ప్రభాస్‌తో డ్యాన్స్‌ చేసిన బ్యూటీ.. గుర్తుపట్టారా? | Nora Fatehi Major Throwback Photo, Did You Recognise Her? | Sakshi
Sakshi News home page

ఫేమస్‌ డ్యాన్సర్‌.. ప్రభాస్‌, తారక్‌తో డ్యాన్స్‌ చేసిన బ్యూటీ.. ఎవరంటే?

Published Wed, Sep 11 2024 8:20 PM | Last Updated on Wed, Sep 11 2024 8:42 PM

Nora Fatehi Major Throwback Photo, Did You Recognise Her?

ఈ ఫోటోలో డార్లింగ్‌ ప్రభాస్‌తో కలిసి డ్యాన్స్‌ చేసిన బ్యూటీ ఉంది. ఇప్పుడామె డ్యాన్స్‌ ఐకాన్‌గా మారింది. తనెవరో కాదు, డ్యాన్సర్‌ నోరా ఫతేహి. ఈ ఫోటోలో ఆమె ఎక్కడుందో గుర్తుపట్టారా? ఎడమ నుంచి మొదటి వ్యక్తి నోరా.

డ్యాన్స్‌ నేర్పించా..
తాజాగా ఈ ఫోటోను నోరా ఫతేహి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇది పదిహేడేళ్ల వయసులో స్కూల్‌ ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటో అని పేర్కొంది. స్టేజీపై డ్యాన్స్‌ చేయడానికి ముందు దిగిన ఫోటో అని తెలియజేసింది. నాకన్నీ తెలుసన్నట్లుగా నా స్నేహితురాళ్లకు డ్యాన్స్‌ నేర్పించాను. మేమంతా కలిసి కొన్నివారాలపాటు రిహార్సల్స్‌ చేశాం. 

కొన్ని ఎప్పటికీ మారవు
ఇదిగో ఫోటోలో ఉన్న అవుట్‌ఫిట్స్‌ ధరించాం. మా స్కూల్‌లో అందరి ముందు డ్యాన్స్‌ చేశాం.. కొన్ని పాటలకైతే బెల్లీ డ్యాన్స్‌ కూడా చేశాం. కొన్ని ఎప్పటికీ మారవు అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. నోరా చాలా క్యూట్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోకముందు కూడా ఈ బ్యూటీ అందంగా ఉందని చెప్తున్నారు. 

ఈ స్కూల్‌ గర్ల్‌ ఇప్పుడు డ్యాన్స్‌ ఐకాన్‌
ఇది చూసిన నోరా ఫ్యాన్స్‌.. చిన్నప్పుడు, ఇప్పుడు మీరందరూ ఒకేలా ఉన్నారా? తనూ అంతే! అని వెనకేసుకొస్తున్నారు. నటుడు కరణ్‌ సింగ్‌ చాబ్రా అయితే.. అప్పటి స్కూల్‌ గర్ల్‌ ఇప్పుడు గ్లోబల్‌ డ్యాన్స్‌ ఐకాన్‌ అని ప్రశంసించాడు. కాగా నోరా ఫతేహి.. ప్రభాస్‌ బాహుబలి మూవీలో మనోహరి సాంగ్‌తో తెలుగునాట ఫేమస్‌ అయింది. ఈ ఒక్కటే కాకుండా టెంపర్‌, కిక్‌ 2,లోఫర్‌, ఊపిరి చిత్రాల్లోనూ ఐటం సాంగ్స్‌లో మెరిసింది.

 

 

చదవండి: తడిబట్టలతో అబ్బాయిల ముందు సోనియా! మళ్లీ విష్ణుప్రియకు నీతి సూక్తులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement