీవాట్లు తినేదాన్ని. ఇలాంటివి సాంకేతిక విషయాలే అనుకుంటాంగానీ వాటి ప్రభావం ఇతర విషయాల మీద కూడా పడుతుంది. అయితే కాలక్రమంలో లోపాలను సరిదిద్దుకున్నాను. చుట్టూ సరైన వాళ్లు లేకపోవడం వల్ల మనం ఏంచేస్తున్నామో మనకు అర్థం కాదు. నేను కూడా సరైన సలహాలు ఇచ్చే మంచివాళ్లు నా చుట్టూ లేకపోవడం వల్ల మంచి సినిమాల్లో చేసే అవకాశం పోగొట్టుకున్నాను. ‘ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే విషయం చాలా ఆలస్యంగా అర్థమైంది. అహాన్ని తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మవిశ్వాసం నుంచి అహాన్ని మైనస్ చేయడం నేర్చుకోవాలి. ఏ సమస్య వచ్చినా ‘సబ్ ఠీక్ హోజాయేగా’ ‘ఎవ్రీథింగ్ విల్ బి ఓకే’ అనుకుంటాను. అదృష్టం బాగుంటే ఆశించింది జరుగుతుంది. అలా కాని పక్షంలో దాని గురించి అయిదు నిమిషాలు కూడా ఆలోచించను. ఆరోగ్యకరం కాని పోటీలో ఉండడం కంటే, అసలు పోటీలో ఉండక పోవడమే క్షేమం అనుకుంటాను. సినిమా మాత్రమే నా ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలో అది కూడా ఒకటి అని మాత్రమే అనుకుంటాను. వంట నేర్చుకోవాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలి, కొత్త భాషలు నేర్చుకోవాలి...ఇలా ఎన్నో కోరికలు ఉన్నాయి. - కంగనా రనౌత్, హీరోయిన్ -
స్కిన్ షోకు దూరం
బికిని వంటి బిగుతైన దుస్తులు, అరకొర డ్రస్‌తోనే శృంగారం ఆవిష్కృతమవుతుందనుకోవడం పొరపాటని నటి రమ్యానంబీశన్ పేర్కొన్నారు. ఈ మాలీవుడ్ బ్యూటీ తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఆమె మంచి గాయని కూడా. పాండియనాడు చిత్రంలో ఈ అమ్మడు పాడిన ఫై ఫై ఫై కలాచీ ఫై పాట వాడవాడలా మారుమోగుతోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం డమాల్ డుమీల్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో చిన్న భేటి. ప్ర : మునుపటికంటే చాలా స్లిమ్‌గా తయారైనట్టున్నారు? జ: అందుకు చాలా కసరత్తులు చేస్తున్నాను. హీరోయిన్లకు అందం ప్రధానాకర్షణ కదా..! ప్ర : హీరోయిన్గా అవకాశం వస్తే పాడే ఛాన్స్ కోరుతూ షరతులు విధిస్తున్నారట? జ : అదంతా మీడియా ప్రచారం. ఇప్పటి వరకు ఏ దర్శక నిర్మాతలకు అలాంటి షరతులు విధించలేదు. నేను మలయాళ నటి అయినా తమిళ భాష స్పష్టంగా మాట్లాడగలను. పాడడమంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు మలయాళంలో 20 పాటలకు పైగా పాడాను. తమిళంలో పాండియనాడు చిత్రంలో ఫై ఫై ఫై కలాచీ ఫై పాటకు నా తమిళ ఉచ్ఛరణ చాలా హస్కిగా ఉందంటూ ప్రశంసలు అందుకున్నాను. డమాల్ డుమీల్ చిత్రంలో ముంబాయి ప్రముఖ గాయని ఉషా ఉతప్ ఒక పాట పాడారు. ఆమె నా అభిమాన గాయని. దర్శక నిర్మాతల కోరిక మేరకే నేను ఒక పాట పాడాను. ప్ర: నటిగా, గాయనిగా వేర్వేరు పారితోషికాలు పొందుతున్నారా? జ: నేను హీరోయిన్గా నటించే చిత్రానికి పాడితే గాయనిగా పారితోషికం తీసుకోను. ఇతర చిత్రాల్లో తగినంత వసూలు చేస్తాను. ప్రస్తుతం అరుళ్‌నిధి సరసన నటిస్తున్న నాలు పోలీసుం నల్లా ఇరుంద ఊరు చిత్రంలో కూడా ఒక పాట పాడాను. అదే విధంగా బర్మా అనే చిత్రంలో కూడా నా పాటవినవచ్చు. నా తొలి ప్రాధాన్యత మాత్రం నటనకే. ప్ర : తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయడం లేదే? జ : పిజ్జా చిత్రం తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి. మల యాళం, కన్నడ భాషల్లో కూడా నటిస్తుండడంతో కాల్ షీట్స్ సమస్య ఏర్పడుతోంది. అందువల్ల తమిళంలో కొన్ని అవకాశాలను అం గీకరించలేకపోతున్నాను. ఆ మధ్య తెలుగులో నటిం చాను. హిందీలోనూ అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ రంగ ప్రవేశం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్ర: బికిని దుస్తులకు దూరం అంటున్నారటగా? జ : స్కిన్ షో ప్రదర్శించాల్సిన అవసరం మాత్రం లేదు. మోడ్రన్ దుస్తుల్లో గ్లామర్‌గా నటించడానికి అభ్యంతరం లేదు. కథ విన్నప్పుడు ఏ సన్నివేశంలో ఎలా నటిస్తానన్న విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పేస్తాను. అందువల్ల ఇప్పటి వరకు ఏ షూటింగ్లోను ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు. అయినా బికిని లాంటి కురుచ దుస్తుల్లోనే కాదు సాధారణ దుస్తుల్లోను శృంగారాన్ని ఆవిష్కరించవచ్చు. ప్ర: నాన్ శిగప్పు మనిధన్ చిత్రంలో నటి లక్ష్మీమీనన్ ముద్దు సన్నివేశాల గురించి? జ: ఇది నాకు అవసరం లేని అంశం. ఇతర నటీమణులు ఏం చేస్తున్నారన్న విషయాల గురించి నన్ను అడగకండి. నా వరకు ముద్దు సన్నివేశాల్లో నటించడం నచ్చదు. ప్ర : మీప్రేమ, పెళ్లి విషయాల గురించి? జ : ఆ విషయాల గురించిన ప్రస్తావన ఇప్పుడొద్దు. ప్రేమ, పెళ్లి అంటూ అనవసర ప్రశ్నలతో నా సమయాన్ని వృథా చేయవద్దు.