రవిందర్, అశోక్
‘‘నాకు అవసరమైన టైమ్‌లో ‘భాగమతి’ సినిమా రూపంలో బిగ్ సక్సెస్ రావడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ వర్క్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. అనుష్క యాక్టింగ్ సూపర్’’ అన్నారు దర్శ కుడు అశోక్. అనుష్క లీడ్ రోల్‌లో ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘భాగమతి’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుందని చిత్రబృందం పేర్కొంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ– ‘‘మనిషి మెదడును మించిన దెయ్యం ఉందా? లేదా మనిషి తెలివితేటలకు మించిన దెయ్యం ఉందా? అన్న ప్రశ్నలను రైజ్ చేస్తూ చేసిన సినిమా ‘భాగమతి’. సినిమాలో భయం అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. అంతకు మించిన ట్విస్ట్ సినిమాలో ఉందని ముందే చెప్పాం. అనుç ష్కను మా ఇంటి అమ్మాయి అని ప్రేక్షకులు మరోసారి దగ్గరకు తీసుకుని మంచి హిట్ అందించారు. కథ విని భాగమతి బంగ్లా ఇలా ఉండబోతుంది సార్ అని చూపించినప్పుడు కన్నీళ్లు ఆగలేదు.
‘భాగమతి బంగ్లా’ అనే క్యారెక్టర్‌ను సూపర్‌గా ఫెర్ఫార్మ్ చేయించిన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌కి కృతజ్ఞతలు. తమన్‌తో పాటుగా టీమ్ అందరూ చాలా శ్రమపడ్డారు. మార్నింగ్ షో నుంచే ‘భాగమతి’ సినిమాకు మంచి టాక్ తెచ్చుకుంది. తమిళనాడు, కేరళ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి రివ్యూస్ అండ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. పైరసీని ప్రోత్సహించకండి’’ అన్నారు. ‘‘టెక్నీషియన్స్‌కు మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. అనుకున్న టైమ్‌లోనే సెట్‌ను కంప్లీట్ చేయగలిగాం. ‘భాగమతి’ టీమ్ తరఫున ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్.
Comments
Please login to add a commentAdd a comment