వెండితెరపై విలన్లను చూస్తే ఎవరికైనా నవ్వొస్తుందా? అఫ్‌కోర్స్... కామెడీ విలన్లు ఉన్నారనుకోండి! కాసేపు వాళ్లను పక్కన పెట్టేసి, సీరియస్ విలన్ల సంగతికి వద్దాం! వాళ్లను చూస్తే నవ్వొస్తుందా? చూస్తున్నది తెరపైనే అయినా ఒక్కోసారి భయం వేస్తుంది. కానీ, ప్రభుదేవా ‘విలన్’ అంటే ‘ఫన్’ అంటున్నారు! ఎందుకిలా? అంటే... ‘మెర్క్యూరీ’ అనే తమిళ సినిమాలో ఈ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సంగతి ప్రేక్షకులకు తెలిసిందే! ‘విలన్‌గా నటించడం ఎలా ఉంది?’ అనే ప్రశ్నను ప్రభుదేవా ముందుంచితే – ‘‘ఇంతకు ముందెప్పుడూ విలన్‌గా చేయలేదు. ఒక్కసారి ప్రపంచమంతా మారినట్టు, వింతగా అన్పిస్తోంది. బట్, ఇట్స్ ఫన్! యాక్టింగ్ అంటే అంతేగా... రియల్ లైఫ్‌లో మనం చేయలేని పనులను రీల్ లైఫ్‌లో చేసే చాన్స్ దొరుకుతుంది’’ అన్నారు.
మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్!
‘మెర్క్యూరీ’కి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే... మూకీ చిత్రమిది! నో డైలాగ్స్... ఓన్లీ యాక్షన్! కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ్ డబ్బింగ్ హిట్ ‘పిజ్జా’ దర్శకుడీయనే. ‘పిజ్జా’లో హీరోయిన్‌గా నటించిన రమ్యా నంబీసన్ ఇందులోనూ నటిస్తున్నారు. మూకీ సినిమా కావడంతో తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. మూకీకి డబ్బింగ్ అవసరం లేదు... దాంతో ఎన్ని లాభాలో చూడండి!!
విలన్... ఫన్!
Published Mon, Nov 6 2017 12:57 AM | Last Updated on Mon, Nov 6 2017 12:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment