Director Ashok
-
రీమేక్ సినిమాకు ఓ ప్లస్ ఉంది
‘‘ఎవరైనా వాళ్ల సినిమాను ప్రేక్షకులకు థియేటర్స్‌లోనే చూపించాలనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో విడుదల తప్పనిసరి అయింది’’ అన్నారు దర్శకుడు జి. అశోక్. అనుష్క ముఖ్య పాత్రలో అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. అశోక్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ‘దుర్గామతి’ టైటిల్‌తో హిందీలో రీమేక్ అయింది. భూమి పెడ్నేకర్ ముఖ్య పాత్ర చేశారు. అక్షయ్ కుమార్ ఓ నిర్మాత. డిసెంబర్ 11 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా అశోక్ చెప్పిన విశేషాలు. ► ఓ పెద్ద హీరోతో హిందీ సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు ‘భాగమతి’ రీమేక్ కోసం హిందీ నిర్మాతలు నన్ను కలిశారు. అప్పటికే సినిమా రిలీజ్ అయిపోయి ఏడాది దాటడంతో ఇప్పుడు రీమేక్ చేస్తే చూస్తారా? అనుకున్నాను. రీమేక్ చేయాలని, నేనే చేయాలని నిర్మాతలు అడిగారు. అప్పటికే అక్షయ్ కుమార్‌గారు ఈ సినిమా రీమేక్‌ని నిర్మించే ఆలోచనలో ఉన్నారు. రీమేక్ సినిమాకు ఓ ప్లస్ ఉంది. ఒరిజినల్లో మనం సరిగ్గా చెప్పలేదు అనుకున్న సీన్లను ఇంకా బాగా చెప్పొచ్చు ► దర్శకుడిగా నాకు ఏది కావాలంటే అది ఎంపిక చేసుకునే స్వేచ్ఛని ఇచ్చారు. భూమి పెడ్నేకర్ ఈ పాత్రకు కరెక్ట్‌గా సరిపోతుందనుకున్నాం. చాలా బాగా చేసింది. ఈ పాత్రకు న్యాయం చేసింది. లాక్డౌన్ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. లాక్డౌన్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేశాం. షూటింగ్ కంటే నిర్మాణానంతర కార్యక్రమాలు చాలా కష్టం అయ్యాయి. లాక్డౌన్ సమయంలో టెక్నీషియన్లు బయటకు రావడానికి కాస్త భయపడ్డారు. ► ఈ సినిమా థియేటర్స్ కోసం చేశాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఇంట్లోనూ వీలైనంత ఆస్వాదించేలా ఈ సినిమాను రెడీ చేశాం. ‘సినిమా బుల్లెట్లా పరిగెడుతోంది. చాలా బావుంది’ అని చూసిన తర్వాత అక్షయ్ కుమార్‌గారు అన్నారు. ► హన్సికతో ఓ వెబ్ సిరీస్ పూర్తి చేశాను. అదీ అమెజాన్‌లో త్వరలోనే విడుదల కానుంది. అలానే ఓ రెండు హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఒక సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. తమిళంలోనూ ఓ పెద్ద హీరోతో కథా చర్చలు జరుగుతున్నాయి. -
ఉఫ్...
‘పిల్ల జమిందార్, భాగమతి’ సినిమాలతో ఆకట్టుకున్నారు దర్శకుడు అశోక్ .జి. ప్రస్తుతం ‘భాగమతి’ చిత్రాన్ని హిందీలో ‘దుర్గావతి’గా రీమేక్ చేస్తున్నారాయన. అనుష్క పోషించిన పాత్రను ఈ రీమేక్‌లో భూమీ ఫెడ్నేకర్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ రీమేక్ తర్వాతి చిత్రాన్ని కూడా హిందీలోనే తెరకెక్కించనున్నారట అశోక్. మూకీ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఉఫ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని సమాచారం. సోహమ్ షా, నుష్రత్, ఓంకార్ కపూర్, నోరా ఫతేహీ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం తెరకెక్కనున్న వెబ్ ఫిల్మ్ ఇదని బాలీవుడ్ టాక్. జనవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలిసింది. -
భాగమతి బాగుందంటున్నారు
‘‘నాకు అవసరమైన టైమ్‌లో ‘భాగమతి’ సినిమా రూపంలో బిగ్ సక్సెస్ రావడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ వర్క్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. అనుష్క యాక్టింగ్ సూపర్’’ అన్నారు దర్శ కుడు అశోక్. అనుష్క లీడ్ రోల్లో ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘భాగమతి’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ– ‘‘మనిషి మెదడును మించిన దెయ్యం ఉందా? లేదా మనిషి తెలివితేటలకు మించిన దెయ్యం ఉందా? అన్న ప్రశ్నలను రైజ్ చేస్తూ చేసిన సినిమా ‘భాగమతి’. సినిమాలో భయం అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. అంతకు మించిన ట్విస్ట్ సినిమాలో ఉందని ముందే చెప్పాం. అనుç ష్కను మా ఇంటి అమ్మాయి అని ప్రేక్షకులు మరోసారి దగ్గరకు తీసుకుని మంచి హిట్ అందించారు. కథ విని భాగమతి బంగ్లా ఇలా ఉండబోతుంది సార్ అని చూపించినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. ‘భాగమతి బంగ్లా’ అనే క్యారెక్టర్‌ను సూపర్‌గా ఫెర్ఫార్మ్ చేయించిన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌కి కృతజ్ఞతలు. తమన్‌తో పాటుగా టీమ్ అందరూ చాలా శ్రమపడ్డారు. మార్నింగ్ షో నుంచే ‘భాగమతి’ సినిమాకు మంచి టాక్ తెచ్చుకుంది. తమిళనాడు, కేరళ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి రివ్యూస్ అండ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. పైరసీని ప్రోత్సహించకండి’’ అన్నారు. ‘‘టెక్నీషియన్స్‌కు మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. అనుకున్న టైమ్‌లోనే సెట్‌ను కంప్లీట్ చేయగలిగాం. ‘భాగమతి’ టీమ్ తరఫున ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. -
ఆమె లేకపోతే భాగమతి లేదు
‘‘భాగమతి’ కథను 2012లో యూవీ క్రియేషన్స్ వారికి చెప్పాను. తర్వాత ప్రభాస్‌కి వినిపించాను. ఆ తర్వాత అనుష్కకి చెప్పా. అందరికీ కథ నచ్చడంతో చేద్దామని డిసైడ్ అయ్యాం. అలా ఈ ప్రాజెక్ట్ కుదిరింది’’ అని దర్శకుడు జి.అశోక్ అన్నారు. అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘భాగమతి’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశోక్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► ఇదొక యూనివర్శల్ సబ్జెక్ట్. ఏ నేపథ్యానికైనా సరిపోతుంది. కోలీవుడ్.. మాలీవుడ్.. బాలీవుడ్... ఇలా ఏ ఇండస్ట్రీలో చేసినా హిట్టవుతుంది. ఇందులో కథ ప్రతి చోటా జరిగేదే.. అందరికీ పరిచయమైనదే. ► ‘బాహుబలి’ మొదటి పార్ట్ షూటింగ్‌కు వెళ్లకముందే అనుష్క ‘భాగమతి’ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. అయితే.. ‘బాహుబలి’ కమిట్మెంట్ వల్ల చాలా రోజులు ఆగాల్సి వచ్చింది. మధ్యలో రెండు సార్లు ‘భాగమతి’ మొదలుపెడదామని ప్రయత్నించినా కుదరలేదు. ► ‘భాగమతి’ పాట్రన్ క్యారీ చేయాలంటే ఒక స్టేచర్ ఉండాలి. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండాలి. అవి రెండూ అనుష్కలో కనిపించాయి. అందుకే.. ఆమె తప్ప ఈ కథకి ఎవరూ న్యాయం చేయలేరనే ఇన్నేళ్లు ఆగాను. ఆమె లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు అనుష్క. ఎడమ చేతి భుజానికైన గాయం బాధపెడుతున్నా, డస్ట్ ఎలర్జీ ఉన్నా లెక్కచేయకుండా షూటింగ్లో పాల్గొన్నారు. ► ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా కాదు. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ఈ సినిమాకు అదే బలం. ఈ చిత్రంలోని బంగ్లా సెట్ కూడా కథలో ఒక క్యారెక్టర్. కథ దాని చుట్టూ తిరుగుతుంది. తొలుత నార్మల్‌గా వేద్దామనుకున్నాం. అది సరిపోదని భారీగా వేశాం. 75 శాతం సినిమా కోట సెట్లోనే జరుగుతుంది. ► ప్రస్తుతానికి నా దృష్టంతా ‘భాగమతి’ పైనే ఉంది. అందుకే ఇంకా కొత్త ప్రాజెక్టులేవీ అనుకోలేదు. ‘భాగమతి’ విడుదల తర్వాత ప్రమోషన్స్‌లో పాల్గొనాలి. అన్నీ పూర్తయ్యాక తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తా. -
"దర్శకుడు" పాట విడుదల
అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన సినిమా ‘దర్శకుడు’. ఇందులోని ‘సండే టు సాటర్డే లవ్..’ అనే పాటను సమంత విడుదల చేశారు. సాయికార్తీక్ స్వరపరిచిన పాటల్ని ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు.