సాక్షి, తమిళ సినిమా: ప్రస్తుతం కాజల్ అగర్వాల్ అగ్రనటీమణుల్లో ఒకరని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. అయితే ఈ స్థాయికి రావడానికి కాజల్ పెద్ద పోరాటమే చేసింది. ఈ ఉత్తరాది బ్యూటీ నట జీవితం అపజయాలతోనే మొదలైంది. వాటిన్నిటిని అధిగమించి కృషి, ప్రతిభను నమ్ముకుని అగ్రనటిగా రాణిస్తోంది. కాయలున్న చెట్లకే దెబ్బలన్న చందాన కాజల్‌పై కొందరు అక్కసు వెళ్లగక్కుతున్నారట. కాజల్ తొలుత బాలీవుడ్ నటిగా 2004లో రంగప్రవేశం చేసింది. దక్షిణాదికి మాత్రం 2007లో పరిచయమైంది. లక్ష్మీకల్యాణం అంటూ టాలీవుడ్‌కు అడుగిడిన కాజల్‌కు ఆ చిత్రం సక్సెస్ అయినా అవకాశాలు పెద్దగా రాలేదనే చెప్పాలి. ఇక కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా చిత్రం బొమ్మలాట్టం చిత్రంలో రంగప్రవేశం చేసినా అదీ అసలు కాజల్ కెరీర్‌కు హెల్ప్ కాలేదు. ఇలా ఆదిలో అవకాశాల కోసం పోరాడి గెలిచిన నటి కాజల్.
ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న కాజల్ విజయ్ బాటలోనే పయనిస్తోంది. తెలుగులో మూడు చిత్రాలతో బిజీగా ఉన్న కాజల్ మార్కెట్‌ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందట. 32 రెండేళ్ల కాజల్‌అగర్వాలల్ పనైపోయిందని ఇక ఎక్కువ కాలం హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం కష్టం అని ఆమె పోటీ నటీమణులు తమ అనుచరులతో దుష్ప్రచారం చేయిస్తున్నారని సమాచారం. ఈ విషయం కాజల్ చెవిన పడడంతో తను ఎలా స్పందించిందో తెలుసా? ఎవరు ఎలాంటి ప్రచారం చేసుకుంటారో చేసుకోనివ్వండి. ఐ డోంట్ కేర్ అని చాలా లైట్‌గా తీసుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో ప్యారిస్ ప్యారిస్ చిత్రం ఒకటి. ఇది హిందీలో నటి కంగనారావత్ నటించి పలు అవార్డులను గలుచుకున్న క్వీన్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంతో తను పలు అవార్డులను అందుకుంటాననే నమ్మకాన్ని కాజల్ వ్యక్తం చేస్తోంది. ఇక నానీతో నటిస్తున్న ఎంఎల్‌ఏ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇక తమిళంలో అజిత్‌తో జత కట్టిన వివేగం, విజయ్‌తో రొమాన్స్ చేసిన మెర్శల్, అదే విధంగా తెలుగులో చిరంజీవితో నటించిన ఖైదీ నంబర్ 150, రానాకు జంటగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయన్నది తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment