పాకిస్తానీ మోడల్ రోమా మైఖేల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 అందాల పోటీలో భాగంగా బికినీలో ర్యాంప్ వాక్ చేయడంతో ఆమెకు ఈ పరిస్థితి తలెత్తింది. అంతేగాదు ఆమె బికినీలో ర్యాంప్ వాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ఆమె ఆ వీడియోని తన ఖాతా నుంచి తొలగించక తప్పలేదు.
ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో రోమా పాకిస్తాన్‌కి ప్రాతినిధ్యం వహించడంతోనే ఇంతలా వ్యతిరేకత ఎదురయ్యింది. పాకిస్తాన్‌లో మహిళలు ధరించే దుస్తుల విషయమై కొన్ని కఠిన నియమాలు ఉంటాయి. అందులోనూ రోమా బికినీ ధరించి ర్యాంప్‌వాక్ చేయడమే గాక తాను పాకిస్తానీని ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఊపందుకున్నాయి.
రోమా మైఖేల్ ఎవరు?
లాహోర్‌కు చెందిన రోమా మైఖేల్ దక్షిణాసియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసింది. ఒక ప్రొఫెషనల్ మోడల్‌గా, నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్లు, ప్రసిద్ధ బ్రాండ్‌లతో కూడా పనిచేస్తుందామె. అంతేగాదు రోమా కేన్స్ ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ షోతో సహా పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఇన్‌స్టాలో రోమాకు ఏడు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
అయితే థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో దాదాపు 69 మంది అందాల భామలు పాల్గొన్నారు. అక్టోబర్ 25న ఫైనల్ ఈవెంట్ జరుగనుంది. అప్పుడే టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తారు. అందులో భాగంగా వారందరికీ వివిధ పోటీలు నిర్వహిస్తారు.
ఈ క్రమంలోనే పాకిస్తానీ మోడల్ రోమా (Roma Michael) బికినీలో ర్యాంప్ వాక్ చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆమె వస్త్రాధారణను తప్పపడుతూ విమర్శలు చేయడం ప్రారంభించారు. కానీ అప్పటికే ఈ వీడియో పలు ఖాతాల్లో షేర్ కావడంతో ఆ పోస్టును తొలగించినా ఆమెపై కామెంట్ల వెల్లువ ఆగడం లేదు.
(చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!)
Comments
Please login to add a commentAdd a comment