న్యూఢిల్లీ: నవీన్ జిందాల్ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్‌కు చెందిన వెయ్యి మెగావాట్ల రాయ్‌ఘర్(చత్తీస్‌ఘర్) విద్యుత్ ప్లాంట్‌ను సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్‌కు సంబంధించిన కొనుగోలు చర్చలు తుది దశలో ఉన్నాయని, డీల్ విలువ రూ.5,500-రూ.5,800 కోట్లు రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.