ఉఫ్‌... | Director G Ashok next movie UFF | Sakshi
Sakshi News home page

ఉఫ్‌...

Published Fri, Oct 23 2020 12:07 AM | Last Updated on Fri, Oct 23 2020 12:07 AM

Director G Ashok next movie UFF - Sakshi

దర్శకుడు అశోక్‌

‘పిల్ల జమిందార్, భాగమతి’ సినిమాలతో ఆకట్టుకున్నారు దర్శకుడు అశోక్‌ .జి. ప్రస్తుతం ‘భాగమతి’ చిత్రాన్ని హిందీలో ‘దుర్గావతి’గా రీమేక్‌ చేస్తున్నారాయన. అనుష్క పోషించిన పాత్రను ఈ రీమేక్‌లో భూమీ ఫెడ్నేకర్‌ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ రీమేక్‌ తర్వాతి చిత్రాన్ని కూడా హిందీలోనే తెరకెక్కించనున్నారట అశోక్‌. మూకీ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఉఫ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారని సమాచారం. సోహమ్‌ షా, నుష్రత్, ఓంకార్‌ కపూర్, నోరా ఫతేహీ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం తెరకెక్కనున్న వెబ్‌ ఫిల్మ్‌ ఇదని బాలీవుడ్‌ టాక్‌. జనవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement