కార్తీక్ సుబ్బరాజ్
‘‘రెండు రోజుల్లో జరిగే కథే ‘మెర్క్యూరీ’. ‘పుష్పక విమానం’ తర్వాత సైలెంట్ ఫిల్మ్ రాలేదు. ఈ చిత్రంలో కొత్త ప్రభుదేవాని చూస్తారు. ప్రేక్షకులు మా సినిమాని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అన్నారు. ప్రభుదేవా ముఖ్య పాత్రలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెర్క్యూరీ’. స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ సమర్పణలో కార్తికేయన్, సంతానం, జయంతి లాల్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ– ‘‘మనకు మొదట్లో సైలెంట్ ఫిల్మ్స్ మాత్రమే ఉండేవి.
ఆ తర్వాత టాకీ సినిమా వచ్చింది. సైలెంట్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మెర్క్యూరీ’. డైలాగ్స్ చాలా తక్కువగా ఉండే సినిమా తీయాలని దర్శకుణ్ణి అయిన కొత్తలో అనుకున్నా. అది ఈ చిత్రంతో నెరవేరింది. ప్రభుదేవాగారు విలన్ పాత్రలో కనిపించనున్నారు. కథ విన్నప్పుడు డైలాగ్స్ లేకుండా వర్కవుట్ అవుతుందా? అని అడిగారు. ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాం. బంద్ ముగిసే వరకు తమిళనాడులో సినిమా రిలీజ్ చేయం. నా తర్వాతి సినిమా రజనీకాంత్ సార్‌తో చేస్తున్నా. రెండు మూడు నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment