సినిమాని తలపించే ప్రేమకథ..వింటే కన్నీళ్లు ఆగవు..! | Couples Journey Ends As Nepali Influencer Bibek Pangeni Passes Away After Battle With Cancer, Video Inside | Sakshi
Sakshi News home page

అంతులేని ప్రేమకు నిదర్శనం ఆ జంట.. ! కన్నీళ్లు పెట్టించే ప్రేమ కథ..

Published Fri, Dec 20 2024 1:48 PM | Last Updated on Fri, Dec 20 2024 3:49 PM

Couples Journey Ends As Bibek Loses Battle With Cancer Goes Viral

ఎన్నో ప్రేమ కథలు చూశాం. వాటిలో కొన్ని మాత్రం విషాదంగా ముగిసిపోతే..మరికొన్ని కన్నీళ్లు తెప్పించేస్తాయి. అలాంటి భావోద్వేగపు గాథే ఈ ప్రేమ జంట కథ. 

సుఖాల్లో ఉన్నప్పుడు ఉండే ప్రేమ.. కష్టాల్లో కనుమరుగైపోతుందంటారు పెద్దలు. కానీ ఈ జంట మాత్రం కష్టాల్లో అంతకు మించి..ప్రేమ ఉందని ప్రూవ్‌ చేసింది. విధికే కన్నుకుట్టి వారి ప్రేమను పరీక్షించాలనుకుందో, కబళించాలనుకుందో గానీ కేన్సర్‌ మహమ్మారి వారి ప్రేమను దూరం చేయాలనుకుంది. కానీ ఈ నేపాలీ జంట తమ ప్రేమ అత్యంత గొప్పదని నిరూపించుకుని కష్టమే కుంగిపోయేలా చేశారు.

సృజన, బిబేక్‌ సుబేదిలు తమ జీవితాన్ని డాక్యుమెంట్‌ రూపంలో ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో ఒక్కసారిగా ఆ జంట ప్రేమకథ అందరి దృష్టిని ఆకర్షించింది. బిబేక్‌ కేన్సర్‌తో భాదపడుతున్నాడు. కేన్సర్‌ ఫస్ట్‌ స్టేజ్‌ నుంచి ఫోర్త్‌స్టేజ్‌ వరకు తామెలా కష్టాలు పడుతుంది తెలియజేసింది. 

చెప్పాలంటే నెటిజన్లంతా సృజన కోసమైనా.. అతడు మృత్యవుని జయిస్తే బావుండనని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. బిబేక్‌ ఆ మహమ్మారి కారణంగా తనకెంతో ఇష్టమైన భార్యను కూడా గుర్తించలేని స్థాయికి వచ్చేశాడు సృజన పోస్ట్‌ చేసిన చివరి రీల్‌లో. అంతేగాదు ఇన్‌స్టాలో బిబెక్‌ 32వ పుట్టిన రోజుని సెలబ్రెట్‌ చేసిన విధానం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఎందుకంటే అప్పటికే అతడి పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. 

ఏ పరిస్థితిలోనూ అతడి చేతిని వీడక ఎంతో ప్రేమగా చూసుకున్న సృజన తీరు అందరి మనసులను తాకింది. సృజన అధికారికంగా అతడు చనిపోయాడని ప్రకటించనప్పటికీ..నిశబ్ద వాతావరణంతో పరోక్షంగా బిబేక్‌ ఇక లేరనే విషయం వెల్లడించింది. 

డిసెంబర్‌ 1 నుంచి సృజన నుంచి ఎలాంటి వీడియో పోస్ట్‌ కాకపోయినా.. నెటిజన్లంతా సృజనకు ధైర్యం చెప్పడమేగాక, బిబేక్‌ లేకపోయినా.. మీప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇలాంటి కాలంలో ఇంత గొప్ప ప్రేమలు కూడా ఉన్నాయని చూపించారంటూ సృజనను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement