సినీరంగంలో వంచకులు ఉన్నమాట నిజమేనని.. అయితే అలాంటి వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారని హీరోయిన్ సమంత పేర్కొన్నారు. ఇటీవల కలకలం సృష్టిస్తున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సమంత మాట్లాడుతూ.. ఈ సంస్కృతి ఒక సినిమా రంగంలోనే కాక అన్ని రంగాల్లోనూ ఉందని సమంత అన్నారు. దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ఈ రంగంలో ఉన్నాను. ఇక్కడ మంచి వాళ్లు ఉన్నారు.. అయితే కొందరు నయవంచకులు కూడా ఉన్నారు.
అలాంటి వారిని తరిమేస్తే చిత్ర పరిశ్రమ అంత మంచిది మరొకటి ఉండదన్నారు. అయితే అలాంటి దుర్మార్గులను శిక్షించడానికి కొన్ని చట్టాలు రూపొందించారు.. ఇకపై అత్యాచారాలు జరగవని భావిస్తున్నాని సమంత పేర్కొన్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ బిజీగా ఉందని చెప్పవచ్చు. సమంత నటించిన రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రానున్నాయి. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన నడిగైయార్ తిలగం ఈ నెల 9న విడుదలకు సిద్ధం అవుతుంది. మరొకటి విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబుతిరై ఈ నెల 11న తెరపైకి వస్తోంది.
ఈ సందర్భంగా సమంత శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త డైరెక్టర్‌ల చిత్రాల్లో పనిచేయడానికి కాస్త సంకోచిస్తానన్నారు. ‘కానీ దర్శకుడు మిత్రన్‌తో ఇరుంబుతిరై చిత్రం చేస్తున్నప్పుడు ఆ విధమైన భావన కలగలేదు. కథ విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. మన జీవితాల్లో మనకు తెలియకుండానే ఇన్ని సమస్యలు ఇంటర్నెట్ మీడియా ద్వారా జరుగుతున్నాయా అని కంగు తిన్నాను. కథ విన్న తర్వాత సెల్‌ఫోన్ టచ్ చేయడానికే భయమేసింది. ఈ చిత్రంలోని సంఘటనలు నీ జీవితంలో జరగకపోయినా, నా స్నేహితురాళ్లకు ఎదురయ్యాయి. ఇరుంబుతిరై చిత్రానికి డబ్బంగ్ చేప్పడానికి నిరాకరించినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదు. చిత్ర పరిశ్రమ సమ్మె ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.. ఆ సమయంలో నడిగైయార్ తిలగం చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల డబ్బింగ్ చెప్పలేకపోయాను’ అని సమంత తెలిపారు.
ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం సమంతకు మంచి పేరు తెచ్చిన పెట్టిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో సమంత తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. కానీ, ఆ చిత్రంలో ముద్దు సన్నివేశంలో నటించడం చర్చనీయాంశంగా మారిందని ఆమె అన్నారు. అయితే తన కుటుంబ సభ్యులు ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని అండగా నిలిచారని ఈ బ్యూటీ పేర్కొన్నారు. నటులు రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.. వారిలో మీరు ఎవరికి ఓటు వేస్తారు? అని అడుగుతున్నారు. అయితే తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని సమంత చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment