సమంత నటన గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఎలాంటి పాత్రలోనైనా ఆమె ఒదిగిపోతుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ పాత్ర ఏదైనా..వన్స్ సామ్ చేతికి వచ్చిదంటే..ఇక అందులో వేరే హీరోయిన్‌ని ఊహించుకోలేం. సామ్‌లోని మరో కోణాన్ని బయటకు తీసిన సినిమా ఏదైనా ఉంటే అది రంగస్థలం అనే చెప్పాలి. అంతకు ముందు సమంత అలాంటి పాత్రను పోషించలేదు.
అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. రామ్ చరణ్ పాత్రతో పాటు సామ్ పాత్ర కూడా అందరికి గుర్తిండిపోతుంది. అయితే ఆ పాత్రకు మొదట సమంతను అనుకోలేదట దర్శకుడు సుకుమార్. చివరి నిమిషంలో ఆమెను తీసుకున్నాడట. కానీ షూటింగ్ సమయంలో సామ్ నటన చూసి సుక్కు ఆశ్చర్యపోయాడట. ఆ పాత్రకు సమంత తప్ప ఇంకెవరు న్యాయం చేయలేకపోయేవారని ఆయన అన్నారు.
ఇటీవల ఓ ఇంటర్యూలో ఆ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఆ పాత్రను ఆయనను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడు. కానీ సమంత పోషించిన లక్ష్మీ పాత్రను మాత్రం ఆమె కోసం రాయలేదు. ఒక కొత్త అమ్మాయిని పెట్టుకోవాలనుకున్నాం. సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు స్టార్స్ అయితే నేను సెట్‌లో మేనేజ్ చేయలేనేమో అనుకున్నా.
కానీ సినిమా స్క్రిప్ట్ ప్రకారం మంచి ఆర్టిస్ట్, తెలుగు వచ్చిన హీరోయిన్ కావాలి. సమంత అయితే పల్లెటూరి అమ్మాయి పాత్రకు సరిపోతుందని భావించి ఆమెను తీసుకున్నాం. షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రతి సీన్‌లోనూ ఆమె పలికించిన హావభావాలు అద్భుతం. నేను సినిమాలు తీసినంత కాలం సమంతతో చేస్తూనే ఉంటా’ అని సుకుమార్ సమంతను పొగడ్తలో ముంచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment