
వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్
‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’, ‘సార్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘అక్టోబరులో షూటింగ్‌ను ఆరంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులను అలరించే మరో మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment