
గోవింద్ రాజ్, సంతోష్, సీహెచ్ సిద్దేశ్వర్, మందార్, కిరణ్, పూజ, అనుపమ, లావణ్య ప్రధాన పాత్రల్లో అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్ నిర్మించిన చిత్రం ‘సర్వం సిద్ధం’. ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ అనేది ట్యాగ్‌లైన్. వచ్చే నెల 16న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతలు బెల్లంకొండ సురేష్, రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘పుష్కలమైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి మా సినిమా సిద్ధంగా ఉంది. నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’’ అన్నారు దర్శక–నిర్మాత ఎన్ ఆర్ రెడ్డి. ‘‘ఇది మంచి కామెడీ మూవీ’’ అన్నారు రాబిన్
Comments
Please login to add a commentAdd a comment