bellam konda suresh
-
ధ్వని.. ది బెస్ట్ కాన్సెప్ట్: బెల్లంకొండ సురేశ్
‘ధ్వని’ కాన్సెప్ట్ చాలా బాగుంది. పదేళ్ల కుర్రాడు లక్ష్మిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం అభినందించదగ్గ విషయం. చాలా మంది నూతన దర్శకుల కంటే లక్షిన్ బెటర్ గా ధ్వని షార్ట్ ఫిలిం ను తీశాడు’అని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు. ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్ లో లక్షిన్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలిం ధ్వని. డెఫ్ అండ్ డంప్ కాన్సెప్ట్ ఈ షార్ట్ ఫిలిం రూపొందించబడింది. నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించిన ధ్వని షార్ట్ ఫిలింకు అశ్విన్ కురమన సంగీతం అందించారు. ధ్వని షార్ట్ ఫిలిం రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సంరద్భంగా బెల్లంకొండ సురేశ్మాట్లాడుతూ.. లక్ష్మిస్ ఈ లఘు చిత్రాన్ని చాలా బాగా తీశాడు. అబ్బాయి భవిష్యత్తులో మరిన్నిమంచి ప్రాజెక్ట్స్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు. దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ...లక్షిన్ తీసిన షార్ట్ ఫిలిం చాలా బాగుంది. ఈ వయసులో అబ్బాయి తీసిన విధానం ఎంతో బాగుంది. ధ్వని కసెప్ట్ తో పదకొండు నిమిషాల్లో అద్భుతంగా తెరకెక్కించారు’ అన్నారు. డైరెక్టర్ లక్షిన్ మాట్లాడుతూ...నేను ధ్వని షార్ట్ ఫిలిం చెయ్యడానికి నన్ను ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ కు థాంక్స్. చిన్న కాన్సెప్ట్ తో తీసిన ఈ షార్ట్ ఫిలిం కు అందరి నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దర్శకుడిగా మంచి సినిమాలు చెయ్యాలి అనేది నా కోరిక. భవిషత్తులో నా పేవరేట్ హీరో అల్లు అర్జున్ తో మూవీ చేయాలనేది నా డ్రీమ్ అని తెలిపారు. -
Big Breaking News: నిర్మాత బెల్లంకొండ సురేష్ పై చీటింగ్ కేసు
-
‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’
గోవింద్ రాజ్, సంతోష్, సీహెచ్ సిద్దేశ్వర్, మందార్, కిరణ్, పూజ, అనుపమ, లావణ్య ప్రధాన పాత్రల్లో అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్ నిర్మించిన చిత్రం ‘సర్వం సిద్ధం’. ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ అనేది ట్యాగ్‌లైన్. వచ్చే నెల 16న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతలు బెల్లంకొండ సురేష్, రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘పుష్కలమైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి మా సినిమా సిద్ధంగా ఉంది. నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’’ అన్నారు దర్శక–నిర్మాత ఎన్ ఆర్ రెడ్డి. ‘‘ఇది మంచి కామెడీ మూవీ’’ అన్నారు రాబిన్ -
బెల్లంకొండపై..అరెస్ట్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తమకు చెల్లించాల్సిన రూ.3.5 కోట్లను తిరిగి ఇవ్వటంలో విఫలమయ్యారని ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2010లో యష్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘బాండ్ బాజా బరాత్’ సినిమా హిందీలో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 2013 బెల్లకొండ సురేష్ సిద్ధార్థ్, సమంత హీరో హీరోయిన్లుగా జబర్దస్ అనే సినిమాను నిర్మించారు. అందులో 19 సీన్లు కాపీ చేశారని ఆరోపిస్తూ యష్‌రాజ్ ఫిలింస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సినిమా ప్రదర్శనను నిలిపేసింది. అయితే జబర్దస్త్ సినిమా నిర్మాణంలో ఉండగానే టెలివిజన్ శాటిలైట్ టెలీకాస్ట్ రైట్స్‌ను రూ.3.5 కోట్లకు ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ విక్రయించారు. యష్‌రాజ్ ఫిలింస్ ఫిర్యాదు మేరకు సినిమా ప్రదర్శన నిలిపేయటంతో పాటు టెలివిజన్‌లోనూ టెలికాస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సదరు టీవీ ఛానెల్‌కు ఆ మొత్తాన్ని బెల్లంకొండ సురేష్ తిరిగి చెల్లించాల్సి ఉన్నప్పటికి ఆరేళ్లుగా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తుండటంతో ఛానెల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. అయితే బెల్లంకొండ తీసుకున్న రూ.3.5 కోట్ల మొత్తం ప్రస్తుతం రూ.11.75 కోట్లకు చేరింది. ఈ మేరకు కోర్టు బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. -
సినిమా రివ్యూ: అల్లుడు శీను
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, తమన్నా, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్, బ్రహ్మనందం తదితరులు ప్లస్ పాయింట్స్: శ్రీనివాస్ యాక్టింగ్ ఫోటోగ్రఫీ సంగీతం మైనస్ పాయింట్స్: కథ, కథనం కామెడీ టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన బెల్లంకొండ సురేశ్ తన కుమారుడు శ్రీనివాస్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం అల్లుడు శీను. పగ, ప్రతీకారం, కామెడీ, నేపథ్యంగా ప్రేమకథా చిత్రంగా రూపొందిన అల్లుడు శ్రీను చిత్రం వీవీవినాయక్ దర్శకత్వంలో రూపొందింది. అల్లుడు శ్రీనుగా శ్రీనివాస్ అకట్టుకున్నాడా అని తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకుందాం. అప్పులు చేస్తూ శ్రీను అల్లరి చిల్లరిగా తిరిగే ఓ తింగరి. తన తమ్ముడి చేతిలో మోసగించి ఆపదలో ఉన్న నర్సింహను శ్రీను రక్షించి చేరదీస్తాడు. అప్పుల వాళ్ల బారి నుంచి తప్పించుకునేందుకు శ్రీను, నర్సింహలు హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ లో మాఫీయా డాన్ భాయ్ కూతురు అంజలిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఓ దశలో శ్రీను ప్రేమను అంజలి రిజెక్ట్ చేస్తుంది. కథ ఇలా సాగుతుంటే తన తమ్ముడు నర్సింహ బ్రతికే ఉన్నాడని భాయ్ కి తెలుస్తుంది. తన కూతరును ప్రేమిస్తున్న శ్రీను, నర్సింహను చంపాలని భాయ్ ప్రయత్నిస్తాడు. భాయ్ కుట్రలను శ్రీను ఎలా ఎదుర్కొన్నాడు? నర్సింహను భాయ్ ఎందుకు చంపాలనుకున్నాడు? అంజలిని ఎలా కన్విన్స్ చేసి తన ప్రేమకు శుభం కార్డు ఎలా వేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే 'అల్లుడు శీను'. అల్లుడు శ్రీనుగా బెల్లంకొండ శ్రీనివాస్ టైటిల్ రోల్ ను పోషించాడు. ఫైట్స్, డాన్స్ లతో తొలి చిత్రంలోనే ఆకట్టుకున్నాడు. కొత్త హీరో అనే ఫీలింగ్ ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే కీలక సన్నివేశాల్లో నటనపరంగా కొంత తడబాటుకు గురైనట్టు కనిపించాడు. డైలాగ్ డెలివరిలో కొంత మెరుగుపరుకుంటే పూర్తి స్థాయి స్టార్ మారే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. భాయ్ కూతురు అంజలిగా సమంత గ్లామరస్ గా కనిపించింది. మాస్ పాటల్లో సమంత మెరుగైన డాన్స్ ఆకట్టుకుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే సమంతకు రొటీన్ పాత్రే. తన పాత్రకు సమంత న్యాయం చేకూర్చింది. ఇక పాటలో తమన్నా తళుక్కుమంది. భాయ్, నర్సింహగా ప్రకాశ్ ద్విపాత్రాభినయం చేశారు. అయితే రెండు పాత్రల్లో పెద్దగా వైవిధ్యం కనిపించలేదు. ప్రకాశ్ రాజ్ ఇలాంటి పాత్రల్లో చాలా సార్లే ప్రేక్షకులకు కనిపించాడు. భాయ్, నర్సింహలో కొత్తదనం ఏమిలేదు. డింపుల్ గా బ్రహ్మనందం కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే గొప్ప కామెడీని పండించలేకపోయాడు. అయితే క్లైమాక్స్, కొన్ని సీన్లలో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రదీప్ రావత్, రఘుబాబు, తనికెళ్ల భరణి ఇతర కారెక్టర్లకు అంతగా స్కోప్ లేకపోయింది. టెక్నికల్: దేవీశ్రీప్రసాద్ జోష్ తో కలిగించే పాటలు ఇప్పటికే ప్రేక్షకులకు రీచ్ అయ్యాయి. అంతే మొత్తంలో పాటల్ని తెరపై చోటా కే నాయుడు అందంగా చిత్రీకరించాడు. అందమైన లోకేషన్లలో చోటా కే నాయుడు కెమెరా పనితనం అదుర్స్ అనిపించింది. డైలాగ్స్ అంతగా పండలేదు. ఓ కొత్త హీరో చిత్రానికి కావాల్సిన హుంగుల్ని డిజైన్ చేయడంలో దర్శకుడు వీవీ వినాయక్ సఫలమయ్యాడు కాని.. కథలో పస లేకపోవడం, కథనం పేలవంగా ఉండటం మైనస్ పాయింట్స్ గా మారాయి. సెకండాఫ్ లో ఓ రొటీన్ సీన్లు విసుగు పుట్టించాయి. అయితే ప్రీ క్లైమాక్స్ లో కొంత వేగం పెంచినా.. చివర్లో మళ్లీ కథ మొదటికివచ్చింది. శ్రీనివాస్ లో ఉన్న జోష్, మంచి ఈజ్ కు ఓ వైవిధ్యమున్న కథ తోడైతే.. సూపర్ హిట్ సాధించే ఛాన్స్ ఉండేది. రొటిన్ కథ, పక్కా మాస్ ఎలిమెంట్స్ తో పర్వాలేదనిపించే 'అల్లుడు శీను' చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశంపైనే విజయం ఆధారపడిఉంది. -
జోరుమీదున్న ఎన్టీఆర్
తారక్‌ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘ఆది’. ఆ సినిమాతో బెల్లంకొండ సురేష్ కూడా స్టార్ నిర్మాతఅయిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతుండటం విశేషం. ‘కందిరీగ’ లాంటి వినోదభరిత చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. తారక్‌ని ఎలా చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారో ఇందులో ఆయన పాత్ర చిత్రణ అలా ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. ‘అత్తారింటికి దారేది’ లాంటి సంచలన విజయం సాధించిన చిత్రంలో నటించిన సమంత, ప్రణీత ఇందులో ఎన్టీఆర్‌తో జతకట్టడం మరో విశేషం. ఈ సినిమాకు ‘రభస’ అనే టైటిల్ మొన్నటిదాకా ప్రచారంలో ఉంది. అయితే... ఆ టైటిల్ కరెక్ట్ కాదని, చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు. ‘జోరు’ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కావచ్చని సమాచారం.