న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ విస్తరణపై మరో సారి దృష్టి పెట్టింది. మూడో దశలో భాగంగా ఇందుకు రూ. 13,000 కోట్లు వెచి్చంచనుంది. తద్వారా 2.19 కోట్ల టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని జత చేసుకోనుంది. వెరసి కంపెనీ మొత్తం సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 18.2 కోట్ల టన్నులకు చేరనుంది. నిధులను అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు అ్రల్టాటెక్ వెల్లడించింది. వారాంతాన సమావేశమైన బోర్డు ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది.
పాత ప్లాంట్ల విస్తరణ, కొత్త ప్లాంట్ల ఏర్పాటు సమ్మిళితంగా తాజా సామర్థ్య విస్తరణ చేపట్టనుంది. ప్రస్తుతం కంపెనీ సిమెంట్ తయారీ వార్షిక సామర్థ్యం దాదాపు 13.25 కోట్ల టన్నులుగా ఉంది. సామర్థ్య వినియోగం 75 శాతంగా నమోదవుతోంది. మూడో దశ విస్తరణ పూర్తయితే దక్షిణాదిలో 3.55కోట్ల టన్నులు, తూర్పు ప్రాంతంలో 4.04 కోట్ల టన్నులు, ఉత్తరాదిన 3.62 కోట్ల టన్నులు, పశి్చమాన 3.38 కోట్ల టన్నులు, మధ్య భారతంలో 3.57 కోట్ల టన్ను లు చొప్పున సిమెంట్ తయారీ సామర్థ్యాలను అందుకోనున్నట్లు అల్ట్రాటెక్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment