మెగాస్టార్ చిరంజీవి కాస్త మొన్నమధ్యే పద్మవిభూషణ్ అయ్యారు. కేంద్రం తాజాగా ప్రకటించిన పురస్కారాల్లో ఈయన పేరు రావడంతో అభిమానులు తెగ ఆనందపడ్డారు. ఈ అవార్డు వచ్చిన తర్వాత చిరు.. తొలిసారి ఓ ఈవెంట్‌కి హాజరయ్యారు. మెగాహీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది. అయితే మెగాస్టార్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ ఆయన చేతి వాచీ మాత్రం అందరినీ ఎట్రాక్ట్ చేసింది. దాని ధర ఎంతో తెలిస్తే మాత్రం మీకు గుండె జారిపోద్ది.
ఓ సాధారణ నటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి.. మెగాస్టార్ రేంజుకు వెళ్లిపోయారు. 150కి పైగా సినిమాలు చేసి కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు. అలానే చిరు దగ్గర కార్లు, వాచీల కలెక్షన్ కూడా బాగానే ఉంది. కోట్లాది రూపాయల విలువైన ఇందులో ఉన్నాయి. రోలెక్స్ వాచీల దగ్గర నుంచి బెంజ్ కార్ల వరకు చిరు దగ్గర ఉన్నాయి. చాలాసార్లు వాటి ఫొటోలు వైరలయ్యాయి.
(ఇదీ చదవండి: లావణ్యని ఇప్పటివరకు ఆ ప్రశ్న అడగలేదు: వరుణ్ తేజ్)
తాజాగా వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించిన చిరు.. ఏ.లాంజ్ & సోహ్నే అనే బ్రిటీష్ కంపెనీ చేతి గడియారంతో కనిపించారు. దీని ధర ఎంత అని ఆరా తీస్తే షాకింగ్ నంబర్స్ కనిపించాయి. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.50,56,747 అని తెలుస్తోంది. అంటే అరకోటి అనమాట. అదేదో సినిమాలో అన్నట్లు చిరు కట్టుకున్న ఈ వాచీ అమ్మితే బ్యాచ్ బ్యాచ్ సెటిలైపోవచ్చు!
చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాని డైరెక్టర్ వశిష్ట తీస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ తీస్తున్న ఈ మూవీ.. 2025 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు కూడా.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment