ఫోటో చాన్సివ్వకుంటే ఆత్మాహుతి
ఈ సందర్భంగా ఆ సంఘ న్యాయసలహాదారు ఏ.ఎస్.రజని మాట్లాడుతూ.. రజీనీతో కలిసి ఫొటో తీసుకునేందుకు సేలం జిల్లాకు 250 నుంచి 300 టోకన్లు అందజేశారన్నారు. ఈ టోకన్లను జిల్లా రజనీ అభిమానుల సంఘం కార్యదర్శి పళనివేల్ తనకు కావాల్సిన వారికి విక్రయించారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంలో రజనీ జోక్యం చేసుకుని అసలైన అభిమానులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆయన ఇంటి ముందే ఆత్మాహుతికి పాల్పడతామని ఆయన వెల్లడించారు.