సేతుపతి, రమ్యానంబీశన్ జతగా మరో చిత్రం | Vijay Sethupathi, Ramya Nambeesan together | Sakshi
Sakshi News home page

సేతుపతి, రమ్యానంబీశన్ జతగా మరో చిత్రం

Published Sun, Aug 23 2015 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

సేతుపతి, రమ్యానంబీశన్ జతగా మరో చిత్రం

సేతుపతి, రమ్యానంబీశన్ జతగా మరో చిత్రం

కొన్ని జంటలు ఒక్క చిత్రంలో నటించినా హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో విజయ్ సేతుపతి, రమ్యా నంబీశన్ జంట ఒకటి. వీరిని పిజ్జా చిత్రం కలిపింది. అది ఆ ఇద్దరికి లైఫ్‌లో గుర్తుండిపోయే చిత్రంగా మిగిలిపోయింది. ఆ తరువాతే ఎవరి అవకాశాలను వారు సద్వినియోగం చేసుకుంటూ వస్తున్న విజయ్ సేతుపతి, రమ్యా నంబీశన్ తాజాగా మరోసారి కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు.
 
 తమిళంలో అడపా దడపా అవకాశాల్ని అందుకుంటున్న మలయాళ కుట్టి రమ్యా నంబీశన్ ఇటీవల నాలు పోలీసు నల్లా ఇరుంద ఊరు చిత్రంలో అరుళ్‌నిధితో నటించారు. ఆ తరువాత నటించే తమిళ చిత్రం విజయ్ సేతుపతితోనే అవుతుంది. ఇంతకుముందు విజయ్ సేతుపతి హీరోగా పణై్నయారుమ్ పద్మినియుమ్ వంటి విభిన్న విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
 
 ఇందులో విజయ్ సేతుపతి పోలీసు అధికారిగా నటించనున్నారు. ఇది పోలీసులు ఎదుర్కొనే సమస్యల ఇతివృత్తంగా ఉంటుందట. రమ్యానంబీశన్‌ది హీరోకు దీటుగా ఉండే పాత్ర అని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. మదురై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ పాత్ర నిజాయితీ ధైర్య సాహసాలతో సహజత్వానికి దగ్గరగా ఉంటుందట. వచ్చే నెలలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. దీనికి సేతుపతి అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. రచయిత వేల రామమూర్తి ముఖ్యపాత్రను పోషించనున్న ఈ చిత్రానికి తెగిడి చిత్రం ఫేమ్ నివాస్ కె.ప్రసన్న సంగీత బాణీలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement