జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు విమానంలో తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ కోలకతాకు చెందిన ఒక మహిళ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో శుక్రవారం ఒక పోస్ట్ పెట్టింది. దీంతో జిందాల్ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ నవీన్ జిందాల్ స్పందించారు. నిందితుడైన ఉద్యోగిపై "కఠినమైన చర్యలు" తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కోల్‌కతా నుంచి అబుదాబీ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు బాధితురాలు వెల్లడించింది. ఆమె అందించిన వివరాల ప్రకారం కోల్‌కతా నుంచి బోస్టన్‌కు అబుదాబీకి ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రాన్సిట్ విమానంలో బయలుదేరింది. విమానంలో ఆమె పక్కన కూర్చున్న 65 ఏళ్ల వ్యక్తి తాను జిందాల్ స్టీల్ సీఈఓ దినేష్ కుమార్ సరయోగిని తాను పరిచయం చేసుకున్నాడు. కుటుంబం, నేపథ్యంలో అంటూ మెల్లిగా మాటలు కలిపాడు. తాను ఒమన్‌లో నివసిస్తున్నానని, కానీ తరచూ ప్రయాణిస్తుంటా అని చెప్పాడు. తన కొడుకులు పెళ్లిళ్లు అయ్యి, అమెరికాలో స్థిరపడ్డారు అంటూ కబుర్లు చెప్పాడు.
ఇక ఆ తరువాత అతగాడి అసలు రూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. ఆమెను అసభ్య చిత్రాలు చూడమని బలవంతం చేశాడు ఈ షాక్ నుంచి తేరుకునే లోపలే శరీరం చుట్టూ చేతులేసి అసభ్యకరంగా తాకాడు. దీంతో అక్కడినుంచి తప్పించుకుని వాష్‌రూమ్‌కి పారిపోయి విమానంలోని సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. విమానం అబుదాబీలో దిగే సమయానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే తనకు బోస్టన్‌కు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతుందనే భయంతో లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మరోవైపు నిందితుడిపై అబుదాబి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
అయితే తనలాంటి పరిస్థితి మరి ఏ మహిళకు రాకూడదనే ఉద్దేశంతో సోషల్‌మీడియా వేదికగా బహిరంగంగా వెల్లడిస్తున్నట్టు తెలిపింది. దీనిపై స్పందించిన జిందాల్ గ్రూప్ చైర్మన్ ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి వాటిని కంపెనీ అస్సలు సహించదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment