‘ధ్వని’ కాన్సెప్ట్ చాలా బాగుంది. పదేళ్ల కుర్రాడు లక్ష్మిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం అభినందించదగ్గ విషయం. చాలా మంది నూతన దర్శకుల కంటే లక్షిన్ బెటర్ గా ధ్వని షార్ట్ ఫిలిం ను తీశాడు’అని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు.
ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్ లో లక్షిన్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలిం ధ్వని. డెఫ్ అండ్ డంప్ కాన్సెప్ట్ ఈ షార్ట్ ఫిలిం రూపొందించబడింది. నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించిన ధ్వని షార్ట్ ఫిలింకు అశ్విన్ కురమన సంగీతం అందించారు. ధ్వని షార్ట్ ఫిలిం రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సంరద్భంగా బెల్లంకొండ సురేశ్‌మాట్లాడుతూ.. లక్ష్మిస్ ఈ లఘు చిత్రాన్ని చాలా బాగా తీశాడు. అబ్బాయి భవిష్యత్తులో మరిన్నిమంచి ప్రాజెక్ట్స్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ...లక్షిన్ తీసిన షార్ట్ ఫిలిం చాలా బాగుంది. ఈ వయసులో అబ్బాయి తీసిన విధానం ఎంతో బాగుంది. ధ్వని కసెప్ట్ తో పదకొండు నిమిషాల్లో అద్భుతంగా తెరకెక్కించారు’ అన్నారు.
డైరెక్టర్ లక్షిన్ మాట్లాడుతూ...నేను ధ్వని షార్ట్ ఫిలిం చెయ్యడానికి నన్ను ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ కు థాంక్స్. చిన్న కాన్సెప్ట్ తో తీసిన ఈ షార్ట్ ఫిలిం కు అందరి నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దర్శకుడిగా మంచి సినిమాలు చెయ్యాలి అనేది నా కోరిక. భవిషత్తులో నా పేవరేట్ హీరో అల్లు అర్జున్ తో మూవీ చేయాలనేది నా డ్రీమ్ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment