మొదట్లో నేనూ... ఫీలయ్యేదాన్ని! | at the first stage iam also feel - samantha | Sakshi
Sakshi News home page

మొదట్లో నేనూ... ఫీలయ్యేదాన్ని!

Published Wed, Nov 18 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

మొదట్లో నేనూ... ఫీలయ్యేదాన్ని!

మొదట్లో నేనూ... ఫీలయ్యేదాన్ని!

తెలుగు, తమిళ భాషల్లో సమంత ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’. చెప్పాలంటే తమిళ పరిశ్రమలోకన్నా తెలుగులోనే సమంత ఎక్కువ విజయాలు చూశారు. మొదటి చిత్రం ‘ఏ మాయ చేశావె’తోనే క్రేజీ హీరోయిన్ అయిపోయారు. ఆ మధ్య వరుసగా తెలుగు చిత్రాలే చేసిన సమంత ఇప్పుడు మాత్రం ఇటు తెలుగు, అటు తమిళంలో చేస్తూ బిజీగా ఉన్నారు. రెండు భాషల్లోనూ స్టార్ హోదా ఉన్నప్పటికీ సాదాసీదా అమ్మాయిలానే భావిస్తానని సమంత అంటున్నారు. ‘‘పరిశ్రమకు రాక ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను. కాకపోతే అంతకు ముందు కన్నా స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. ఇక్కడికొచ్చాక మానసికంగా స్ట్రాంగ్ అయ్యాను.

ఒకవేళ ఎవరైనా సినిమా పరిశ్రమకు రావాలనుకున్నారనుకోండి... ఇక్కడకు రాక ముందే జీవితపాఠాలు నేర్చుకోవాలి. అప్పుడే ఇక్కడ నిలదొక్కుకోగలుగుతాం. లేకపోతే అపజయాలకు కుంగిపోతాం. పుకార్లకు దిగులుపడతాం. మొదట్లో నేనూ అలా బాధపడేదాన్ని. ఆ తర్వాత నుంచి తేలికగా తీసుకుంటున్నాను. అదే ఇండస్ట్రీకి రాక ముందే మానసికంగా బలంగా ఉండి ఉంటే, ముందు నుంచే వీటిని పెద్దగా పట్టించుకొనేదాన్ని కాదేమో! ఏమైనా, ఇప్పటికీ నా గురించి నెగటివ్, పాజిటివ్ - ఏ కామెంట్ వచ్చినా ఆలోచిస్తాను. ఆ వ్యాఖ్యల్లో ఏదైనా మంచి ఉంటే దాన్ని స్వీకరిస్తాను’’ అని సమంత చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement