గ్యాంగ్‌స్ట‌ర్‌గా వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ గ్లింప్స్‌ చూశారా? | Matka Intense Opening Bracket Unveiled | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌స్ట‌ర్‌గా వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ గ్లింప్స్‌ చూశారా?

Published Fri, Jan 19 2024 1:47 PM | Last Updated on Tue, Jan 23 2024 8:31 PM

Matka Intense Opening Bracket Unveiled - Sakshi

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ , ‘పలాస 1978’ఫేమ్‌ కరుణ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మట్కా’. . వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌ లో షూటింగ్‌ జరుపుకుంటోంది. నేడు(జనవరి 19) వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫ‌స్ట్‌లుక్‌తో పాటు ‘మట్కా’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

కథానాయకుడు గ్రామోఫోన్‌లో మ్యూజిక్ ని  ప్లే చేయడంతో టీజర్‌ ప్రారంభం అవుతుంది. ఇది రెండు వేర్వేరు టైమ్‌లైన్‌లలో పాత్రలని ప్రజెంట్ చేస్తోంది. నవీన్ చంద్ర గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, పి రవిశంకర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో వ‌రుణ్ కనిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫ‌తేహీతో పాటు మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement