సుప్రీం కోర్టు ఆమోదం మేరకు భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు చెందిన రూ.4,025 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు అందజేసింది. దీనికి సంబంధించి ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ తాజాగా వివరాలు వెల్లడించింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదం మేరకే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో మేజర్ వాటాలు కొనుగోలు చేసినట్లు గుర్తించడంతో ఆస్తులు అందజేస్తున్నట్లు పేర్కొంది.
బ్యాంకు రుణ చెల్లింపుల్లో మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై 2019లో భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆస్తులను జప్తు చేసింది. అంతకుముందు నెలలో ఆ రుణాలు చెల్లించలేక కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించింది. ఆ సమయంలో భూషణ్ పవర్ అండ్ స్టీల్ సమస్యకు సంబంధించి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ పరిష్కార ప్రణాళికను ఎన్‌సీఎల్‌టీ ఆమోదించింది. తర్వాత ఈడీ ఆస్తులను జప్తు చేసింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదంతోనే కంపెనీలో వాటాను చేజిక్కించుకునేందుకు బిడ్ వేసినట్లు సుప్రీం కోర్టులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్పష్టం చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి: రైలు నుంచి కింద పడిన వస్తువులను ఈజీగా పొందండిలా..
జేఎస్‌డబ్ల్యు స్టీల్‌ను 1982లో సజ్జన్ జిందాల్ స్థాపించారు. జిందాల్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (జిస్కో), జిందాల్ విజయనగర్ స్టీల్ లిమిటెడ్ (జేవీఎస్ఎల్) కలిసి జిందాల్ స్టీల్‌గా ఏర్పడ్డాయి. ఈ కంపెనీ యూఎస్‌లో ఏటా 35.7 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని అతిపెద్ద తయారీ యూనిట్ కర్ణాటకలోని విజయనగరలో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ ఉక్కు ఉత్పత్తి కేంద్రం.
Comments
Please login to add a commentAdd a comment