సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తర ఫున బరిలోకి దిగే అభ్యర్థుల తొలి జాబితాకు శుక్రవారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సీఈసీకి పంపే జాబితాకు సంబంధించి గురువారం ఢిల్లీలో వరు సగా భేటీలు, చర్చలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ప్రకాశ్ జవదేకర్ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
పార్టీ బలంగా ఉన్న సీట్లు, అభ్యర్థుల బలాబలా లపై పార్టీ పెద్దలతో రాష్ట్ర నేతలు చర్చించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల పర్యటనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణలో ఒంటరిగానే పోటీచేయాలని బీజేపీ నిర్ణయించిన నేపథ్యంలో.. ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో జరిగిన చర్చల అంశాన్ని పార్టీ పెద్దలకు కిషన్‌రెడ్డి వివరించారు.
వరుసగా భేటీలతో..
తొలుత గురువారం మధ్యాహ్నం పార్టీ ఎన్నికల ఇన్ చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నివా సంలో రాష్ట్ర కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ నేతలతోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్స ల్‌లు పాల్గొన్నారు. ఇందులో ఒకే అభ్యర్థి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాపై చర్చించారు. ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్న సెగ్మెంట్లకు సంబంధించి ఆయా అభ్యర్థుల బలాబలాలను సమీక్షించారు.
తర్వాత గురువారం సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మరో సారి కోర్ గ్రూప్ భేటీ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇందులో పాల్గొన్నారు. తొలి జాబితా విడుదలయ్యాక ఎలాంటి అసంతృప్త స్వరాలు వినిపించకుండా ఉండేలా.. ఒక్కో నియో జకవర్గానికి సంబంధించి క్షుణ్నంగా సమీక్షించారు. చర్చించే సమయంలో తెలంగాణ అభ్యర్థుల జాబితాలను మూడు కేటగిరీలుగా.. పార్టీ బలంగా ఉన్న స్థానాలు, గట్టి పోటీ ఇచ్చే స్థానాలు, బలం పుంజుకోవాల్సిన సీట్లుగా జాబితాలను సిద్ధం చేసినట్టు తెలిసింది.
ప్రచార ప్రణాళికపైనా చర్చ
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని దూకుడుగా కొనసాగించే అంశంపై రాష్ట్ర నాయకు లకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, ఎక్కడ భారీ ర్యాలీలు చేపట్టాలన్న దానిపై ఇప్పటికే ఖరారైన ప్రణాళికను అమిత్ షా, నడ్డాలకు రాష్ట్ర నేతలు వివరించారు. వీటితోపాటు కేంద్ర పెద్దల పర్యట నలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment