Mercury
-
ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై'
వాషింగ్టన్: సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక 'మెసెంజర్'. నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై' పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్‌లా మెరిసిపోతున్నాడు. 'మెసెంజర్' 'అడ్వెంచర్' ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక 'మెసెంజర్' తీసిన ఈ అద్భుతమైన ఫొటోను నాసా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫోటోలో మెర్య్కురీ వజ్రకాంతి ధగధగలతో తళుకులీనుతోంది. సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్నట్లు కనిపించే ఈ గ్రాహం సూర్యుడికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిజంగా వజ్రమేనా.. ఈ ఫోటో కింద నాసా రాస్తూ.. వారు నన్ను మిస్టర్ ఫారన్‌హీట్ అని పిలుస్తారు. సైజులో భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడి కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన కక్ష్య చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం భూమిపై 88 రోజులతో సమానం. ఈ కక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్ మెసెంజర్ బుధుడి ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు వీలుగా ఇలా బుధుడి కలర్ ఫోటోని తీసింది. జూ. సూర్యుడు.. వాతావరణానికి బదులుగా బుధుడిపై చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్‌ను కలిగి ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణం లేకపోవడం, సూర్యునికి అత్యంత చేరువగా ఉండటంతో పగటిపూట 800ºF (430ºC) నుండి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని ఉపరితలాన్ని పరీక్షించేందుకు వీలుగా నీలి రంగు వర్ణాల ఉపరితలాన్ని అక్కడక్కడా గుంతలు ఉండటాన్ని మనం గమనించవచ్చని రాసింది. View this post on Instagram A post shared by NASA (@nasa) ఇది కూడా చదవండి: ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం -
చైనా తొలి చక్రవర్తి సమాధికి పాదరస రక్షణ!
బీజింగ్: చైనాను పాలించిన మొట్టమొదటి చక్రవరి కిన్ షీ హువాంగ్. ఆయన సమాధికి పాదరసం(మెర్క్యూరీ)తో రక్షణ కలి్పంచినట్లు తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ద్రవ రూపంలో ఉండే లోహమే పాదరసం. ఇది విషపూరితమైంది. కిన్ క్రీస్తుపూర్వం 221 నుంచి 210 దాకా.. పదేళ్లపాటు డ్రాగన్ దేశాన్ని శాసించాడు. కిన్ సమాధిని కట్టుదిట్టంగా నిర్మించారు. షాన్షీ ప్రావిన్స్‌లో 1974లో రైతులు పొలం దున్నుతుండగా కిన్ షీ హువాంగ్ సమాధి బయటపడింది. చక్రవర్తి సమాధిని తెరిచే చూస్తే వినాశనం తప్పదన్న ప్రచారం బాగా వ్యాప్తిలో ఉంది. దీంతో, తెరిచే సాహసం చేయలేకపోయారు. సమాధికి సమీపంలో మట్టితో తయారు చేసిన సైనికులు, ఆయుధాలు, గుర్రాల విగ్రహాలు భారీగా బయటపడ్డాయి. మరణానంతరం కూడా చక్రవర్తిని కాపాడడానికి ఈ ‘టెర్రకోట ఆరీ్మ’ని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, చక్రవరి సమాధి చుట్టూ మెర్క్యూరీ లోహం స్వేచ్ఛగా కదులుతున్నట్లు పరిశోధకులు ఇటీవలే తేల్చారు. సమాధిని ఎవరూ తాకకుండా ఇలాంటి ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. -
బుధ గ్రహం మార్పువల్ల ఏ రాశుల వారికి లాభం..!
నవ గ్రహాలలో ప్రతీ గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటే, కొన్ని గ్రహాలు స్వల్ప వ్యవధిలోనే రాశి సంచారం జరుగుతూ ఉంటుంది. శని గ్రహం రెండున్నరేళ్లకు ఒకసారి వేరొక రాశిలోకి మారితే, గురుడు ఏడాదికి ఒకసారి వేరే స్థానంలోకి మారతాడు. బుధుడు ప్రతీ నెల రోజులకు ఒకసారి వేరొక స్థానంలోకి వెళుతుంటాయి. బుధుని వీక్షణ ఎప్పుడూ ఏడో స్థానంపై ఉంటుంది. బుధ గ్రహం ఏప్రిల్25వ తేదీ(సోమవారం) వృషభంలోకి ప్రవేశించాడు. అప్పటివరకూ మేష రాశిలో ఉన్న బుధుడు..నెల రోజుల పాటు వృషభ సంచారం చేయనున్నాడు. ప్రధానంగా బుధ గ్రహం వ్యాపారం, తెలివితేటలకు కారకంగా భావిస్తారు. బుధుడి రాశి మార్పుతో కొన్ని రాశుల వారికి లాభం చేకూర్చనుంది. మరి బుధుడి సంచారం వల్ల ఏయే రాశుల వారికి మంచి జరుగుతుందో చూద్దాం. మేషం: ఈ రాశి నుంచి బుధుని సంచారం రెండోది. అంటే ద్వితీయ స్థానం. ఇది ధనస్థానంగా పేర్కొంటారు. బుధుడు మార్పు వలన ఈ రాశి వారు ఆకస్మిక ధనలాభాలు చూసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కర్కాటకం: ఈ రాశి వారికి బుధుడు లాభంలో ఉన్నాడు. ఉద్యోగం, వ్యాపారాలు కలిసి వస్తాయి. తల్లిదండ్రులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సానుకూల ప్రభావం ఉంటుంది. సింహం: ఈ రాశి వారికి బుధుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు దశమం స్థానంలో సంచరించడం యోగ కారకత్వం ఉంటుంది. ఈ రాశి వారు వ్యాపారాన్ని మరింతగా విస్తరించడమే కాకుండా లాభాలు కూడా చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు ముందుకు కదిలి వాటిలో సక్సెస్ కూడా పొందే అవకాశం ఉంది. పైన చెప్పింది బుధ గ్రహం అనుకూలంగా ఉన్న రాశులకు మాత్రమే. అలా అని మిగతా రాశులు బాలేదని కాదు. వేరే గ్రహాల ప్రభావంతో తక్కిన రాశులు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. వేరే గ్రహాల వీక్షణ బాగున్న వాళ్లు మంచి ఫలితాల్ని చూస్తారు. (గ్రహ ఫలితాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించడం జరిగింది) చదవండి👉: శని గ్రహం మార్పుతో వీరికి యోగం! చదవండి👉🏻: గురుడు రాజయోగం ఇచ్చే రాశులు..! -
అ‘పూర్వ’గౌరవం..అంతరిక్షానికి అతిథి
బండ్ల శిరీష అంతరిక్షంలోకి పయనమవగానే ఆ వెనకే మేరీ అనే మహిళ ఈ నెల 20 న స్పేస్ లోకి వెళుతున్నారు. జెఫ్ బెజోస్ కంపెనీ ‘బ్లూ ఆరిజిన్’ మేరీని గౌరవ అతిథిగా తమ తొలి వ్యోమనౌక లోకి ఎక్కిస్తోంది. 82 ఏళ్ల మేరీ అమెరికన్ పైలట్. ఆమె కెరీర్లో ఎన్నో ‘ఫస్ట్’ లు ఉన్నాయి. ఈ వయసులోనూ ఆమె భూమి మీద నడవడం కంటే ఆకాశంలో విహరించడమే ఎక్కువ! ఫ్లయిట్‌ని ఎలా నడపాలో ప్రైవేటు శిక్షణా సంస్థల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతుంటారు. తాజా స్పేస్ ట్రావెల్‌తో ఆమె అంతరిక్షంలోకి వెళ్లిన అతి పెద్ద వయస్కురాలిగా (స్త్రీ పురుషులిద్దరిలో) రికార్డును సాధించినట్లవుతుంది. నేడు – జెఫ్ బెజోస్‌తో మేరీ ఫంక్ ఇరవై రెండేళ్ల వయసులో 1961లో ‘మెర్క్యురీ 13’ అనే ప్రైవేటు స్పేస్ ప్రాజెక్టుకోసం నాసా ఎంపిక చేసిన వ్యోమగామిగా శిక్షణను పూర్తి చేసుకున్నారు మేరీ వాలీ ఫంక్. కానీ ఇంతవరకు ఆమెకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశమే రాలేదు. బహుశా తనొక రికార్డును సృష్టించడం కోసమే ఆ విశ్వాంతరాళం ఆమెను ఇన్నేళ్లపాటు వేచి ఉండేలా చేసిందేమో! తన 82 వ యేట ఈ నెల ఇరవైన ఆమె ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్, ప్రస్తుతం ఈ భూమండలం మీదే అత్యంత సంపన్నుడు అయిన జెఫ్ బెజోస్ కంపెనీ ‘బ్లూ ఆరిజిన్’ గౌరవ అతిథిగా అంతరిక్షానికి రెక్కలు కట్టుకుంటున్నారు! ఆనాడు ‘మెర్క్యురీ 13’ పేరిట వ్యోమయానానికి శిక్షణ పొందిన పదమూడు మంది మహిళ ల్లో మేరీ ఒకరు. అయితే శిక్షణ పూర్తయ్యాక ఆ ప్రాజెక్టు పక్కన పడిపోయింది. ఆ గ్రూపులో ఒక్కరు కూడా అంతరిక్షంలోకి వెళ్లలేకపోవడమే కాదు.. ఒక బృందంగా కూడా ఏనాడూ వారు కలుసుకోలేదు. అప్పటి మెర్క్యురీ 13 ని గుర్తు చేస్తూ జెఫ్ బెజాస్.. ‘‘మళ్లీ ఇప్పుడు మేరీ వాలీ ఫంక్కి ఆ అవకాశం వచ్చింది. మా గౌరవ అతిథిగా మేము ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళుతున్నాం’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. మేరీ ఫంక్ ఆమెరికన్ విమానయానానికి గుడ్‌విల్ అంబాసిడర్. అక్కడి నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డులో తొలి మహిళా ఎయిర్ సేఫ్టీ ఇన్వెస్టిగేటర్. తొలి మహిళా ఫ్లయిట్ ఇన్స్ట్రక్టర్ కూడా. అలాగే అమెరికా ‘ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ’ తొలి మహిళా ఇన్స్పెక్టర్. మేరీ ఫంక్ పైలట్‌గా ఇంతవరకు 19,600 గంటలు విమానాలను నడిపించారు. ఈ నెల అంతరిక్షంలోకి బయల్దేరుతున్న ‘బ్లూ ఆరిజన్’ వ్యోమ నౌక ‘న్యూ షెప్పర్డ్ క్యాప్సూల్’ లో మేరీ ఫంక్ అంతరిక్షంలోకి వెళ్లొచ్చినట్లయితే 72 ఏళ్ల వయసులో వ్యోమయానం చేసిన దివంగత వ్యోమగామి జాన్ గ్లెన్ రికార్డును ఆమె బ్రేక్ చేసినట్లు అవుతుంది. న్యూ షెప్పర లో మేరీతో పాటు జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు కూడా ఉంటారు. -
చేదు అనుభవాలెన్నో చవిచూశాను
సినిమా :చేదు అనుభవాలెన్నో చవిచూశాను అంటోంది వర్తమాన నటి ఇందూజా. మేయాదమాన్ చిత్రంలో ఇద్దరుకథానాయికల్లో ఒకరిగా పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత ప్రభుదేవాతో మెర్కురీ, విక్రమ్‌ప్రభుకు జంటగా 60 వయదు మానిరం, ఆర్కే.సురేష్‌తో బిల్లారంగా అంటూ వరుసగా చిత్రాలు చేసేసింది. ప్రస్తుతం అధర్వతో రొమాన్స్ చేసిన బూమరాంగ్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా బ్యూటీతో చిన్న భేటీ. ప్ర: మీ పూర్వీకం? జ: నేను తమిళ అమ్మాయినే. వేలూరు సమీపంలోని ఓట్టేరి స్వగ్రామం. నాన్న రవిచంద్రన్ వ్యాపారవేత్త. అమ్మ సీత ఆరణిలో స్కూల్ హెడ్మాస్టర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఇద్దరు చెల్లెళ్లు. నేను కాట్పాడిలోని వీఐటీలో ఎంఎస్(సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చదివాను. మూడో సంవత్సరం మానేశాను. కారణం సినిమాపై ఆసక్తే. మొదట్లో పలు లఘు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. దీంతో అమ్మానాన్నలు వ్యతిరేకించినా లఘు చిత్రాల్లో నటించాను ప్ర: సినిమా అవకాశాల కోసం చాలా చేదు అనుభవాలను ఎదుర్కొని ఉంటారే? జ: మీరే అర్థంతో ఈ ప్రశ్న అడిగారో తెలియదుగానీ, నేనిక్కడ చాలా చేదు అనుభవాలను చవి చూశాను. అయితే మీటూ లాంటివి మాత్రం కాదు. అవకాశాల కోసం వెళ్లినప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. అసహ్యానికి గురయ్యాను. ఆడిషన్స్‌కు పిలుస్తారు. కొత్తకొత్త ఫోజుల్లో ఫొటో సెషన్ చేసుకురమ్మంటారు. కొత్తగా పరిచయం అయ్యే వారి వద్ద ఫొటో సెషన్‌కు ఖర్చు చేసేంత డబ్బు ఎక్కడ ఉం టుంది చెప్పండి. ఏదో ఒక ఫొటో చూపించి అవకాశాలు అడిగేదాన్ని. నేనెప్పుడూ పార్టీల కు, పర్సనల్ మీటింగ్ లాంటి వాటికి వెళ్లను. హీరోయిన్ అయిన తరువాత కూడా అలాంటి అలవాటు నాకు లేదు. అందుకే కొందరు నన్ను పొగరుబోతు అని కూడా అంటుంటారు. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ: అధర్వతో బూమరాంగ్ చిత్రంలో నటించాను. ఈ చిత్రంలో నా నటనకు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం సూపర్ డూపర్ అనే చిత్రంలో నటిస్తున్నాను. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ మంచి పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకా అలాంటి అవకాశాలు రాలేదు. ప్ర: చివరి ప్రశ్న. మిమ్మల్ని ప్రభుదేవాతో కలిపి చాలా వదంతులు వస్తున్నాయే? జ: ప్రభుదేవాతో కలిసి మెర్కురి చిత్రంలో నటించాను. అప్పటి నుంచి ఆయన్ని ప్రేమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుదేవా చేతుల్లో నేను ఉన్నట్లు వదంతులు ప్రచారం అవుతున్నాయి. నిజంగా అవన్నీ వదంతులే. సినిమాలో నా ఎదుగుదల గిట్టని వారెవరో ఇలాంటి పుకార్లు పట్టిస్తున్నారు. -
పారద గణపతి
పాదరసంతో తయారుచేసిన గణపతినే ‘పారద గణపతి’ అంటారు. పాదరసంతో తయారు చేసిన శివలింగాలను విరివిగా పూజిస్తూ ఉంటారు. పారదలింగాల ఆరాధన విశేష ఫలప్రదమైనది. అలాగే పాదరసంతో తయారు చేసిన గణపతిని అర్చించడం కూడా గొప్ప ఫలితాలనిస్తుంది. జ్ఞానవృద్ధి, మనోస్థైర్యాల కోసం పారద గణపతి ఆరాధన చక్కని సులభమార్గం. వినాయక చవితిరోజున పూజమందిరంలో చేతి బొటనవేలి పరిమాణంలో ఉండే పారద గణపతిని ప్రతిష్ఠించి పూజించడం మంచిది. వినాయక చవితినాడు వీలు కాకుంటే ఏదైనా నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున పారద గణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించుకోవడం మంచిది. పాదరసంతో లక్ష్మీదేవితో కలసి ఉన్న గణపతి రూపాన్ని ఒకేమూర్తిగా తయారు చేయించిన పారద లక్ష్మీగణపతిని పూజించినట్లయితే ఆర్థిక ఇక్కట్లు, ఆటంకాలు తొలగిపోతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో పారద లక్ష్మీగణపతిని పూజించడం వల్ల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారద గణపతిని లేదా పారద లక్ష్మీగణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించిన తర్వాత నిత్య ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. – పన్యాల జగన్నాథ దాసు -
మెర్క్యురీకి టైమ్ వచ్చింది!
సాక్షి, సినిమా : ప్రభుదేవా మెర్క్యురీకి టైమ్ వచ్చింది. 48 రోజుల చిత్రపరిశ్రమ సమ్మె తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం, సినీ సంఘాలతో ఇటీవల జరిపిన ద్వైపాక్షిక చర్చలు సఫలం కావడంతో శుక్రవారం కొత్త చిత్రాలు విడుదల అవుతాయని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ బుధవారం వెల్లడించారు. అదేవిధంగా చిత్ర షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సమ్మె విరమణ తరువాత తెరపైకి వస్తున్న తొలి చిత్రంగా మెర్క్యురీ నమోదైంది. ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఇందులో రమ్యా నంబీశన్, మేయాదమాన్ చిత్రం ఫేమ్ ఇందుజా నాయికలుగా నటించారు. ఇది హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన మూఖీ చిత్రం. మొత్తం మీద ఇదో ప్రయోగాత్మక సైలెంట్ థ్రిల్లర్ చిత్రం. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని చిత్రపరిశ్రమ సమ్మె కొనసాగుతుండగానే విడుదల చేస్తానని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రకటించారు. ఆ తరువాత సినీవర్గాల వ్యతిరేకతతో వెనక్కు తగ్గారు. అయితే తమిళంలో మినహా ప్రపంచవ్యాప్తంగా మెర్క్యురీ చిత్రం గత వారమే విడుదలైంది. అంతేకాదు ఈ చిత్రం ఇతర భాషల్లో వెబ్‌సైట్స్‌ల్లో కూడా హల్చల్ చేస్తోంది. దీంతో ప్రభుదేవా ఈ చిత్రాన్ని పైరసీ సీడీలో చూడకండి అని విజ్ఞప్తి చేశారు. ఈ రీజన్‌తోనే అయ్యి ఉండవచ్చు సమ్మె విరమణ తరువాత మొదట ఈ చిత్రాన్ని విడుదలకు నిర్మాతల మండలి అనుమతి ఇచ్చి ఉండవచ్చు. అయితే దీనితో పాటు రెండు చిన్న చిత్రాలు శుక్రవారం తెరపైకి రానున్నాయి. -
విడుదలకు సిద్ధంగా ముప్ఫై సినిమాలు
చెన్నై: సినీ పరిశ్రమ సమ్మెతో ముప్పైకి పైగా చిత్రాలు 48 రోజులుగా ఎదురు చూపులతో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రజనీకాంత్ కాలా, కమలహాసన్ విశ్వరూపం–2 చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇవి తెరపైకి వచ్చేది ఎప్పుడన్న ఆసక్తి కోలీవుడ్‌లో నెలకొంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, థియేటర్ల సంఘాలతో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్మాతల సంఘం జరిపిన చర్చలు ఫలించకపోవడంతో గత మార్చి 1 నుంచి కొత్త చిత్రాల విడుదలను, 16వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేసి సమ్మెకు దిగారు. 48 రోజుల సమ్మె అనంతరం రాష్ట్ర సమచార, ప్రసారాల శాఖ మంత్రి కడంబూర్ రాజు నేతృత్వంలో మంగళవారం సినీ సంఘాల నేతలు నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు ఫలించాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ తమ రేట్లను 50శాతం తగ్గించుకోవడానికి అంగీకరించారు. అదేవిధంగా టిక్కెట్ బుక్కింగ్ విధానం కంప్యూటర్లో పొందుపరచడం లాంటి డిమాండ్లకు థియేటర్ల యాజమాన్యం అంగీకరించింది. దీంతో చిత్ర షూటింగ్‌లు ప్రారంభోత్సవం, కొత్త చిత్రాల విడుదల విషయంలో నిర్మాతల మండలి బుధవారం సమావేశమై నిర్ణయం వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చిత్రా విడుదల సెన్సార్ అయిన తేదీల ప్రకారం ఉంటుందని నిర్మాతల మండలి ప్రకటించింది. విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో కాలా, విశ్వరూపం– 2, మెర్క్యూరీ, మిస్టర్ చంద్రమౌళి, మోహిని, కరు, టిక్ టిక్ టిక్, నరకాసురన్, ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు, గజినీకాంత్, ఇరుంబుతిరై, అసురవధం, పరియేరుమ్ పెరుమాళ్, ఆణ్‌దేవదై, అభియుమ్ అనువుమ్, భాస్కర్ ఒరు రాస్కెల్, సర్వర్సుందరమ్, కుప్పత్తురాజా, ఆర్కే.నగర్, పార్టీ, కడైకుట్టిసింగం, ఇమైకా నోడిగళ్ అంటూ 30 చిత్రాలకు పైగా రెడీగా ఉన్నాయి. సెన్సార్ అయిన తేదీ ప్రకారం చూస్తే కాలా చిత్రం ఈ నెల 27న విడుదలయ్యే అవకాశం లేదనిపిస్తోంది. కాలా కంటే ముందే విశ్వరూపం–2 సెన్సార్‌ను పూర్తి చేసుకుని ఉండడంతో ఆ చిత్రమే ముందుగా తెరపైకి రావాల్సి ఉంది. ఈ విషయంలో నిర్మాతల మండలి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
40 ఏళ్లల్లో ఇదే మొదటిసారి!
కొత్త సంవత్సరం అంటే.. చేయాలనుకునే పనుల్లో ‘కొత్త సినిమా’ చూడటం ఒకటి. సినిమా లవర్స్ ప్లాన్ మోస్ట్లీ ఇలానే ఉంటుంది. అయితే ఈసారి తమిళ సినిమా లవర్స్‌కి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే తమిళ సంవత్సరాది (ఏప్రిల్ 14)కి కొత్త బొమ్మలేవీ థియేటర్‌కి రాలేదు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఆర్థిక లావాదేవీల విషయంలో పొత్తు కుదిరే వరకూ కొత్త సినిమాలు విడుదల చేసేది లేదని తమిళ పరిశ్రమ బలంగా నిర్ణయించుకుంది. ఆ మేరకు కొత్త సినిమాలేవీ రిలీజ్ చేయడంలేదు. స్ట్రైక్ మొదలై దాదాపు నెల రోజులు పైనే అయింది. ఇంకా తమిళ పరిశ్రమవారు కొత్త సినిమాలు విడుదల చేసే విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. గడచిన 40 ఏళ్లల్లో ‘కొత్త సినిమా రిలీజ్’ చూడని కొత్త సంవత్సరాది ఇదేనట. సినీప్రియులకు ఇది బాధగానే ఉంటుంది. మరోవైపు పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు, బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు, థియేటర్లో సైకిల్ స్టాండ్, స్నాక్స్ అమ్ముకునేవారి వరకూ... అందరికీ నష్టమే. థియేటర్ల మెయిన్టైనెన్స్ కోసం పాత తమిళ సినిమాలను ప్రదర్శించుకుంటున్నారు. వాటికి ఆశించిన కలెక్షన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ స్ట్రైక్ లేకపోయి ఉంటే.. రజనీకాంత్ ‘కాలా’ వచ్చి ఉండేది. ఇక్కడ విడుదలైన ‘మెర్క్యురీ’ అక్కడ రిలీజయ్యుండేది. విశాల్ ‘ఇరుంబుదురై’ ఎప్పుడో రిలీజ్‌కి రెడీ అయి, రిలీజ్ డేట్ దొరక్క ఒకటి రెండు సార్లు, ఇప్పుడు స్ట్రైక్ వల్ల తెరపైకి రావడానికి నోచుకోలేదు. ఇప్పటికే ఇండస్ట్రీ 200 కోట్ల వరకూ నష్టపోయిందని చెన్నై వర్గాల అంచనా. మరి.. ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందో? కొత్త తమిళ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి. ‘ఇరుంబుదురై’ లో విశాల్, సమంత ‘మెర్క్యురీ’లో ఓ దృశ్యం -
సెమీ సాలిడ్.. సెమీ లిక్విడ్.. మెర్క్యూరీ
మెర్క్యూరీ.. కార్పోరేట్ శక్తుల ఆశకు బలవుతున్న జీవితాలను తెరకెక్కించే ప్రయత్నం చేసిన చిత్రం. తొలి మూకీ థ్రిల్లర్‌గా ట్యాగ్ వేసుకుంది. 1987లో సింగీతం శ్రీనివాసరావు తీసిన మూకీ చిత్రం.. లవ్, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘పుష్పక్’ (తెలుగులో ‘పుష్పక విమానం’)కు మించిన అంచనాలతో వచ్చింది. కథ.. చెవిటి, మూగ అయిన అయిదుగురు స్నేహితులు (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) ఓ వారాంతం ఒక టీ ఎస్టేట్‌లో కలుసుకుంటారు. ఆ రోజే అమ్మాయి బర్త్‌డే ఉండడంతో బర్త్‌డే పార్టీ కూడా చేసుకుంటారు. ఈ కథలో ముందుకు వెళ్లాలంటే దీని మూలమైన చిన్న ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకోవాలి. ఈ సినిమా నడిచే కాలానికి పదేళ్ల క్రితం.. తమిళనాడులోని ఒక ఊళ్లో కార్పోరేట్ ఎర్త్ అనే సంస్థ ఓ కెమికల్ ఫ్యాక్టరీ పెడుతుంది. అందులోని విషవాయువు లీక్ అయ్యి ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని దాదాపు 80 మంది చనిపోతారు. ఇంకా చాలామంది దాని దుష్ప్రభావాలకు లోనవుతారు. ఈ అయిదుగురు స్నేహితులు కూడా ఆ బాధితులే. ఆ విషవాయువు వల్లే వీళ్లకు వినికిడి లోపం వస్తుంది. దానివల్ల మాట్లాడలేకుండా అవుతారు. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. టీ ఎస్టేట్‌లో పార్టీ చేసుకొని కార్పోరేట్ ఎర్త్ ఫ్యాక్టరీ వల్ల చనిపోయిన 80 మంది స్మారక చిహ్నం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తారు. ఆ దారిలోనే ఉన్న మూతబడ్డ ఆ ఫ్యాక్టరీ మీద రాళ్లు విసిరి తమ కోపాన్ని, బాధను, నిస్సహాయతనూ వెళ్లగక్కుతారు. అక్కడే ఓ కొండ మీద ఆ నలుగురులోని ఓ అబ్బాయి ఆ అమ్మాయి పట్ల తనుకున్న ప్రేమను చెబుతాడు కానుకనిచ్చి. అమ్మాయీ ఆ ప్రేమను సమ్మతిస్తుంది. రాత్రయిపోతుంది.. తిరిగి టీ ఎస్టేట్‌లోని తామున్న బసకు బయలుదేరుతారు అయిదుగురు. అమ్మాయి డ్రైవ్ చేస్తుంటుంది. ఆమెను ప్రేమిస్తున్న అబ్బాయి పక్క సీట్లో.. మిగిలిన ముగ్గురూ వెనకాల కూర్చుంటారు. ఆ అబ్బాయి తన ప్రేమికురాలిని ఆటపట్టించేందుకు హెడ్ లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేస్తుంటాడు. ఈ ఆటకు వెనకాలున్న ఓ అబ్బాయీ జత కలుస్తాడు. అలా ఓ రెండుమూడు సార్లు ఆడుతుంటే అమ్మాయి ముద్దుగానే తన ప్రేమికుడిని విసుక్కుంటుంటుంది. నాలుగోసారీ అలాగే లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేసేసరికి చీకట్లో దారి కనపడక బండి అదుపు తప్పుతుంది. అప్పుడే ఓ కుక్క దారికి అడ్డు వస్తుంది. అసలే కొండదారి.. రాత్రి.. వేగం.. భయపడ్డ ఆమె ప్రేమికుడు లైట్లు ఆన్‌చేసి కంట్రోల్ తప్పిన వెహికిల్‌ను కంట్రోల్లోకి తెస్తాడు. సడెన్ బ్రేక్‌తో వెహికిల్ ఆగుతుంది. అంతా ఊపిరి పీల్చుకుంటారు. రోడ్డుకు కాస్త పక్కకు వెళ్లిన వెహికిల్‌ను రివర్స్‌గేర్‌తో సరిచేసి మళ్లీ స్టార్ట్ చేస్తుంది అమ్మాయి. కొంత దూరం వెళ్తుందో లేదో ఎవరో చైన్ వేసి లాగినట్టయి బండి ఆగిపోతుంది. అందరూ దిగి చూస్తారు. నిజంగానే వెహికిల్ వెనక సైలెన్సర్‌కు ఓ గొలుసు కనపడుతుంది. భయంతో షాక్ అవుతారు వీళ్లు. ఆ చైన్ రెండో కొన పక్కనే ఉన్న పొదలోకి చొచ్చుకొని ఉంటుంది. ఆ అయిదుగురిలో ఒక అబ్బాయి ధైర్యం చేసి చూస్తాడు. అక్కడ ఈ చైన్ రెండో కొనను చేయికి చుట్టుకొని రక్తం మడుగులో పడి ఉన్న ఒక వ్యక్తి (ప్రభుదేవా)కనపడ్తాడు. కళ్లు తేలేసి ఉంటాయి. మిగిలిన వాళ్లనూ పిలుస్తాడు ఆ అబ్బాయి. అతనూ బాధితుడే.. ఆ అయిదుగురూ తమ వెహికిల్కున్న ఆ గొలుసును తీయడానికి ప్రయత్నిస్తారు. కాని రాదు. దాంతో ఆ వ్యక్తి చేతికున్న కొసను తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ లోపు ఆ దారిలోనే మరో వెహికిల్ వస్తున్న శబ్దం రావడంతో గబగబా ఆ శవాన్ని తీసి వెహికిల్ వెనక భాగంలో పెట్టేస్తారు. దారిలో ఓ జలపాతం దగ్గర బండి ఆపి.. శవాన్ని అందులో పడేయాలనుకుంటారు. కాని అక్కడ సర్వైలెన్స్ కెమెరా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని ఆపేసుకొని బండిని ముందుకు తీసుకెళ్తారు. అంతకుముందు వాళ్లు రాళ్లేసిన మూతపడ్డ కార్పోరేట్ ఎర్త్ ఫ్యాక్టరీ గ్రౌండ్లో ఉన్న గొయ్యిలో శవాన్ని ఆకులు, తుప్పలు, కర్రలతో కప్పేస్తారు. కాటేజ్‌కు వెళ్లిపోతారు. అయితే ఈ క్రమంలో ఆ అయిదుగురిలో ఒక అబ్బాయి తన ఐపాడ్‌ను ఎక్కడో పారేసుకుంటాడు. అది వెతుక్కోవడానికి తెల్లవారి మళ్లీ ఈ గొయ్యి దగ్గరకు వచ్చి చూస్తారు. అక్కడ ఐపాడ్ దొరుకుతుంది కాని శవం ఉండదు. అలాగే ఆ అమ్మాయీ మాయం అవుతుంది. ఆ అమ్మాయి ఆచూకీ కనుక్కోవడానికి ఫ్యాక్టరీకి వెళ్తారు. అక్కడే శవం కనపడుతుంది. ఆ శవం ఈ అయిదుగురిలో ముగ్గురినీ చంపేస్తుంది. అలా చంపేటప్పుడు తెలుస్తుంది ఆ శవం గుడ్డిదని. చివరకు ఆ అమ్మాయి, ఆమె ప్రేమికుడు ఇద్దరే మిగులుతారు. ప్రేమికుడినీ చంపుతుంటే ఆ అమ్మాయి అడ్డుపడుతుంది చంపొద్దని. అప్పటికే అతను చనిపోయి ఉంటాడు. అప్పుడు చెప్తుంది ఆ అమ్మాయి ఆ వ్యక్తి తనకెంత ముఖ్యమైన వాడో.. ఆ ఇద్దరూ ఒకరినొకరు ఎంత ఇష్టపడ్తున్నారో అని. తాము అయిదుగురూ చెవిటి, మూగ వాళ్లమని. అప్పుడు ఆ శవానికీ తన గతం గుర్తొస్తుంది. ఆ అమ్మాయికి చెప్తుంది. ఆ శవమూ గతంలో ఆ ఫ్యాక్టరీలో లీక్ అయిన విషవాయువు బాధితుడే. అతనికి కళ్లు పోతాయి. తన ప్రేమికురాలు అతనికి కళ్ల ఆపరేషన్ చేయించడానికి ట్రై చేస్తుంటుంది. తెల్లవారితే ఆపరేషన్.. ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టక పెంపుడు కుక్క సహాయంతో బయటకు వస్తాడు. వీళ్ల వెహికిల్తో యాక్సిడెంట్ అవుతుంది. వీళ్లు తమ వెహికిల్‌ను రివర్స్తీసుకున్నప్పుడు ప్రభుదేవాకు యాక్సిడెంట్ అవుతుంది. అతను గుడ్డి వాడు కాబట్టి కనపడదు.. వీళ్లంతా చెవిటి వాళ్లు కాబట్టి అతని ఆర్తనాదం వీళ్లకు వినపడదు. అలా అందులో ఎవరి తప్పూ ఉండదు. అకారణంగా వాళ్లను శిక్షించినందుకు ప్రభుదేవా పశ్చాత్తాపపడ్తాడు. అంతలోకే ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్లి తన ప్రేయసిని.. తన ప్రాంతాన్ని కళ్లతో చూడాలనుకుంటాడు. అమ్మాయి శరీరంలోకి అతని ఆత్మ ప్రవేశించి అన్నీ చూసుకొని... ఆస్వాదించి ఆ ఆత్మ వెళ్లిపోతుంది. వెళ్లిపోతూ ఆ అమ్మాయికి వినికిడి శక్తిని ఇస్తుంది. గొంతూ వస్తుంది. ఇదీ మెర్క్యూరీ కథ. corporate earth లోంచి corpor తీసేసి ate earth అని ఎండ్ చేస్తాడు సినిమాను దర్శకుడు. ఈ సినిమా ద్వారా ఆయన చెప్పదల్చుకుంది కూడా అదే. ఈ భూమ్మీద మనుషులతోపాటు సమస్త జీవులకూ జీవించే హక్కు అంతే ఉంది. కాని హద్దులు మరిచిన కార్పోరేట్ శక్తులు తమ దురాశతో భూమిని మింగేస్తున్నాయి అని. ఈ సందేశం మూకీ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకులను చేరిందా? ఆ విషయాన్ని చెప్పడానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా? ప్రేక్షకులే నిర్ణయించాలి. మెర్క్యూరీ ప్రస్తుతం అన్ని థియేటర్స్‌లో ఆడుతోంది. ఆసక్తి ఉన్న వాళ్లు చూడొచ్చు. ఈ చిత్రదర్శకుడు.. కార్తిక్ సుబ్బరాజ్.. పిజ్జా ఫేమ్! – శరాది -
‘మెర్క్యూరి’ మూవీ రివ్యూ
టైటిల్ : మెర్క్యూరి జానర్ : సైలెంట్ హర్రర్ థ్రిల్లర్ తారాగణం : ప్రభుదేవా, సనంత్‌రెడ్డి, దీపర్ పరమేష్, శశాంక్ పురుషోత్తం, అనీష్ పద్మనాభన్, ఇందుజా, గజరాజ్ సంగీతం : సంతోష్ నారాయణన్ దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత : స్టోన్ బెంచ్ ఫిలింస్, పెన్ స్టూడియోస్ 30 ఏళ్ల క్రితం కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ‘పుష్పక విమానం’ పేరుతో ఓ మూకీ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మరోసారి యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అదే ప్రయోగం చేశాడు. మూకీ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మెర్క్యూరి సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటించాడు. పిజ్జా, జిగర్తాండ, ఇరైవి లాంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించిన కార్తీక్, ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. మూడు దశాబ్దల తరువాత భారతీయ వెండితెర మీద సందడి చేసిన మూకీ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? గతంలో ఎన్నడూ కనిపించనంత కొత్త అవతారంలో కనిపించిన ప్రభుదేవ భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడా..? కార్తీక్ మరోసారి తన మార్క్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో అలరించాడా..? కథ : కార్పొరేట్ ఎర్త్ అనే కంపెనీలో జరిగిన మెర్య్కూరి పాయిజనింగ్ కారణంగా ఆ దగ్గరలోని ఓ గ్రామంలో 84 మంది చనిపోతారు. అంతేకాదు ప్రమాదం కారణంగా ఎంతోమంది చిన్నారులు మూగ చెవిటి వారిగా, అంధులుగా పుడతారు. మెర్య్యూరి పాయిజనింగ్ కారణంగానే బధిరులైన నలుగురు కుర్రాలు, ఓ అమ్మాయి కాలేజ్ లో జరిగిన అలూమ్ని పార్టీ లో పాల్గొని తరువాత కొద్దిరోజులు ఫ్రెండ్స్ తో ఆనందంగా గడపడానికి అక్కడే ఉండిపోతారు. అలా ఫ్రెండ్స్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తూ కారులో వెళ్తూ ఓ యాక్సిడెంట్ చేస్తారు. ఆ యాక్సిడెంట్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చనిపోతాడు. చనిపోయిన వ్యక్తిని అక్కడే వదిలేసి వెళ్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఆ శవాన్ని మోర్య్కూరి పాయిజనింగ్ కు కారణమైన ఫ్యాక్టరిలో పడేస్తారు. తరువాత ఆ కుర్రాళ్లు అదే ఫ్యాక్టరికీ ఎందుకు వెళ్లారు..? వారు యాక్సిడెంట్ చేసి చంపేసిన వ్యక్తి ఎవరు..? ఆ కుర్రాళ్లు ఒక్కొక్కరుగా చనిపోవటానికి కారణం ఏంటి..? చివరకు ఎంత మంది మిగిలారు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : దాదాపు 30 ఏళ్ల తరువాత ఇండియన్ స్క్రీన్ మీద మూకీ సినిమాను చూపించిన కార్తీక్ సుబ్బరాజ్ ధైర్యాన్ని ప్రశంసించాల్సిందే. అది కూడా డ్యాన్సర్ గా, లవర్ భాయ్‌గా మంచి ఇమేజ్ ఉన్న ప్రభుదేవాను పూర్తిగా డిఫరెంట్ రోల్లో, డిఫరెంట్ గెటప్‌లో చూపించి మెప్పించాడు కార్తీక్. సందేశాత్మక అంశాన్ని హర్రర్ థ్రిల్లర్‌గా మలిచి ఆకట్టుకున్నాడు. అయితే రొటీన్ కమర్షియల్ సినిమాలో ఉండే అంశాలేవి లేకపోవటం, తొలి భాగంలో లీడ్ యాక్టర్స్ మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులకు అర్ధం కాకపోవటం లాంటివి కాస్త ఇబ్బంది పెడతాయి. దర్శకుడు సృష్టించిన పాత్రకు ప్రభుదేవా వందశాతం న్యాయం చేశాడు. తనకు జరిగిన అన్యాయానికి పగతీర్చుకునే పాత్రలో ప్రభుదేవా నటన చాలా సందర్భాల్లో భయపెడుతుంది. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో కంటతడి కూడా పెట్టిస్తుంది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం. ఒక్క డైలాగ్ కూడా లేని సినిమాను పూర్తిగా తన నేపథ్య సంగీతంతో ఆసక్తికరంగా మార్చాడు సంతోష్. తిరు అందించిన సినిమాటోగ్రఫి సినిమాలోని ఫీల్ ను క్యారీ చేసింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రభుదేవా లుక్, నటన కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ మైనస్ పాయింట్స్ : బధిరుల భాషలో చెప్పించిన సంభాషణలు అర్ధం కాకపోవటం స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
విలన్ పాత్రకి ఎవరి స్ఫూర్తీ లేదు – ప్రభుదేవా
‘‘ఎంటర్టైనింగ్, మాస్ అంశాలతో తెరకెక్కిన మంచి చిత్రం ‘మెర్క్యురి’. నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా ఉంటుంది. విలన్‌గా చేయడం ఎగ్జయిట్మెంట్ అనిపించింది. ఆ పాత్ర చేయడానికి ఎవరి స్ఫూర్తీ లేదు. కార్తీక్ సుబ్బరాజ్‌పై నమ్మకంతోనే చేశా. సినిమా చూస్తున్నంత సేపు పాత్రలు మాత్రమే కనపడతాయి’’ అని ప్రభుదేవా అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెర్క్యురి’. పెన్ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిలింస్ సమర్పణలో కార్తికేయన్ సంతానం, జయంతి లాల్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 13న విడుదలవుతోంది. తెలుగులో కె.ఎఫ్.సి. ప్రొడక్షన్ విడుదల చేస్తున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ– ‘‘యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. కమల్‌హాసన్‌గారి ‘పుష్పకవిమానం’ తర్వాత వస్తోన్న మూకీ సినిమా ‘మెర్క్యురి’. కమర్షియల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. ఇండియన్ సినిమాను తర్వాతి లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘పిజ్జా’ తెలుగులోనూ మంచి హిట్ అయింది. ‘మెర్క్యురి’ లాంటి వైవిధ్యమైన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇందులో పాటలు, డ్యాన్సులు ఉండవు’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. -
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు – కార్తీక్ సుబ్బరాజ్
‘‘రెండు రోజుల్లో జరిగే కథే ‘మెర్క్యూరీ’. ‘పుష్పక విమానం’ తర్వాత సైలెంట్ ఫిల్మ్ రాలేదు. ఈ చిత్రంలో కొత్త ప్రభుదేవాని చూస్తారు. ప్రేక్షకులు మా సినిమాని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అన్నారు. ప్రభుదేవా ముఖ్య పాత్రలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెర్క్యూరీ’. స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ సమర్పణలో కార్తికేయన్, సంతానం, జయంతి లాల్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ– ‘‘మనకు మొదట్లో సైలెంట్ ఫిల్మ్స్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత టాకీ సినిమా వచ్చింది. సైలెంట్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మెర్క్యూరీ’. డైలాగ్స్ చాలా తక్కువగా ఉండే సినిమా తీయాలని దర్శకుణ్ణి అయిన కొత్తలో అనుకున్నా. అది ఈ చిత్రంతో నెరవేరింది. ప్రభుదేవాగారు విలన్ పాత్రలో కనిపించనున్నారు. కథ విన్నప్పుడు డైలాగ్స్ లేకుండా వర్కవుట్ అవుతుందా? అని అడిగారు. ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాం. బంద్ ముగిసే వరకు తమిళనాడులో సినిమా రిలీజ్ చేయం. నా తర్వాతి సినిమా రజనీకాంత్ సార్‌తో చేస్తున్నా. రెండు మూడు నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. -
అంచనాలు పెంచుతున్న మూకీ మూవీ టీజర్
సాక్షి, హైదరాబాద్: డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్క్యూరి టీజర్ తాజాగా విడుదలైంది. టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ఎలాంటి సంభాషణలు లేకుండా మూకీ మూవీ కావడంతో ఈ సైలెంట్ థ్రిల్లర్‌పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. గతంలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన పుష్పక విమానం మూవీ తరహాలోనే ‘మెర్క్యూరి’ మూవీలో పాత్రలు మాట్లాడవు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే మూవీ కొనసాగనుంది. ఇంతవరకూ డైలాగ్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను దర్శకులు భయపెట్టారు. కానీ ఇందులో ప్రభుదేవా లుక్ చూశాక.. డైలాగ్స్ లేని సైలెంట్ థ్రిల్లర్‌ను కేవలం ఆ నటీనటుల హావభావాలతో ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సైలెంట్ థ్రిల్లర్‌గా మెర్క్యూరి తెరకెక్కింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సైలెంట్ హార్రర్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సంతోష్ నారాయణ్ సంగీతం మూవీకి ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. మెర్క్యూరి ఈ ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. -
టీజర్‌తో భయపెట్టిన ప్రభుదేవా
-
ప్రభుదేవా మూకీ సినిమా ‘మెర్క్యూరి’
డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్క్యూరి. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సైలెంట్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన పుష్పక విమానం సినిమా తరహాలోనే ఈ సినిమాలోని పాత్రలు కూడా మాట్లాడవని తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
1,200 ఏళ్ల కిందటే.. మందుల్లో పాదరసం!
సాక్షి, హైదరాబాద్ : మందుల్లో పాదరసాన్ని వినియోగించడం ఇప్పుడు ఆశ్చర్యం కాకపోవచ్చు.. కానీ 1,200 ఏళ్ల కిందటే ఈ ప్రక్రియ జరిగితే!!! ఆకు పసర్లు, మూలికలే మందులుగా ఉండే కాలంలో ఇంత పరిజ్ఞానం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతాం. కానీ 9వ శతాబ్దంలోనే సిద్ధ నాగార్జునుడు అనే వైద్య ప్రముఖుడు దీన్ని ఆచరించి చూపాడు. ఇది ఎక్కడో కాదు.. తెలంగాణ గడ్డమీదే. మహబూబ్‌నగర్ జిల్లా ఏలేశ్వరంలో జరిపిన తవ్వకాల్లో ఆయన వినియోగించిన పరిశోధనశాల వెలుగు చూసింది. అప్పట్లో ఆయన రాసిన రసేంద్ర మంగళం గ్రంథాన్ని ఉటంకిస్తూ పద్మనాయకుల హయాంలో రాసిన తాళపత్ర గ్రంథాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇలా ఇదొక్కటే కాదు ప్రపంచానికి తొలి శాస్త్రీయ వైద్యాన్ని అందించిన ఆయుర్వేదంలో ఇలాంటి అద్భుతాలెన్నో. ఇవన్నీ పుక్కిటి పురాణాలుగా కొట్టేసే విషయాలు కాదు. ఆధారాలతో సహా ఉన్నాయన్న సంగతి అంతర్జాతీయ పురావస్తు సదస్సులో ప్రధానాకర్షణగా నిలిచింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శుక్రవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్‌లో సహాయ సంచాలకులు డాక్టర్ గోలి పెంచల ప్రసాద్ తన పరిశోధనల వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు, చరిత్రకారులు డాక్టర్ రాజారెడ్డి దీనికి అనుబంధంగా పలు విషయాలను వెల్లడించారు. వివరాలు వారి మాటల్లోనే.. అగ్గలాంగే గగ్గలమ్ ‘‘నేను చికిత్స చేసే క్రమంలో మందులతో జబ్బును తగ్గించేందుకు ప్రయత్నిస్తా. అవసరమైతే శస్త్రచికిత్స చేస్తా’’11వ శతాబ్దంలో చాళుక్యుల హయాంలో ప్రముఖ వైద్యుడిగా వెలుగొందిన అగ్గలయ్య మాట ఇది. ఈయన ఫిజీషియన్‌గా, సర్జన్‌గా అప్పట్లో వెలుగొందారు. ఏ వైద్యుడూ నయం చేయలేని జబ్బు మాయం చేస్తాడన్నది అప్పట్లో ఆయన ఘనతను చెప్పుకొనేవారట. ‘అగ్గలాంగే గగ్గలమ్’అంటూ ఆయనను పిలిచేవారు. ఈయన తొలుత ఓ గ్రామ పెద్దగా ‘గౌండ్’హోదాను, ఆ తర్వాత సామంత రాజు హోదాను దక్కిం చుకున్నారు. ఈ విషయాలు సైదాపూర్‌లో వెలుగుచూసిన ఓ శాసనం వెల్లడిస్తోంది. ఆయన ‘వైద్య రత్నాకర ప్రాణాచార్య’ బిరుదు కూడా అందుకున్నారు. నాటి ఓ జైన ఆలయానికి వైద్య రత్నాకర జినాలయం అనే పేరు పెట్టారు. ఆయన పేరుతో స్తూపంపై నాటి రాజు జయసింహ–2 శాసనమే చెక్కించారు. జ్వరాలయం.. ఓ మెడికల్ కాలేజీ ఒకటి, రెండు శతాబ్దాల్లో నాగార్జున కొండ వద్ద విహారే ముఖ్య జ్వరాలయం కొనసాగింది. ఇది నాటి మెడికల్ కళాశాల. అందులో జ్వరాలకు ప్రత్యేక విభాగం ఉండేది. 1920లో జరిగిన తవ్వకాల్లో వెలుగుచూసిన శాసనం దీన్ని పేర్కొంటోంది. 2, 3 శతాబ్దాల్లో సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో కూడా ఇలాంటి అంశమే వెలుగుచూసింది. అక్కడ నిలబెట్టిన ధర్మ చక్రం ఓ వైద్యుడికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నవారే ఆ స్థూపాన్ని నిలపాల్సి ఉంటుంది. నాటి రాజు ధేమసేన ఆస్థాన వైద్యుడుగా కొనసాగుతున్న రాజవైద్యుడితో దాన్ని నిలబెట్టించారు. నల్లగొండ జిల్లా రామన్నపేట సమీపంలోని తుమ్మలగూడెంలో లభించిన శాసనంలో విష్ణుకుండినులు–5కు చెందిన గోవిందవర్మన్ నాటి వైద్య అవసరాలకు మందుల కొనుగోలుకు గ్రాంటు విడుదల చేసిన అంశం చెక్కి ఉంది. అశోకుడి కాలంలో జంతువులకూ వైద్యం 12వ శతాబ్దంలో నాటి వైద్యుడు మేడవారి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించినందుకు పరహిత బిరుదు పొందినట్టు శాసనంలో ఉంది. ఉచిత వైద్యం అందించిన వారికి భూమిని కూడా అందించినట్టు శాసనంలో పేర్కొన్నారు. 800 ఏళ్ల కిందట చోళ రాజు వీర రాజేంద్ర–2 ప్రజల వైద్య అవసరాల కోసం 15 పడకల ప్రసూతి ఆసుపత్రిని నిర్మించి అందులో ఒక ఫిజీషియన్, ఒక సర్జన్, చాలినంత మంది సిబ్బందిని వినియోగించినట్టు తిరుమక్కదల్ శాసనం వెల్లడిస్తోంది. ఇక అశోకుడి కాలంలో మనుషులకే కాకుండా జంతువులకు కూడా వైద్యం చేయించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. -
విలన్... ఫన్!
వెండితెరపై విలన్లను చూస్తే ఎవరికైనా నవ్వొస్తుందా? అఫ్కోర్స్... కామెడీ విలన్లు ఉన్నారనుకోండి! కాసేపు వాళ్లను పక్కన పెట్టేసి, సీరియస్ విలన్ల సంగతికి వద్దాం! వాళ్లను చూస్తే నవ్వొస్తుందా? చూస్తున్నది తెరపైనే అయినా ఒక్కోసారి భయం వేస్తుంది. కానీ, ప్రభుదేవా ‘విలన్’ అంటే ‘ఫన్’ అంటున్నారు! ఎందుకిలా? అంటే... ‘మెర్క్యూరీ’ అనే తమిళ సినిమాలో ఈ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సంగతి ప్రేక్షకులకు తెలిసిందే! ‘విలన్‌గా నటించడం ఎలా ఉంది?’ అనే ప్రశ్నను ప్రభుదేవా ముందుంచితే – ‘‘ఇంతకు ముందెప్పుడూ విలన్‌గా చేయలేదు. ఒక్కసారి ప్రపంచమంతా మారినట్టు, వింతగా అన్పిస్తోంది. బట్, ఇట్స్ ఫన్! యాక్టింగ్ అంటే అంతేగా... రియల్ లైఫ్‌లో మనం చేయలేని పనులను రీల్ లైఫ్‌లో చేసే చాన్స్ దొరుకుతుంది’’ అన్నారు. మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్! ‘మెర్క్యూరీ’కి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే... మూకీ చిత్రమిది! నో డైలాగ్స్... ఓన్లీ యాక్షన్! కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ్ డబ్బింగ్ హిట్ ‘పిజ్జా’ దర్శకుడీయనే. ‘పిజ్జా’లో హీరోయిన్గా నటించిన రమ్యా నంబీసన్ ఇందులోనూ నటిస్తున్నారు. మూకీ సినిమా కావడంతో తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. మూకీకి డబ్బింగ్ అవసరం లేదు... దాంతో ఎన్ని లాభాలో చూడండి!! -
విలన్ పాత్రలో టాప్ డైరెక్టర్!
సాక్షి, చెన్నై: ఒకప్పుడు విలన్ పాత్రధారులు హీరోలుగా నటించడం ప్రమోషన్‌గా భావించేవారు. కానీ, ఇప్పుడు హీరోలూ విలన్‌గా నటిస్తున్నారు. దర్శకులు నెగిటివ్ రోల్లో నటించేందుకు సై అంటున్నారు. ఇప్పటికే 'స్పైడర్'లో ప్రముఖ దర్శకుడు ఎస్జే సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా కూడా విలన్ పాత్రపై మక్కువతో ఉన్నారు. ఆయన తాజాగా ప్రతినాయకుడిగా తెరపై కనిపించబోతున్నారు. ప్రభుదేవాకు బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా పేరుంది. అలాంటి ఆయన చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌కు 'దేవి' చిత్రం ద్వారా కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. తాజాగా హన్సికతో కలిసి 'గులేబకావళి', నటి లక్ష్మీమీనన్‌తో 'యంగ్ మంగ్ జంగ్' చిత్రాల్లో నటిస్తున్న ఈయన.. 'మెర్క్యురీ'లో విలన్‌గా విశ్వరూపం చూపించబోతున్నారు. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బుల్లితెర నటుడు సనత్‌రెడ్డి హీరోగా నటిస్తున్నారు. దీపక్ పరమేశ్, రమ్యానంభీశన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'మెర్క్యురీ' సినిమా షూటింగ్ చాలా సైలెంట్‌గా పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభుదేవా విలన్‌గా నటిస్తున్నారన్న కథనాలతో అభిమానులు ఆయన విలనిజాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
బ్లాక్‌బెర్రీ ఫైనల్ స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ డేట్స్ ఫిక్స్
ప్రపంచ ఫోన్ల మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బ్లాక్‌బెర్రీ, తన ఇన్-హౌజ్‌లో డిజైన్ చేసిన ఆఖరి స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సిద్ధమైంది. ఇన్-హౌజ్‌లో డిజైన్ చేసిన తన మెర్క్యూరీ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో ప్రవేశపెట్టబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. చైనీస్ సంస్థ టీసీఎల్ భాగస్వామ్యంలో ఈ డివైజ్‌ను అధికారికంగా ఫిబ్రవరి 25న జరుగబోయే ఈవెంట్లో లాంచ్ చేయనున్నామని కంపెనీ ప్రకటించింది. బార్సిలోనాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షో ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందే దీన్ని లాంచ్ చేసేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసుకుంది. బ్లాక్‌బెర్రీ మొబైల్ అకౌంట్లో ఈ లాంచింగ్‌ను రివీల్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న కీబోర్డు ఫోన్‌ను విడుదల చేయనున్నామని, మెర్క్యూరీ పేరుతో దీన్ని లాంచ్ చేస్తున్నామని తెలిపింది. చైనా టీసీఎల్ కమ్యూనికేషన్ తయారుచేసిన బ్లాక్‌బెర్రీ డివైజ్‌లలో మెర్క్యూరీ మూడోవది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ వీడియోను టీసీఎల్ ఉత్తర అమెరికా అధ్యక్షుడు స్టీవ్ సిస్టుల్లీ విడుదల చేశారు. జనవరి మొదట్లో లాస్వేంగాస్లో జరిగిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ ఫోన్ గురించి బ్లాక్‌బెర్రీ, టీసీఎల్ మొదటిసారి రివీల్ చేశాయి. కానీ మిగతా వివరాలు వేటిని ఇవి ప్రకటించలేదు. కొత్త మెటాలిక్‌తో రాబోతున్న ఈ ఫోన్ 4.2 అంగుళాల టచ్‌స్క్రీన్, క్వార్టీ కీబోర్డు కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కీబోర్డు మెసేజ్‌లు, ఈమెయిల్స్ చేసుకోవడానికి ఎంతో సహకరించనుందట. ఈ ట్రేడ్ షోలోనే శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌ను కూడా విడుదల చేయనుంది. ఫోన్లు డిజైన్ చేయడం నుంచి తాము వైదొలుగుతామని బ్లాక్‌బెర్రీ సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. సాప్ట్‌వేర్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో కంపెనీ ఇన్-హౌజ్ నుంచి రాబోతున్న ఫైనల్ స్మార్ట్ఫోనని తెలుస్తోంది. -
సూర్యుడు, భూమి మధ్యలో బుధుడు!
నేడు ఖగోళంలో అరుదైన ఘటన ♦ సాయంత్రం 4.42 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు వీక్షించే అవకాశం ♦ మళ్లీ వీక్షించాలంటే 2032 నవంబర్ 13 వరకు ఆగాల్సిందే ♦ నేరుగా చూడడం ప్రమాదకరం..సోలార్ ఫిల్టర్లు వాడాలని నిపుణుల సూచన హైదరాబాద్: సూర్యుడిని అత్యంత వేగంతో చుట్టేసే బుధగ్రహం సోమవారం భూమికి, సూర్యుడికి మధ్య అడ్డుగా రానుంది. ఒక రకంగా చెప్పాలంటే సూర్య గ్రహణాన్ని సృష్టించనుంది. కానీ అంతపెద్ద సూర్యుడికి దగ్గరగా పరిభ్రమిస్తుండడంతో... సూర్యుడిపై ఓ చిన్న నల్లని చుక్కలాగా కనిపించనుంది. అరుదైన ఈ ఖగోళ విశేషాన్ని సోమవారం సాయంత్రం 4.42 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు వీక్షించే అవకాశముంది. అయితే దీనిని నేరుగా వీక్షించడం ప్రమాదకరం. తగిన పరికరాలు, నిపుణుల సూచనల ప్రకారం చూడొచ్చు. సూర్యుడు, బుధుడు, భూమి ఒకే సరళరేఖలో.. సోమవారం సాయంత్రం సూర్యుడు, బుధుడు, భూమి ఒకే సరళరేఖపైకి రానున్నాయి. సూర్యుడికి, భూమికి మధ్య బుధ గ్రహం వస్తుంది. దీనినే ‘ట్రాన్సిట్ ఆఫ్ మెర్క్యూరీ’ అని పేర్కొంటారు. ఈ దృశ్యాన్ని నేరుగా చూడడం కళ్లకు ప్రమాదకరం. కేవలం సోలార్ ఫిల్టర్‌లో మాత్రమే చూడాలి. అదేవిధంగా బైనాక్యూలర్లు, టెలిస్కోప్‌ల ద్వారా సూర్యుడి ప్రతిబింబం గోడపై పడేలా చేసి.. సూర్యుడిని బుధగ్రహం దాటడాన్ని గమనించవచ్చు. ఇక ఈ ఖగోళ విశేషం కారణంగా భూమిపైగానీ, జీవరాశిపైగానీ ఎటువంటి ప్రభావమూ ఉండదు. వందేళ్లలో 13వ సారి..: గత వందేళ్ల కాలంలో 13 సార్లు మాత్రమే సూర్యుడిపై నుంచి బుధుడు వెళ్లే దృశ్యం కనిపించిందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డెరైక్టర్ ఎన్.రఘునందన్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఆదివారం ఆయన ఈ ఖగోళ విశేషం వివరాలను వెల్లడించారు. ఇలాంటి ఘటన 2006 నవంబర్ 8న జరిగిందన్నారు. ఇక ముందుకూడా 2019 నవంబర్ 11న సంభవించనుందని.. కానీ అప్పుడు మన దేశంలో కనిపించదని తెలిపారు. అయితే ఆ తర్వాత 2032 నవంబర్ 13న జరిగే ‘బుధ’ సూర్యగ్రహణం మనదేశంలో కనిపిస్తుందన్నారు. అంటే సోమవారం ఈ దృశ్యాన్ని చూడనివారు.. మళ్లీ చూడాలంటే మరో 16 ఏళ్ల పాటు వేచి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కోరికపై రంజోల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 250 మంది, కొండాపూర్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో మరో 250 మంది విద్యార్థులు ఈ ఘటనను తిలకించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. -
బుధుడి ఉపరితలం ఇలా...
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, బుధగ్రహం నైసర్గిక స్వరూపాన్ని స్పష్టంగా తెలిపే తొలి చిత్రపటాన్ని విడుదల చేసింది.‘మెసెంజర్’ వ్యోమనౌక ఈ ఫోటోలు తీసింది. దీనివల్ల బుధుడి భూగర్భ చరిత్ర గురించి మరిన్ని పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలకు మార్గం సుగమమైంది. ఈ కొత్త నమూనా చిత్రం బుధుని ఎత్తై, లోతైన ప్రాంతాలతోపాటు అనేక ఆసక్తికర విషయాలను చూపుతోంది. భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న ప్రాంతం బుధుడి సగటు ఎత్తు నుంచి అత్యధికంగా 4.48 కి.మీల ఎత్తులో ఉంది. రచ్మనినాఫ్ బేసిన్లో కొంతభాగం బుధుడి సగటు లోతు కన్నా 5.38 కి.మీల లోతులో ఉంది. ఇక్కడ అగ్నిపర్వత భాగాలు ఉండొచ్చని భావిస్తున్నారు. -
ఇనుప బ్రిడ్జిలో గోళాకార నిర్మాణం అవసరం?
ఉష్ణం - ద్రవ ఉష్ణోగ్రతా మాపకాలు ద్రవాలను వేడి చేసినప్పుడు వాటి ఘన పరిమాణం పెరుగుతుంది అనే సూత్రం ఆధారంగా ద్రవ ఉష్ణోగ్రత మాపకాలు పనిచేస్తాయి. వీటిలో ఏ ద్రవాన్నయినా ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ ఉష్ణోగ్రత మాపకాల్లో నీటికి బదులుగా పాదరసాన్ని ఉపయోగిస్తారు. దీనికి కారణాలు: 1. పాదరసం సంకోచ, వ్యాకోచాలు పరస్పరం సమానంగా ఉంటాయి. నీటి సంకోచ, వ్యాకోచాలు అసమానంగా ఉంటాయి. 2. నీరు పాత్ర గోడలకు అంటుకొని ఉంటుంది. కానీ పాదరసం పాత్ర గోడలకు అంటుకొని ఉండదు. 3. స్వభావరీత్యా పాదరసం వెండిలా మెరుస్తుంది. అందువల్ల దీన్ని క్విక్ సిల్వర్ అంటారు. ఈ కారణంగా రీడింగ్‌లను ఎలాంటి దోషాలు లేకుండా కచ్చితంగా గుర్తించవచ్చు. నీటికి రంగు ఉండదు. అదేవిధంగా నీరు, గాజు వక్రీభవన గుణకాల విలువలు దాదాపు సమానంగా ఉంటాయి. అందువల్ల రీడింగ్‌లను కచ్చితంగా గుర్తించడం వీలు కాదు. 4. మనకు లభించే ద్రవ పదార్థాలన్నింటిలో పాదరసానికి విశిష్టోష్ణం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా వేడెక్కి, త్వరగా చల్లబడే గుణాన్ని కలిగి ఉంటుంది. నీటి విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీరు ఆలస్యంగా వేడెక్కి, ఆలస్యంగా చల్లబడుతుంది. అందువల్ల ఉష్ణోగ్రతలను తొందరగా నమోదు చేయడం వీలుకాదు. అతిశీతల ప్రాంతాల్లో వస్తువుల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఆల్కహాల్ ఉష్ణోగ్రత మాపకాన్ని ఉపయోగిస్తారు. అతిశీతల ప్రాంతాల్లో వస్తువుల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే ఏ ఉష్ణోగ్రత మాపకాన్నయినా సైరో మీటర్ అని అంటారు. వాహనాల రేడియేటర్లలో నీటిని కూలెంట్ (శీతలీకరణి)గా ఉపయోగిస్తారు. విశిష్టోష్ణం ఎక్కువగా ఉండటం వల్ల నీరు ఆలస్యంగా వేడెక్కి, ఆలస్యంగా చల్లబడటమే దీనికి కారణం. విశిష్టోష్ణం m – పదార్థం ద్రవ్యరాశి Q – పదార్థానికి అందించిన ఉష్ణరాశి t – పదార్థ ఉష్ణోగ్రతలోని మార్పు విశిష్టోష్ణం అన్ని ఘన, ద్రవ, వాయు పదార్థాలకు ఉండే ఒక స్వాభావిక ధర్మం. ఆయా పదార్థ స్వభావం ఆధారంగా విశిష్టోష్ణం విలువలు వేర్వేరుగా ఉంటాయి. పాదరసం (Hg) పాదరసం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో లభించే ఒక మూలకం (లోహం). 1. దీన్ని సిన్నబార్ అనే ముడిధాతువు నుంచి సంగ్రహిస్తారు. 2. పాదరసం మంచి విద్యుత్, ఉష్ణ వాహకం. అందువల్ల దీన్ని ద్రవ ఉష్ణోగ్రత మాపకాల్లో ఉపయోగిస్తారు. 3. పాదరసం అన్ని లోహాలతో రసాయన చర్య జరిపి ఏర్పరిచే పదార్థాలను అమాళ్గంలు అంటారు. కానీ పాదరసం ఇనుముతో రసాయనిక చర్యలో పాల్గొనదు. అందువల్ల దీన్ని ఇనుప పాత్రల్లో నింపి రవాణా చేస్తారు. పాదరసం కాలుష్యం వల్ల ‘మినిమెటా’ అనే వ్యాధి వస్తుంది. ఇది మొదటిసారిగా జపాన్‌లో వచ్చింది. పదార్థాల ఉష్ణ వ్యాకోచాలు ఘన పదార్థాల ఉష్ణ వ్యాకోచాలు: ప్రతి ఘన పదార్థంలో దాని ద్రవ్యరాశి 3 అక్షాల (x అక్షం - పొడవు, y అక్షం- వెడల్పు, z అక్షం - ఎత్తు) వెంట విభజితమై ఉంటుంది. ఈ ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి స్వభావం ఆధారంగా అణువుల మధ్య బంధ దూరంలో మార్పు వస్తుంది. కొన్ని ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి అణువుల మధ్య బంధ దూరం తగ్గడం వల్ల అవి సంకోచిస్తాయి. ఉదా: రబ్బరు, గాజు (80 C°), ఫీజు తీగ, సిల్కు దుస్తులు, తలవెంట్రుకలు, ప్లాస్టిక్. కొన్ని ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి అణువుల మధ్య బంధ దూరం పెరగడం వల్ల అవి వ్యాకోచిస్తాయి. ఉదా: అల్యూమినియం, రాగి, ఇనుము, ఉక్కు. కొన్ని ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు లేదా చల్లబర్చినప్పుడు వాటి అణువుల మధ్య బంధ దూరంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇలాంటి ఘన పదార్థాల్లో సంకోచన, వ్యాకోచాలు ఉండవు. ఉదా: చెక్క దిమ్మె. ఘన పదార్థాలకు మూడు రకాల వ్యాకోచాలుంటాయి. 1. దైర్ఘ్య వ్యాకోచం: ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు ఒక అక్షం వెంట మాత్రమే వ్యాకోచిస్తే దాన్ని దైర్ఘ్య వ్యాకోచం అంటారు. 2. విస్తీర్ణ వ్యాకోచం: ఒక ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు ఏదైనా 2 అక్షాల వెంట వ్యాకోచిస్తే దాన్ని విస్తీర్ణ వ్యాకోచం అంటారు. వైశాల్యం = పొడవు ణ వెడల్పు 3. ఘన పరిమాణ వ్యాకోచం: ఒక ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు అన్ని అక్షాల వెంట వ్యాకోచిస్తే దాన్ని ఘన పరిమాణ వ్యాకోచం అంటారు. ఘన పరిమాణం = పొ × వె × ఎత్తు పైన పేర్కొన్న మూడు రకాల ఉష్ణ వ్యాకోచాలను పరిశీలించినప్పుడు ఘన పరిమాణంలో ఉష్ణ వ్యాకోచం ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. దైనందిన జీవితంలో ఘన పదార్థాల ఉష్ణ వ్యాకోచానికి ఉదాహరణలు: 1. ఒక లోహ పలక మధ్య భాగంలో కొంత వ్యాసం ఉన్న ఒక రంధ్రం ఉంది. ఈ రంధ్రం మధ్య బిందువు వద్ద వేడి చేసినప్పుడు అందించిన ఉష్ణం అన్ని వైపులా సమానంగా వ్యాపిస్తుంది. కాబట్టి లోహ పలక వ్యాకోచానికి అనుగుణంగా రంధ్రం వ్యాసం కూడా పెరుగుతుంది. 2. అల్యూమినియం పాత్రలో ఒక ఇనుప పాత్ర బంధించి ఉంది. వీటిని వేరు చేయడానికి గది ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాలి. అప్పుడు ఇనుము కంటే అల్యూమినియం ఎక్కువగా వ్యాకోచించడం వల్ల దాని పరిమాణం పెరుగుతుంది. అప్పుడు రెండు పాత్రలను సులభంగా వేరు చేయవచ్చు. ఒకవేళ ఇనుప పాత్రలో అల్యూమినియం పాత్ర బంధించి ఉంటే.. వాటిని వేరు చేయడానికి చల్లబర్చాలి. ఈ సందర్భంలో ఇనుము కంటే అల్యూమినియం ఎక్కువగా సంకోచించడం వల్ల దాని పరిమాణం తగ్గుతుంది. 3. ఇంటి పై కప్పుల నిర్మాణంలో కాంక్రీటుతోపాటు ఇనుమును ఉపయోగించడానికి కారణం ఆ రెండు పదార్థాల సంకోచ, వ్యాకోచాలు పరస్పరం సమానంగా ఉండటమే. 4. విద్యుత్ బల్బులను, గాజు వస్తువులను సీల్ చేయడానికి ప్లాటినాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ రెండు పదార్థాల సంకోచ, వ్యాకోచాలు పరస్పరం సమానంగా ఉంటాయి. 5. సిమెంట్ రోడ్డును నిర్మించేటప్పుడు రాళ్ల మధ్య తగినంత ఖాళీని వదిలి వేయడం వల్ల అవి స్వేచ్ఛగా సంకోచన, వ్యాకోచాలు చేయగలుగుతాయి. 6. ఇనుప బ్రిడ్జిలను బిళ్లల ఆకారంలో నిర్మించి వాటిని స్తూపాకారం లేదా గోళాకారం ఉన్న నిర్మాణాలపై అమర్చుతారు. అందువల్ల ఆ ఇనుప బ్రిడ్జిలో ఉన్న బిళ్లలు స్వేచ్ఛగా సంకోచ, వ్యాకోచాలు చేయగలుగుతాయి. 7. చల్లటి గాజు దిమ్మెపై వేడి ద్రవాన్ని చల్లినప్పుడు గాజు పొరల మధ్య ఉండే అసమాన వ్యాకోచనాల వల్ల అది పగిలిపోతుంది. 8. ద్విలోహ ఫలక: దీన్ని ఇనుము, ఇత్తడి ఫలకలను ఉపయోగించి నిర్మిస్తారు. ఈ పరికరం స్వయంగా ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటూ పని చేస్తుంది. కాబట్టి ‘దీన్ని ఉష్ణ తాపక నియంత్రక యంత్రం (థెర్మోస్టాట్)’ అని కూడా అంటారు. ఆటోమెటిక్ ఐరన్ బాక్స్, రిఫ్రిజిరేటర్లలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి దీన్ని ఉపయోగిస్తారు. 9. ఇన్వార్ స్టీల్: ఈ మిశ్రమ లోహాన్ని వేడిచేసినా లేదా చల్లార్చినా దానిలో ఎలాంటి సంకోచన, వ్యాకోచనాలు ఏర్పడవు. కాబట్టి ఇన్వార్ స్టీల్‌ను కింద పేర్కొన్న పరికరాలను తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఎ. మీటర్ స్కేలు బి. శృతిదండం సి. లఘులోలకం రెండు వరుస రైలు పట్టాల మధ్య తగినంత ఖాళీని వదిలేస్తారు. దీని వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా అవి స్వేచ్ఛగా సంకోచ, వ్యాకోచాలు చేయగలుగుతాయి. రెండు వరుస విద్యుత్ లేదా టెలిఫోన్ స్తంభాల మధ్య తీగలను కొంచెం వదులుగా బిగిస్తారు. దీని వల్ల శీతాకాలంలో తీగలు సంకోచించినా ప్రమాదం ఏర్పడకుండా ఉంటుంది. వేడిగాజు దిమ్మెపై చల్లటి ద్రవాన్ని చల్లినప్పుడు గాజు పొరల మధ్య ఉండే అసమాన సంకోచనాల వల్ల అది పగిలిపోతుంది. ఎడ్లబండి కొయ్య చక్రానికి ఇనుప చక్రాన్ని బిగించడానికి ముందు దాన్ని కొలిమిలో అమర్చి వేడి చేస్తారు. ఇనుప చక్రం వ్యాకోచించి దాని వ్యాసం పెరుగుతుంది. ఈ ఇనుప చక్రాన్ని కొయ్య చక్రంపై అమర్చి నీటిని చల్లినప్పుడు అది సంకోచించి గట్టిగా బిగుసుకుంటుంది. - సి.హెచ్. మోహన్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్. -
మట్టి ప్రతిమలే మేలు..!
మొయినాబాద్ రూరల్: ప్రపంచానికి ఆధ్యాత్మిక పరిమాళాన్ని అందించిన భారత్‌లో కొన్ని వేల సంవత్సరాలుగా పూరాతన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఇవన్ని ప్రకృతితో మమేకమై జరుపుకునే పండుగలే. అయితే ఇటీవలె వచ్చిన ఆధునాతన పద్ధతులతో ఈ సంప్రదాయాలే పర్యావరణానికి కీడు చేస్తున్నాయి. ఒకప్పుడు మట్టితో తయారు చేసే వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకునేవారు. ఆ తరువాత వాటిని చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేసినా సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్రమాదకరమైన రసాయనాలతో ఆకర్షణీయ రూపాల్లో విగ్రహాలను తయారు చేస్తున్నారు. పూజల అనంతరం ఈ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేసినా అవి కరగడం లేదు. అంతేకాకుండా ఆ ప్రతిమల్లోని రసాయనాలు చెరువులు, కుంటలను కలుషితం చేస్తున్నాయి. దీనికి బదులు మట్టి విగ్రహాలనే వాడాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారాన్ని ప్రారంభించాయి. జీవరాశుల మృత్యువాత ప్రతి సంవత్సరం హిందువులు వినాయక పండుగ కోసం రాష్ర్ట వాప్తంగా లక్షల సంఖ్యలో గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తారు. వీటిలో 75 శాతంకుపైగా రసాయన పదార్థాలైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలే ఉంటాయి. అయితే పూజల అనంతరం ఈ విగ్రహాలను సమీపంలోవున్న చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తుంటారు. ఆ సమయంలో విగ్రహాల తయారీలో ఉపయోగించిన కృత్రిమ రంగులైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పాదరసం, సీసం, కాడ్మీయం, క్రోమీయం తదితర రసాయనాలు నీటిలో కలుస్తున్నాయి. దీంతో నీరు, గాలి కాలుష్యమవుతోంది. వీటితో క్యాన్సర్, జీర్ణకోశం, మూత్రపిండాలు, చర్మానికి సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఈ రసాయనాలతో చెరువులు, కుంటల్లో వుండే జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇటీవలె మట్టి విగ్రహాల వినియోగం పెరిగిపోయింది. మట్టి విగ్రహాల వినియోగం శ్రే యస్కరం పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి విగ్రహాలను వినియోగించడమే శ్రేయస్కరమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. చెరువుల, కుంటల వద్ద లభిం చే బంక మట్టితో వివిధ ఆకారాల్లో విగ్రహాలను చేయవచ్చు. వీటివల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడే అవకాశముండదు. మట్టితో తయారు చేసే విగ్రహాలు నిమజ్జనం చేసిన వెంటనే నీటిలో సులభంగా కరిగిపోతాయి. అయితే మట్టితో తయారు చేసిన విగ్రహాలు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో పోలిస్తే ఆకర్షణీయంగా కని పించకపోవడంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపడంలే దు. మట్టి విగ్రహాలపై ప్రభుత్వాలు, పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రజలలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ కారణంగా ఏటేటా వాతావరణ కాలుష్యం పెరుతూనే ఉంది. కొన్ని చోట్ల పర్యావరణ ప్రేమికులు మట్టి విగ్రహాలను పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకై ప్రజల కు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీకి ఓ సంఘం ఈ తరుణంలో మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో గతేడాది మట్టి విగ్రహాల తయారీ సంఘం ఏర్పడింది. కె. మంజుల అనే మహిళ ఈ సంఘాన్ని స్థాపించి తనతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పిస్తోంది. గతేడాది దాదాపు 6 వేల విగ్రహాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, ఎంజీసీలకు సరఫరా చేశామని, ఈసారి 10 వేల విగ్రహాలను తయారు చేయనున్నట్లు చెబుతోంది. ఈసారి వినాయక చవితి కోసం మూడు నెలల క్రితమే పనులు ప్రారంభించామని, విగ్రహాల తయారీ కూడా దాదాపు పూర్తయినట్లు వివరించింది. మట్టి విగ్రహాల తయారీ ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలని, సర్కారు బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తోంది. -
బుధుడి ఫొటో.. అతి సమీపం నుంచి!
సూర్యుడికి అతి సమీపంలో ఉన్న బుధగ్రహాన్ని నాసా ‘మెస్సెంజర్’ వ్యోమనౌక అతి సమీపం నుంచి తీసిన ఫొటో ఇది. ఈ వ్యోమనౌక తీసిన అన్ని ఫొటోల్లోనూ ఇదే అత్యంత స్పష్టమైనదట. చిత్రంలో కనిపిస్తున్నవి బుధగ్రహం ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన చిన్నచిన్న బిలాలు(క్రేటర్లు). గతంలో ఈ గ్రహాన్ని ఖగోళ వస్తువులు ఢీకొట్టినప్పుడు పెద్దపెద్ద బిలాలు ఏర్పడ్డాయని, ఆ సందర్భంగా పదార్థం లేదా ఖగోళ వస్తువుల ముక్కలు పక్కకు ఎగిరిపడటం వల్లే పక్కన ఈ చిన్నచిన్న బిలాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో పెద్ద బిలాలు కొన్ని వందల మీటర్లు, చిన్నవి పదుల మీటర్ల వైశాల్యంతో ఉన్నాయట. శుక్రవారం బుధగ్రహానికి 100 కిలోమీటర్ల సమీపంలోకి వెళ్లిన మెస్సెంజర్ ఈ చిత్రాన్ని తీసింది. ఈ ఫొటోను జూమ్‌చేసి 2 మీటర్ల బిలాలను కూడా స్పష్టంగా చూడొచ్చట. ఆగస్టు 19న ఇది బుధుడికి మరింత దగ్గరగా.. జస్ట్ 50 కిలోమీటర్ల సమీపంలోకే వెళ్లి ఫొటోలు తీయనుందట. 2004లో నింగికి ఎగిరి, 2011లో బుధుడి కక్ష్యను చేరిన ఈ వ్యోమనౌక వచ్చే ఏడాది మార్చివరకూ పనిచేయనుందట.‘మెస్సెంజర్’