ఆయనతో నో ప్రాబ్లం | with him No Problem | Sakshi
Sakshi News home page

ఆయనతో నో ప్రాబ్లం

Published Wed, Feb 3 2016 4:05 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

ఆయనతో నో ప్రాబ్లం

ఆయనతో నో ప్రాబ్లం

నటుడు విజయ్‌సేతుపతితో నటించడం నాకేప్పుడూ కంఫర్టబులే అంటోంది నటి రమ్యానంబీశన్. బహుభాషా నటి అయిన ఈ కేరళకుట్టి తమిళంతో పాటు మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలోనూ తన ముద్రను వేసుకుంది. అయితే తమిళంలో ప్రముఖ హీరోయిన్ స్థానం కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. అవకాశాలు కూడా అడపాదడపానే అందుతున్నాయి. అవీ వర్ధమాన కథానాయకులతోనే అన్నది గమనార్హం. తాను కంఫర్టబుల్ జోన్‌లోనే పాత్రలను ఎంపిక చేసుకుంటున్నానంటున్న రమ్యానంబీశన్ తాజాగా విజయ్‌సేతుపతికి జంటగా సేతుపతి అనే చిత్రంలో నటిస్తోంది.

విషయం ఏమిటంటే ఇంతకు ముందు ఈ జంట పిజ్జా అనే హిట్ చిత్రంలో నటించారు. ఆ తరువాత మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం సేతుపతినే. రమ్యానంబీశన్ మాట్లాడుతూ సేతుపతి చిత్రంలో తాను చిత్ర కళాకారిణిగా నటిస్తున్నానంది.  ఇదే కాదు మలయాళం, కన్నడం భాషల్లోనూ ప్రస్తుతం తాను కంఫర్టబుల్ జోన్‌లోనే పాత్రలను ఎంపిక చేసుకుంటున్నానని చెప్పింది.  విజయ్‌సేతుపతి గురించి చెప్పాలంటే పిజ్జా చిత్రం తరువాత మళ్లీ ఇప్పుడే ఆయన్ని కలిశానని తెలిపింది. ప్రస్తుతం విజయ్‌సేతుపతి ఎదుగుతున్న హీరో అనీ అయినా ఆయనలో ఎలాంటి మార్పు లేదని అంది. విజయ్‌సేతుపతితో నటించడం తనకెప్పుడూ కంఫర్టబులేనని రమ్యానంబీశన్ వ్యాఖ్యానించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement