Jindal Steel and Power
-
ట్యుటికోరిన్ కోల్ బిడ్డింగ్‌పై జిందాల్ పవర్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ట్యుటికోరిన్ కోల్ టెర్మినల్ (టీసీటీ) బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనుమతించాలంటూ జిందాల్ పవర్ (జేపీఎల్) చేసిన విజ్ఞప్తిని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తిరస్కరించింది. నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను సమర్పించేందుకు జేపీఎల్‌కు అర్హత లేదంటూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఇచి్చన ఉత్తర్వులను సమర్ధించింది. కంపెనీకి గరిష్ట విలువను రాబట్టడమే దివాలా కోడ్ (ఐబీసీ) లక్ష్యం అయినప్పటికీ .. దరఖాస్తుదారుల తుది జాబితాలో లేని కంపెనీలకు మధ్యలో ప్రవేశం కలి్పంచడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొంది. తుది జాబితాలోని సీపోల్ సమర్పించిన బిడ్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ పరిష్కార నిపుణుడు (ఆర్పీ), రుణదాతల కమిటీ (సీవోసీ)కి ఎన్సీఎల్ఏటీ సూచించింది. రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా టీసీటీని కొనుగోలు చేసేందుకు సీపోల్ గతేడాది ఫిబ్రవరి 18న ప్రణాళిక సమరి్పంచింది. దాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) పరిశీలిస్తుండగానే దాదాపు అదే సమయంలో బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు తమకు కూడా అవకాశం కలి్పంచాలంటూ జూలై 12న జేపీఎల్ కోరింది. అయితే, బిడ్డింగ్‌కు అనుమతిస్తూనే.. సీఐఆర్‌పీ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటాయంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తెలిపింది. దీనిపై సందిగ్ధత నెలకొనడంతో స్పష్టతనివ్వాలంటూ ఆర్పీ కోరారు. దీంతో జేపీఎల్‌కు అర్హత ఉండదంటూ ఎన్సీఎల్టీ స్పష్టతనిచ్చింది. ఈ ఉత్తర్వులనే సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని జేపీఎల్ ఆశ్రయించింది. -
వైజాగ్ స్టీల్‌కు జేఎస్పీఎల్ నిధులు
విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్ ప్లాంట్) తాజాగా ప్రయివేట్ రంగ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్)తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రూ. 900 కోట్లు సమకూర్చుకునేందుకు చేతులు కలిపింది. ఈ నిధులతో అమ్మకాల ఆదాయం, నెలవారీ టర్నోవర్ పెంచుకోవడంతోపాటు.. నష్టాలను తగ్గించుకోవాలని ప్రణాళికలు వేసింది. సమయానుగుణ డీల్ కారణంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, నిర్ధారిత గడువు(డిసెంబర్ 30)లోగా నిలకడైన బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్)–3 కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలు కలగనుంది. తద్వారా నెలకు 2 లక్షల టన్నుల హాట్ మెటల్ సామర్థ్యానికి తెరతీయనుంది. రూ. 800–900 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్, బీఎఫ్–3 నిర్వహణకు అవసరమైన ముడిసరుకుల అందజేతకు జేఎస్పీఎల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. దీనిలో భాగంగా స్టీల్ మెలి్టంగ్ షాప్–2 నుంచి ప్రతీ నెలా 90,000 టన్నుల క్యాస్ట్ బ్లూమ్స్‌ను జేఎస్‌పీఎల్‌కు సరఫరా చేయనున్నట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చైర్మన్, ఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. అంతేకాకుండా లక్ష టన్నుల అదనపు అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జేఎస్పీఎల్తో అంగీకారానికి వచ్చినట్లు ట్రేడ్ యూనియన్లతో సమావేశం సందర్భంగా భట్ వెల్లడించారు. ఈ ప్రభావంతో నెలకు రూ. 500 కోట్లమేర అమ్మకాల టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలియజేశారు. ఇది నెలకు రూ. 100 కోట్లు చొప్పున నష్టాలకు చెక్ పడే వీలున్నట్లు వివరించారు. ఈ డీల్ నేపథ్యంలో ఉత్పత్తి పెంపునకు సహకరించాలని, ఇదే విధంగా వృద్ధి, లాభదాయకతలను నిలుపుకునేందుకు దోహదం చేయాలని ట్రేడ్ యూనియన్లకు భట్ విజ్ఞప్తి చేశారు. యూనియన్లు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిలకడకు, లాభదాయకతకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు హామీనిచ్చారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు బీఎఫ్–3 నిర్వహణ వ్యూహాత్మక కార్యాచరణగా పేర్కొన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు దోహదం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
మరిన్ని కష్టాల్లో జిందాల్ స్టీల్
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త , మాజీ ఎంపీ నవీన్ జిందాల్ మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు . న్యూఢిల్లీకి చెందిన, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నాన్ కన్వెర్టబుల్ డిబెంచర్స్ చెల్లించని కారణంగా నష్టాల్లో కూరుకుపోయింది.రుణభారంతో సతమత మవుతున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ సెప్టెంబర్ 30 తేదీ నాటికి మార్పిడికి వీల్లేని డిబెంచర్ల(ఎన్సీడీలు)పై వడ్డీ చెల్లింపుల్లో విఫలమైన వార్తలతో మరోసారి కుదేలైంది. గురువారం నాటి మార్కెట్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో 5 శాతానికి పైగా నష్టపోయింది. ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపులో విఫమైనట్టు బీఎస్ ఈ ఫైలింగ్ లో బుధవారం జిందాల్ స్టీల్ వెల్లడించింది. జిందాల్ చెందిన 11 గ్రూపుల సెక్యూరిటీలు ఈ చెల్లింపుల్లో ఫెయిల్ అయినట్టు ప్రకటించింది. అయితే దీనికి కారణాలను కంపెనీ స్పష్టంగా వివరించ లేదు. 10ఏళ్ల కాలపరిమితిగల ఎన్‌సీడీలకు 9.8 శాతం కూపన్ రేటుకాగా, సెప్టెంబర్ 30న వీటిపై వడ్డీ చెల్లించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న సంస్థ నికర అప్పుల విలువ రూ.46,000 కోట్లను దాటింది. ఈ నేపథ్యంలో ఆస్తుల విక్రయంపై భారీ కసరత్తలులే చేస్తోంది. మరోవైపు కంపెనీ సీఈవో రవి ఉప్పాల అప్పులను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆస్తుల అమ్మకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోనున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, మొజాంబిక్ దేశాల్లో ఉన్న కుకింగ్ కోల్ మైన్స్ విక్రయం ద్వారా నిధులను సమీకరించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి రవి నిరాకరించారు. -
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జేఎస్పీఎల్ ప్లాంట్
డీల్ విలువ రూ.6,500 కోట్లు న్యూఢిల్లీ: నవీన్ జిందాల్‌కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జేఎస్పీఎల్) 1,000 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేయనున్నది. సజ్జన్, నవీన్ జిందాల్‌లు ఇద్దరూ అన్నదమ్ములు. వీరిరువురు సావిత్రి దేవి జిందాల్ కొడుకులు. ఈ డీల్ విలువ రూ.6,500 కోట్లు. ఈ డీల్‌లో భాగంగా జేఎస్‌పీఎల్‌కు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కనీసం రూ.4,000 కోట్లు చెల్లిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 1,000 మెగావాట్ల ప్లాంట్‌కు దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిరితే, మిగిలిన రూ.2,500 కోట్లను చెల్లిస్తుంది. ఈ డీల్ 2018, జూన్ 30 మధ్యకల్లా పూర్తవుతుందని జేఎస్పీఎల్.. పేర్కొంది. జేఎస్పీఎల్ రుణ భారం రూ.46,000 కోట్లుగా ఉంది. ఈ డీల్‌కు ఇరు కంపెనీల వాటాదారులు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదాలను పొందాల్సి ఉంది. జేఎస్‌డబ్ల్యూ కొనుగోళ్ల జోరు జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ఇటీవలనే జై ప్రకాష్ అసోసియేట్స్‌కు చెందిన 1,391 మెగావాట్ల జల విద్యుత్ ప్లాంట్లను కొనుగోలు చేసింది. మధ్యప్రదేశ్‌లోని జైప్రకాశ్ అసోసియేట్స్‌కు చెందిన 500 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను, ఒడిశాలో మెనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీకి ఉన్న 1,050 మెగావాట్ల పవర్ ప్లాం ట్ను కూడా కొనుగోలు చేయనున్నామని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. ఈ కొనుగోళ్లన్నింటిని ఎవర్బెస్ట్ స్టీల్ అండ్ మైనింగ్ హోల్డింగ్స్ అనే ప్రత్యేక సంస్థ ద్వారా జరుపుతామని వివరించింది. -
చేతులు మారనున్న జిందాల్ పవర్ ప్లాంట్ !
న్యూఢిల్లీ: నవీన్ జిందాల్ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్‌కు చెందిన వెయ్యి మెగావాట్ల రాయ్‌ఘర్(చత్తీస్‌ఘర్) విద్యుత్ ప్లాంట్‌ను సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్‌కు సంబంధించిన కొనుగోలు చర్చలు తుది దశలో ఉన్నాయని, డీల్ విలువ రూ.5,500-రూ.5,800 కోట్లు రేంజ్లో ఉండొచ్చని అంచనా. -
బొగ్గు గనుల వేలంలో 176 బిడ్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బొగ్గు గనుల ఈ-వేలానికి కంపెనీలు పోటాపోటీగా బిడ్లు జారీచేస్తున్నాయి. తొలివిడతలో 23 గనులకు జరుగుతున్న వేలంలో మంగళవారం 176 ప్రాథమిక(టెక్నికల్) బిడ్లు దాఖలయ్యాయి. జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) మోనెట్ ఇస్పాత్ వంటి పలు సంస్థలు బిడ్లు వేసిన వాటిలో ఉన్నట్లు సమాచారం. షెడ్యూల్-2 కింద ప్రైవేటు రంగానికి కేటాయించిన ఈ బ్లాక్‌ల వేలంలో స్పందన తమ అంచనాలకు అనుగుణంగానే ఉందని... చాలావరకూ ప్రధాన కంపెనీలు పాల్గొంటున్నాయని బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అయితే, బిడ్ల విలువ ఎంతనేది వెల్లడికాలేదు. బొగ్గు స్కామ్‌లో సుప్రీం కోర్టు మొత్తం 204 గనులను రద్దు చేయడం.. వీటిని వేలం ద్వారా తిరిగి కేటాయించేందుకు మోదీ సర్కారు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జీవీకే పిటీషన్‌పై కేంద్రానికి నోటీసులు: కోల్ ఆర్డినెన్స్ 2014లో ‘పరిహారం’ నిబంధనల రూపకల్పన విధానాన్ని సవాలుచేస్తూ, జీవీకే పవర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 23వ తేదీలోపు ఈ పిటిషన్‌పై వైఖరి తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. జీవీకే దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పునకు లోబడి తోకిసూడ్ నార్త్ కోల్ బ్లాక్ వేలం ఉంటుందని కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. -
జేఎస్పీఎల్ చేతికి రాష్ట్ర కంపెనీ కెనైటా పవర్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కైనటా పవర్ కంపెనీలో 100% వాటాను చేజిక్కించుకున్నట్లు జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) పేర్కొంది. జేఎస్పీఎల్ ఎండీ, సీఈఓ రవి ఉప్పల్ దీన్ని ధ్రువీకరించారు. అయితే, ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనేది వెల్లడించలేదు. నెల్లూరు జిల్లాలో 1,980 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కైనటా పవర్ వద్ద అనుమతులు ఉన్నాయి. ‘3-4 నెలల క్రితమే డీల్ కుదిరింది. సముద్ర తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో ప్లాంట్ స్థలం ఉంది. చుట్టూ ప్రహారీ గోడ సహా పర్యావరణ ఇతరత్రా అనుమతులన్నీ ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కంపెనీని కొనుగోలు చేశాం. 660 మెగావాట్ల మూడు యూనిట్లు లేదా 800 మెగావాట్ల 2 యూనిట్ల చొప్పున విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఇక్కడ ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం విద్యుత్‌కు డిమాండ్ తక్కువగా ఉండ టం వంటి కారణాలతో తక్షణం మేం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని భావిం చడం లేదు’ అని ఉప్పల్ చెప్పారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.10 వేల కోట్లవరకూ ఉండొచ్చని, కొనుగోలును దశలవారీగా పూర్తిచేసేలా ఒప్పందం కుదిరి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దిగుమతి చేసుకున్న బొగ్గుతో ఈ ప్లాంట్‌ను నడిపించాలనేది జేఎస్పీఎల్ ప్రణాళికగా కూడా వారు పేర్కొంటున్నారు. దగ్గరలోనే రైల్వే స్టేషన్, జాతీయ రహదారి, కృష్ణపట్నం పోర్టు వంటి మౌలిక సదుపాయలన్నీ ఉండటంతో ఈ డీల్ జేఎస్‌పీఎల్‌కు చాలా ఉపయోగకరమేననేది పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వి. బాలశౌరి నేతృత్వంలోని కెనైటా మినరల్స్ ప్రమోట్ చేసిన కంపెనీయే కైనటా పవర్. ప్రతిపాదిత పవర్ ప్రాజెక్టుకు దాదాపు 1,200 ఎకరాల భూమిని ఇప్పటికే సమీకరించారు. -
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో ఉక్కు ధరలు పెరిగే అవకాశాలున్నాయి. దేశీయ ఉక్కు దిగ్గజ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఉక్కు ధరలను టన్నుకు రూ.1,000 చొప్పున(2% వరకూ) పెంచాలని నిర్ణయించింది. ఇదే బాటలో ఇతర ఉక్కు కంపెనీలు-సెయిల్, ఎస్సార్ స్టీల్, టాటా స్టీల్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్లు కూడా రానున్న రోజుల్లో ధరలను పెంచనున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఇనుప ఖనిజం ధరలు 2 శాతం, బొగ్గు ధరలు టన్నుకు 20 డాలర్లు చొప్పున పెరిగాయని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ డెరైక్టర్ కమర్షియల్ అండ్ మార్కెటింగ్ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. ధరలు పెంచక తప్పని పరిస్థితని వివరించారు. ఎగుమతి ఆధారిత తయారీరంగ పరిశ్రమలు, వ్యవసాయాధారిత రంగాల నుంచి ఉక్కుకు డిమాండ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని పేర్కొన్నారు. అంతేకాకుండా రికవరీ బాట పడుతున్న పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా నుంచి కూడా ఉక్కుకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు.