నా ప్రేమ భిన్నంగా ఉంటుంది | My love is different from | Sakshi
Sakshi News home page

నా ప్రేమ భిన్నంగా ఉంటుంది

Published Sat, Jun 7 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

నా ప్రేమ భిన్నంగా ఉంటుంది

నా ప్రేమ భిన్నంగా ఉంటుంది

తన ప్రేమ చాలా భిన్నంగా ఉంటుందని అంటోంది. ఈ బ్యూటీ కేడీ బిల్లా కిల్లాడి రంగా, అళగియ అసురా, పంచామృతం చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ భామ తన గురించి తెలుపుతూ ‘మా అమ్మది కర్ణాటక. నాన్న ఉత్తరాదికి చెందిన వారు. బామ్మ గోవాకు చెందిన ఆంగ్లో ఇండియన్. తాత క్రిస్టియన్‌గా మారిన బ్రాహ్మణుడు. నేను చెన్నైలో పుట్టాను. ఇక నేనే ఊరికో చెందిన అమ్మాయినన్నది తికమక పడే విషయం.
 
బాల నటిగా రంగ ప్రవేశం చేసిన నేను ముందుగా టీవీ సీరియళ్లలో నటించాను. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన ఆయుధ ఎళుత్తు చిత్రంలో సూర్య చిన్న చెల్లెలిగా నటించే అవకాశం వచ్చింది. కొన్ని కారణాలవల్ల ఆ చిత్రంలో నటించలేదు. ఆ తర్వాత తొమ్మిదవ తరగతి చదువుతుండగా కండనాళ్ ముదల్ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాను. నాకు మాంసాహారం అంటే చాలా ఇష్టం.
 
ముఖ్యంగా చికెన్ ప్రియురాల్ని. ఒకసారి జంతు సంక్షేమ సంస్థ గురించి పుస్తకాన్ని చదివాను. అప్పటి నుంచి శాఖాహారిగా మారిపోయాను. ఇక నేను ప్రేమలో పడ్డట్టు ప్రచారం జోరందుకుంది. ఎవరో చెప్పింది వినకండి. కళ్లారా చూస్తేనే నమ్మండి. నా ప్రేమ అందరిలా సాధారణంగా ఉండదు. చాలా భిన్నంగా ప్రేమిస్తా. ప్రస్తుతానికి నా దృష్టంతా నటనపైనే’ అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement