తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మెగా స్టార్ కేవలం తన సినీ జీవితాన్ని మాత్రమే కాదు మొత్తం ఫ్యామిలీ జీవితాన్ని కూడా సెట్ చేశాడనే చెప్పాలి. బాలీవుడ్‌లో కపూర్ ఖాన్దన్ ఫ్యామిలీ లాగానే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరంజీవి కుటుంబం అతి పెద్దది. మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పటికే పలువురు హీరోలు టాలీవుడ్‌లో జోరు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
సినిమాల్లోకి తమ అభిమాన హీరో కొడుకో.. కూతురో.. అల్లుడో... వస్తున్నారంటే అభిమానులు చాలా హ్యాపీ. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది చిరంజీవి కుటుంబం నుంచి సినీ పరిశ్రమలో ఉన్నారు. మెగాస్టార్ ప్యామిలీ నుంచి ఆయనతోపాటు, ఆయన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు, కుమారులు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లుళ్లు అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరణ్ తేజ్, కళ్యాణ్ దేవ్, కూతురు నిహారికలు ప్రస్తుతం పరిశ్రమలో ఉన్నారు. అయితే వీరిలో పవణ్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని టాప్ 10 లో నిలిచారు. వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించి అందరిని ఆకట్టుకుంటున్నారు.
అయితే గీతా ఆర్ట్స్ బానర్ మీద సినిమాలు నిర్మిస్తున్న పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ కూడా మెగా ఫ్యామిలీలో సభ్యుడే. అల్లు అరవింద్ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా, డిస్ట్ర్రిబ్యూటర్‌గా ఉన్నారు.
తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి ఆయన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరో ఎంట్రీ ఖరారైంది. అల్లుడు కూడా అభిమానులకు వారుసుడే కదా. ప్రస్తుతం కల్యాణ్ నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో మెలకువలు నేర్చుకుంటున్నారు. ‘జత కలిసె’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో రజని కొర్రపాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవికా నాయర్ కథానాయిక. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా త్వరలోనే హీరో అవతారం ఎత్తుతారని, ప్రస్తుతానికి యాక్టింగ్ క్లాస్‌లకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment