బుధ గ్రహం మార్పువల్ల ఏ రాశుల వారికి లాభం..! | Horoscope 2022 These Zodiac Signs Get Yoga Due To Mercury Yoga | Sakshi
Sakshi News home page

బుధ గ్రహం మార్పువల్ల ఏ రాశుల వారికి లాభం..!

Published Tue, Apr 26 2022 10:02 AM | Last Updated on Thu, Apr 28 2022 12:33 PM

Horoscope 2022 These Zodiac Signs Get Yoga Due To Mercury Yoga - Sakshi

నవ గ్రహాలలో ప్రతీ గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటే, కొన్ని గ్రహాలు స్వల్ప వ్యవధిలోనే రాశి సంచారం జరుగుతూ ఉంటుంది. శని గ్రహం రెండున్నరేళ్లకు ఒకసారి వేరొక రాశిలోకి మారితే, గురుడు ఏడాదికి ఒకసారి వేరే స్థానంలోకి మారతాడు. బుధుడు ప్రతీ నెల రోజులకు ఒకసారి వేరొక స్థానంలోకి వెళుతుంటాయి. బుధుని వీక్షణ ఎప్పుడూ ఏడో స్థానంపై ఉంటుంది.

బుధ గ్రహం ఏప్రిల్‌25వ తేదీ(సోమవారం) వృషభంలోకి ప్రవేశించాడు. అప్పటివరకూ మేష రాశిలో ఉన్న బుధుడు..నెల రోజుల పాటు వృషభ సంచారం చేయనున్నాడు. ప్రధానంగా బుధ గ్రహం వ్యాపారం, తెలివితేటలకు కారకంగా భావిస్తారు. బుధుడి రాశి మార్పుతో కొన్ని రాశుల వారికి లాభం చేకూర్చనుంది. మరి బుధుడి సంచారం వల్ల ఏయే రాశుల వారికి మంచి జరుగుతుందో చూద్దాం. 

మేషం: ఈ రాశి నుంచి బుధుని సంచారం రెండోది. అంటే ద్వితీయ స్థానం. ఇది ధనస్థానంగా పేర్కొంటారు. బుధుడు మార్పు వలన ఈ రాశి వారు ఆకస్మిక ధనలాభాలు చూసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 

కర్కాటకం: ఈ రాశి వారికి బుధుడు లాభంలో ఉన్నాడు.  ఉద్యోగం, వ్యాపారాలు కలిసి వస్తాయి. తల్లిదండ్రులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సానుకూల ప్రభావం ఉంటుంది. 

సింహం:  ఈ రాశి వారికి బుధుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు దశమం స్థానంలో సంచరించడం యోగ కారకత్వం ఉంటుంది. ఈ రాశి వారు వ్యాపారాన్ని మరింతగా విస్తరించడమే కాకుండా లాభాలు కూడా చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు ముందుకు కదిలి వాటిలో సక్సెస్‌ కూడా పొందే అవకాశం ఉంది. 

పైన చెప్పింది బుధ గ్రహం అనుకూలంగా ఉన్న రాశులకు మాత్రమే. అలా అని మిగతా రాశులు బాలేదని కాదు. వేరే గ్రహాల ప్రభావంతో తక్కిన రాశులు ఫలితాలు ఆధారపడి ఉంటాయి. వేరే గ్రహాల వీక్షణ బాగున్న వాళ్లు మంచి ఫలితాల్ని చూస్తారు. 

(గ్రహ ఫలితాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించడం జరిగింది)

చదవండి👉: శని గ్రహం మార్పుతో వీరికి యోగం!

చదవండి👉🏻 గురుడు రాజయోగం ఇచ్చే రాశులు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement