బికినీలో టాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్! | Manchu Lakshmi Shares A video On Social Media Goes Viral | Sakshi
Sakshi News home page

గడ్డకట్టే చలి.. బికినీలో కనిపించి షాకిచ్చిన నటి!

Published Sun, Dec 17 2023 1:33 PM | Last Updated on Sun, Dec 17 2023 2:28 PM

Manchu Lakshmi Shares A video On Social Media Goes Viral - Sakshi

టాలీవుడ్‌లో మంచులక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ నటులు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తర్వాత తన సొంత టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మోహన్‌లాల్‌ నటించిన మాన్‌స్టర్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన మంచు లక్ష్మి ప్రసన్న.. ప్రస్తుతం అగ్నినక్షత్రం అనే సినిమాలో నటిస్తోంది. సినిమాలతో బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటోంది. 

ప్రస్తుతం విదేశాల్లో వేకేషన్‌లో ఉన్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో బికినీలో కనిపిస్తూ గడ్డకట్టే చల్లని నీటిలో మునుగుతూ కనిపించింది. ఆ వీడియోలో సన్నింగ్‌ లుక్‌లో అభిమానులకు ఒక్కసారిగా షాకిచ్చింది టాలీవుడ్ భామ. ఇదంతా క్రియో థెరపీ కోసమేనంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం మంచులక్ష్మి ఫిన్‌లాండ్‌ వెకేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ వీడియో చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement