అంచనాలు పెంచుతున్న మూకీ మూవీ టీజర్‌ | Mercury Movie Official Teaser Raise Hype On This Silent film | Sakshi
Sakshi News home page

అంచనాలు పెంచుతున్న మూకీ మూవీ టీజర్‌

Published Wed, Mar 7 2018 4:50 PM | Last Updated on Wed, Mar 7 2018 4:50 PM

Mercury Movie Official Teaser Raise Hype On This Silent film - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డాన్సింగ్‌ స్టార్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్క్యూరి టీజర్‌ తాజాగా విడుదలైంది. టాలీవుడ్‌ యంగ్‌ హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా లాంచ్‌ అయిన ఈ టీజర్‌కు సోషల్‌ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ఎలాంటి సంభాషణలు లేకుండా మూకీ మూవీ కావడంతో ఈ సైలెంట్‌ థ్రిల్లర్‌పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. గతంలో కమల్‌ హాసన్‌ హీరోగా సింగీతం శ్రీనివాస్‌ తెరకెక్కించిన పుష్పక విమానం మూవీ తరహాలోనే ‘మెర్క్యూరి’ మూవీలో పాత్రలు మాట్లాడవు. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తోనే మూవీ కొనసాగనుంది.

ఇంతవరకూ డైలాగ్స్‌, సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను దర్శకులు భయపెట్టారు. కానీ ఇందులో ప్రభుదేవా లుక్‌ చూశాక.. డైలాగ్స్‌ లేని సైలెంట్‌ థ్రిల్లర్‌ను కేవలం ఆ నటీనటుల హావభావాలతో ఎంజాయ్‌ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యంగ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో సైలెంట్‌ థ్రిల్లర్‌గా మెర్క్యూరి తెరకెక్కింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సైలెంట్‌ హార్రర్‌ థ్రిల్లర్‌ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. సంతోష్‌ నారాయణ్ సంగీతం మూవీకి ప్లస్‌ పాయింట్‌గా కనిపిస్తోంది. మెర్క్యూరి ఈ ఏప్రిల్‌ 13న విడుదలకు సిద్ధంగా ఉంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement