Silent film
-
ఉఫ్...
‘పిల్ల జమిందార్, భాగమతి’ సినిమాలతో ఆకట్టుకున్నారు దర్శకుడు అశోక్ .జి. ప్రస్తుతం ‘భాగమతి’ చిత్రాన్ని హిందీలో ‘దుర్గావతి’గా రీమేక్ చేస్తున్నారాయన. అనుష్క పోషించిన పాత్రను ఈ రీమేక్‌లో భూమీ ఫెడ్నేకర్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ రీమేక్ తర్వాతి చిత్రాన్ని కూడా హిందీలోనే తెరకెక్కించనున్నారట అశోక్. మూకీ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఉఫ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని సమాచారం. సోహమ్ షా, నుష్రత్, ఓంకార్ కపూర్, నోరా ఫతేహీ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం తెరకెక్కనున్న వెబ్ ఫిల్మ్ ఇదని బాలీవుడ్ టాక్. జనవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలిసింది. -
‘సైలెంట్’ సినిమాలో అనుష్క
ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన స్టార్ రైటర్ కోన వెంకట్ ఇటీవల నిర్మాతగానూ మంచి విజయాలు సాధిస్తున్నారు. తాజాగా ఈయన నిర్మాణ సారధ్యంలో మరో సినిమాను ప్రకటించారు. బహు భాషా నటుడు మాధవన్, సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్కల కాంబినేషన్లో కోన వెంకట్ సహ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుంది. సైలెంట్ పేరుతో సైలెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించనున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమాల్లో నటించిన మాధవన్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కనున్న సైలెంట్ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నారు. భాగమతి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్లో అలరించనున్నారు. ఈ సినిమాకు వస్తాడు నా రాజు సినిమాకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నారు. పలువురు అంతర్జాతీయ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అంచనాలు పెంచుతున్న మూకీ మూవీ టీజర్
సాక్షి, హైదరాబాద్: డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్క్యూరి టీజర్ తాజాగా విడుదలైంది. టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ఎలాంటి సంభాషణలు లేకుండా మూకీ మూవీ కావడంతో ఈ సైలెంట్ థ్రిల్లర్‌పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. గతంలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన పుష్పక విమానం మూవీ తరహాలోనే ‘మెర్క్యూరి’ మూవీలో పాత్రలు మాట్లాడవు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే మూవీ కొనసాగనుంది. ఇంతవరకూ డైలాగ్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను దర్శకులు భయపెట్టారు. కానీ ఇందులో ప్రభుదేవా లుక్ చూశాక.. డైలాగ్స్ లేని సైలెంట్ థ్రిల్లర్‌ను కేవలం ఆ నటీనటుల హావభావాలతో ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సైలెంట్ థ్రిల్లర్‌గా మెర్క్యూరి తెరకెక్కింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సైలెంట్ హార్రర్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సంతోష్ నారాయణ్ సంగీతం మూవీకి ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. మెర్క్యూరి ఈ ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. -
ప్రభుదేవా మూకీ సినిమా ‘మెర్క్యూరి’
డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్క్యూరి. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సైలెంట్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన పుష్పక విమానం సినిమా తరహాలోనే ఈ సినిమాలోని పాత్రలు కూడా మాట్లాడవని తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
మళ్లీ తెరపైకి పద్య హరిశ్చంద్ర
అప్పుడెప్పుడో 1913లో దాదాసాహెబ్ ఫాల్కే హరిశ్చంద్రుడి కథను ‘రాజా హరిశ్చంద్ర’గా తెరకెక్కించారు. అది మూకీ చిత్రం. టాకీలు వచ్చిన తర్వాత కూడా హరిశ్చంద్రుడి కథ దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ తెరకెక్కింది. దాదాపు యాభయ్యేళ్ల కిందట తెలుగులో ఎన్టీఆర్ నటించిన ‘సత్య హరిశ్చంద్ర’ ప్రేక్షకాదరణ పొందింది. అంతకంటే ముందు ‘సత్యహరిశ్చంద్ర’ పద్యనాటకం తెలుగునాట ప్రఖ్యాతి పొందింది. మళ్లీ ఇన్నాళ్లకు ‘సత్య హరిశ్చంద్ర’ తెలుగులో సినిమాగా రూపొందింది. తాజాగా రూపొందిన ‘సత్య హరిశ్చంద్ర’ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తిగా పద్యనాటకం ఆధారంగానే ఈ సినిమాను రూపొందించారు. రంగస్థల నటీనటులతోనే తెరకెక్కించిన ఈ చిత్రంలో డబ్బింగ్, ప్లేబ్యాక్ వంటివేమీ లేవు. ఇందులో ప్రధానమైన హరిశ్చంద్ర పాత్రను ఒక మహిళ పోషించడం విశేషం. హైటెక్ కాలంలో ‘సత్యహరిశ్చంద్ర’ పద్యనాటకాన్ని సినిమాగా ఎందుకు రూపొందించారనే దానిపై ఈ చిత్ర బృందం అభిప్రాయాలు వారి మాటల్లోనే... ఆదరిస్తారనే నమ్మకం ఉంది సంస్కృతీ సంప్రదాయాలను కొత్త తరానికి చేరువ చేయడానికి సినిమాను మించిన సాధనం లేదు. అందుకే పద్యనాటకాన్ని కొత్త తరానికి పరిచయం చేసేందుకే ఈ సినిమా తీశాం. దీనిని ప్రేక్షకులు ఆదరిస్తారనే భావిస్తున్నా. ‘సత్య హరిశ్చంద్ర’ నాటక ప్రదర్శనను తిలకిస్తే అంతా సుభిక్షంగా ఉంటుందనే నమ్మకం ఉంది. అందుకే ఇప్పటికీ ఊళ్లలోనూ ఈ నాటక ప్రదర్శనను ఏర్పాటు చేయిస్తుంటారు. చిన్న చిన్న ఇబ్బందులు పడ్డా, సాంకేతిక నిపుణులు, నటీనటులు సహకరించడంతో నిర్మాణాన్ని విజయవంతంగానే పూర్తిచేయగలిగాం. - కొత్తపల్లి సీతారాము, నిర్మాత నేటి తరం కోసమే.. ఇంగ్లిష్ మీడియం చదువుల ప్రభావంతో పిల్లలు మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వారిని నాటకం కంటే సినిమా ద్వారానే ఆకట్టుకోగలం అనిపించింది. అందుకే నైతిక విలువలను బోధించే ‘సత్య హరిశ్చంద్ర’ పద్యనాటకాన్ని సినిమాగా రూపొందించాలని సంకల్పించాం. మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మందరాడ. యాభయ్యేళ్లకు పైగా నాటకాలు వేస్తున్నా. తొలిసారిగా సినిమాను తెరకెక్కించడం కొత్త అనుభవం. నాకు పేరు తెచ్చిన నక్షత్రకుడి పాత్రే ఇందులోనూ చేశా. - వై.గోపాలరావు, దర్శకుడు ఆ పాత్రలో రెండువేల సార్లు... రంగస్థలంపై ‘సత్య హరిశ్చంద్ర’ నాటకాన్ని దాదాపు రెండువేల సార్లు ప్రదర్శించాను. హరిశ్చంద్ర పాత్రతోనే నాకు పేరు వచ్చింది. అలాగే ‘గయోపాఖ్యానం’లో అర్జునుడి పాత్ర కూడా... మాది విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామం. ఏడో తరగతి చదువుకుంటున్నప్పటి నుంచి నాటకాల్లో నటించడం ప్రారంభించాను. పౌరాణిక నాటకాలకు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోను, రాయలసీమ ప్రాంతంలోనూ ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. మిగిలిన ప్రాంతాల్లో కొంత ఆదరణ తగ్గింది. - కె.మంగాదేవి, నటి