రెజీనా
రెజీనా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చెన్నైకి చెందిన రెజీనా కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌లోనే మంచి పేరు తెచ్చుకుంది. మొదట్లో పలు టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆ తరువాత వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. ఆపై రెజీనా కోలీవుడ్ తెరకు పరిచయమైంది. కండనాళ్ మొదల్ చిత్రంతో హీరోయిన్‌గా 2012 తెరపైకి వచ్చిన రెజీనా ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందినా, ఆ తరువాత నటించిన చిత్రాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టిసారించి వరుసగా అవకాశాలను చేజిక్కించుకుంటోంది. అయితే కోలీవుడ్‌లో ఆ మధ్య నటించిన మానగరం చిత్రం ఈ అమ్మడి ఖాతాలో హిట్‌గా నిలిచింది. దీంతో ఇక్కడ అవకాశాలు తలుపు తడుతున్నాయి.
ప్రస్తుతం రెజీనా చేతిలో తమిళం, తెలుగు కలిపి అరడజను చిత్రాల వరకూ ఉన్నాయి. వీటిలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన నెజైమరప్పదిల్లై, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. రెజీనా మాత్రం టాలీవుడ్‌కే అధిక ప్రాముఖ్యత ఇస్తోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. కారణం తెలుగు చిత్రాల ద్వారా బాలీవుడ్‌కు వెళ్లాలనే ఆశతో ఉన్నట్లు సమాచారం.
అయితే మరో వైపు రెజీనా ప్రేమలో మునిగి తేలుతోందని చెబుతున్నారు. ఒక టాలీవుడ్ యువ నటుడితో పరిచయం ప్రేమగా మారిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని రెజీనా ఖండిస్తోంది. తానెవరినీ ప్రేమించడం లేదని, అసలు ప్రస్తుతానికి ప్రేమించే సమయం, పెళ్లి చేసుకునే ఆలోచన లేవని అంటోంది. అయితే ప్రేమలో పడ్డ చాలా మంది చెప్పే కబుర్లనే రెజీనా చెబుతోందని, ఇలాంటి వారు సడన్‌గా పెళ్లికి సిద్ధం అవుతారని సినీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment