సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) తుది నిర్ణయం తీసుకోనుంది. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న సమా వేశంలో రాష్ట్ర పార్టీ నుంచి అందిన జాబితాపై చర్చించి తొలిజాబితా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. లేనిపక్షంలో మంగళవారం ఈ జాబి తా వెలువడవచ్చుననే చర్చ పార్టీలో సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ స్థాయిలో ముసాయిదా జాబి తా కూడా సిద్థమైన నేపథ్యంలో 40–45 మందితో అధ్యర్థుల తొలిజాబితా... లేదా ఏకాభిప్రాయం ప్రాతిపదికన అంతకంటే ఎక్కువ సీట్లకే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
తొలి జాబితాలో ఎవరుంటారో?
అధికార బీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో పాటు సగం మందికి పైగా బీ–ఫారమ్‌లు కూడా అందజేయగా, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా 55 మందితో తొలిజాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడో ప్రధానపార్టీ బీజే పీ అభ్యర్థుల జాబితాపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కాగా ఢిల్లీలో సీఈసీ సమావేశానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు, రాష్ట్ర స్క్రీనింగ్ కమి టీ చైర్మన్ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి హాజరు కానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా అమ్మవారి భవానీ మాలను ధరించి, పదిరోజుల పాటు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ ఈ భేటీకి హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టతరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment